
ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నిఖిల్, గౌరవ్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో పెద్దగా కనిపించకపోయినా, గౌరవ్‌కు తెలుగు రాకపోయినా, వీరిద్దరూ భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. వారి వారపు, మొత్తం రెమ్యునరేషన్ వివరాలు ఇక్కడ.
Key Points
ఈ వారం బిగ్ బాస్ నుండి నిఖిల్, గౌరవ్ డబుల్ ఎలిమినేషన్ అయ్యారు.
నిఖిల్ హౌస్‌లో కనిపించకుండా 5 వారాలు ఉండి వారానికి రూ. 2.5 లక్షలు పొందారు.
గౌరవ్‌కు తెలుగు రాకపోయినా, 5 వారాలకు రూ. 2.1 లక్షలు చొప్పున అందుకున్నారు.
తక్కువ ప్రదర్శనతోనే నిఖిల్ 12.5 లక్షలు, గౌరవ్ 10.5 లక్షలు సంపాదించారు.
నిఖిల్, గౌరవ్: బిగ్ బాస్ లో కనిపించని ఆటగాళ్ళు
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ తెలుగు 9 షోకి కొందరు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చారు. ఫైర్ స్టార్మ్ వైల్డ్ కార్డు ఎంట్రీలుగా వచ్చిన వారంతా ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నిఖిల్, గౌరవ్ బయటకి వెళ్లారు. వీళ్ళిద్దరూ అసలు హౌస్ కి ఎందుకు వచ్చారో కూడా ఆడియన్స్ కి అర్థం కావడం లేదు.
నిఖిల్ అయితే అసలు హౌస్ లో ఎక్కడ ఉన్నాడు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. హౌస్ మేట్స్ అంతా గ్రూప్ గా అసెంబుల్ అయినప్పుడు మాత్రమే కనిపిస్తాడు. మిగిలిన సమయంలో ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. బిగ్ బాస్ బజ్ లో శివాజీ కూడా నిఖిల్ పై ఇదే రకమైన సెటైర్ వేశారు. హౌస్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు చూశాను నిన్ను.. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కనిపించకుండా చాలా బాగా దాగుడుమూతలు ఆడావు అని అన్నారు.
నిఖిల్ రెమ్యునరేషన్ వివరాలు
నిఖిల్ శనివారం ఎలిమినేట్ కాగా ఆదివారం రోజు గౌరవ్ గుప్తా ఎలిమినేట్ అయ్యాడు. గౌరవ్ గుప్తా నిఖిల్ కంటే కాస్త బెటర్ అని చెప్పొచ్చు. గౌరవ్ కి ఒక్క ముక్క తెలుగు రాదు. అయినప్పటికీ ఎంతోకొంత పెర్ఫామ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ లాంగ్వేజ్ రాకపోవడం అతడికి పెద్ద మైనస్ అనే చెప్పాలి. గేమ్ ఆడడానికి హౌస్ లోకి పంపిస్తే జర్నలిస్ట్ లా బిహేవ్ చేశావు ఏంటి అని శివాజీ గౌరవ్ పై సెటైర్లు వేశారు.
వీరిద్దరూ ఎలిమినేట్ కావడంతో నిఖిల్, గౌరవ్ రెమ్యునరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి. నిఖిల్ తెలుగులో గృహలక్ష్మి లాంటి టీవీ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందాడు. అతడి గుర్తింపునకు తగ్గట్లుగానే బిగ్ బాస్ లో రెమ్యునరేషన్ కూడా లభించింది. నిఖిల్ వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి హౌస్ లో 5 వారాలు ఉన్నారు. వారానికి నిఖిల్ కి రూ.2.5 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే నిఖిల్ కి 5 వారాలకి గాను 12.5 లక్షల వరకు రెమ్యునరేషన్ అందింది. ఇది భారీ మొత్తమే అని చెప్పొచ్చు.
గౌరవ్ గుప్తా భారీ రెమ్యునరేషన్
ఇక గౌరవ్ కూడా తెలుగులో మల్లి లాంటి టీవీ సీరియల్స్ తో పాపులర్ అయ్యాడు. గౌరవ్ కి వారానికి 2.1 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు. అంటే 5 వారాలకి గాను గౌరవ్ కి 10.5 లక్షల రెమ్యునరేషన్ ముట్టింది. బుల్లితెర నటులు ఇద్దరూ హౌస్ లో అంతగా కష్టపడకుండానే లక్షల్లో రెమ్యునరేషన్ తో బయటకి వెళుతున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో పెద్దగా కష్టపడకపోయినా, నిఖిల్, గౌరవ్‌లు లక్షల్లో రెమ్యునరేషన్ సంపాదించి బయటపడటం ఆశ్చర్యకరం. బుల్లితెర నటులకు బిగ్ బాస్ మంచి ఆదాయ వనరుగా మారిందని ఇది నిరూపిస్తుంది.


