
📌 Key Points
- వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ వ్యవహారం నాలుగేళ్ల తర్వాత నిహారికకు తెలిసింది.
- వరుణ్ తేజ్ చూడటానికి సైలెంట్ గా ఉంటాడు కానీ పెద్ద రౌడీ అని నిహారిక అన్నారు.
- లావణ్య త్రిపాఠి చాలా స్వీట్ పర్సన్ అని నిహారిక కొనియాడారు.
- నిహారిక, లావణ్య ఇంట్లో వెబ్ సిరీస్, స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుంటారు.
నిహారిక కొణిదెల, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వరుణ్ తేజ్, లావణ్య ప్రేమ వ్యవహారం తనకు నాలుగేళ్ల తర్వాత తెలిసిందని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
నిహారికకు వరుణ్-లావణ్యల ప్రేమ ఎలా తెలిసింది?
Niharika Konidela: నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే ఈమె నిర్మాణంలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రాకాసా అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారికకు తన అన్నయ్య వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలా ప్రేమ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారం ముందుగా మీకే తెలుసట కదా ఎలా కనిపెట్టారు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ నాకి కూడా వెంటనే తెలవలేదు, నాలుగేళ్ల తర్వాత వారి లవ్ స్టోరీ గురించి తెలిసిందని నిహారిక తెలిపారు. అన్ని సంవత్సరాలు అంత సీక్రెట్ గా ఎలా మైంటైన్ చేశారు అంటూ ప్రశ్న వేయడంతో ఈ విషయంలో మా అన్న చాలా తోపు అంటూ నిహారిక తెలిపారు. వారిద్దరి గురించి నాకు అనుమానం వచ్చిన తర్వాత మా అన్నని ఏమీ అడగలేదు వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని కన్ఫర్మ్ అయ్యానని తెలిపారు. ఇక వరుణ్ గురించి మాట్లాడుతూ చూడటానికి చాలా సైలెంట్ గా ఉంటాడు కానీ పెద్ద రౌడీ అంటూ తెలిపారు.
వరుణ్ తేజ్ గురించి నిహారిక ఏమన్నారంటే?
ఇండస్ట్రీలో మా అన్నకు పెద్దగా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఉన్నది ఏ ముగ్గురో నలుగురో ఉన్నారు. ఇక హీరోయిన్స్ అయితే అసలు ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఇక మిస్టర్ సినిమా తరువాత ఒక రెండు సంవత్సరాలకు అన్నయ్య బర్త్ డే పార్టీలో లావణ్య కనిపించింది. అప్పుడు తనని చూసి షాక్ అయిపోయాను. ఒక సినిమాతోనే ఈమె మా అన్నకు ఎలా ఫ్రెండ్ అయింది అనే డౌట్ వచ్చింది. ఇక నేను వీరిద్దరి గురించి కన్ఫర్మ్ అయ్యాను. మా అన్న కూడా ఎప్పుడూ నాకు చెప్పలేదు నీకు తెలుసు కదా అంటూ మాట్లాడేవారు. అలా వారి లవ్ స్టోరీ నాలుగేళ్ల తర్వాతనే నాకు తెలిసింది అంటూ నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక లావణ్య త్రిపాఠి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా స్వీట్ పర్సన్. అందరితో బాగా కలిసిపోతుందని ఇక ఇద్దరూ మేము ఇంట్లో ఉన్నప్పుడు వెబ్ సిరీస్ ల గురించి మాట్లాడుకుంటాము అలాగే స్కిన్ కేర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటామని నిహారిక తెలిపారు. తన స్కిన్ చాలా బాగుంటుందని తెలిపారు. ఇంట్లో ఉంటే మేము ఈ విషయాల గురించి మాట్లాడుకుంటాము అంటూ నిహారిక తన వదిన గురించి కూడా తెలియజేశారు. ఇక నిహారిక వరుణ్ తేజ్ ల వివాహం 2023 ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు వాయువ్ తేజ్ అనే కుమారుడు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా లావణ్య పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
లావణ్య త్రిపాఠి పై నిహారిక కామెంట్స్
నిహారిక తన అన్నయ్య వరుణ్ తేజ్, వదిన లావణ్య త్రిపాఠి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


