
📌 Key Points
- సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా రొమాంటిక్ ప్రేమకథ చిత్రం ‘నిలవే’ విడుదల!
- దర్శకత్వం: సౌమిత్ రావు, సాయి కె వెన్నెం; నిర్మాణ సంస్థ: పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
- అర్జున్, అతిథిల మధ్య సిచ్చువేషన్‌షిప్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథనం
- ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైన ‘నిలవే’ మూవీకి యూత్ నుండి విశేష స్పందన!
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ‘నిలవే’ మూవీ విడుదల అయింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ. అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసేలా ఉందా? చూద్దాం!
నిలవే మూవీ స్టోరీ లైన్ ఏంటి?
Nilave Movie Review In Telugu: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ మ్యూజికల్ పొయెటిక్ లవ్ స్టోరీ సినిమా నిలవే. హీరో సౌమిత్ రావుతోపాటు సాయి కె వెన్నెం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నిలవే రివ్యూలో తెలుసుకుందాం.
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు
నిర్మాణ సంస్థ: పీవోవీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె వెన్నం
దర్శకత్వం: సౌమిత్ రావు, సాయి కె వెన్నం
హీరో హీరోయిన్ల నటన ఎలా ఉంది?
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026
సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన తెలుగు పొయెటిక్ మ్యూజికల్ రొమాంటిక్ సినిమా ‘ నిలవే ’. ఈ చిత్రానికి సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పీవోవీ ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తాహెర్ సినీ టెక్ సౌజన్యంతో సాయి వెన్నం, గిరిధర్ రావు పోలాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.
అందరూ కొత్తవాళ్లే కావడంతో ఈ చిత్రంపై మొదట్లో పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. కానీ, నిలవే ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగింది. చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరి ఇవాళ (ఫిబ్రవరి 13) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో నేటి నిలవే రివ్యూ లో తెలుసుకుందాం.
ఫ్లాట్‌లో ఊరి వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో నుంచి ఒక అందమైన అమ్మాయి అతిథి(శ్రేయాసి సేన్) కనిపిస్తుంది. తొలి చూపులోనే అతిథిని ప్రేమిస్తాడు అర్జున్. పరిచయం పెంచుకొని దగ్గర అవుతాడు. అతిథి కూడా అర్జున్‌తో ఫిజికల్‌గా దగ్గరవుతుంది. కానీ, ప్రేమను మాత్రం అంగీకరించదు.
సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటి?
అతిథి ప్రేమకు ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏంటి? అతిథి ప్లాష్‌బ్యాక్ ఏంటి? పెళ్లి, పిల్లలతో ఒక మంచి ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలనుకున్న అర్జున్ కల నెరవేరిందా? శాంతను ఎవరు? అతిథి అర్జున్ మధ్య ఉన్న సిచ్చువేషన్‌షిప్ ఏంటీ? అతిథి తన జీవితంలోకి వచ్చిన తర్వాత అర్జున్‌లో వచ్చిన మార్పు ఏంటి? చివరకు అర్జున్, అతిథిలు ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే నిలవే చూడాల్సిందే.
హీరో ఆత్మహత్యకు ప్రయత్నించే సన్నివేశంతో చాలా ఆసక్తికరంగా ప్రారంభమైన సినిమాలో ఒంటరితనం మనిషిని ఎలా కుంగదీస్తుంది అనే విషయాన్ని అర్జున్ పాత్రతో చూపించారు. తోడు కోసం వెతికే క్రమంలో ఎదురుదెబ్బలు తగలడం.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే సమయంలో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది.
అప్పటి నుంచి కథనం రొమాంటిక్‌గా సాగుతుంది. హీరో, హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయి. అర్జున్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. అతిథి ప్రేమపై వెనకడుగు వేయడంతో.. ప్లాష్‌బ్యాక్‌లో ఏదో ఒక స్టోరీ ఉందనే విషయం ఊహించొచ్చు. అయితే అదేంటనే క్యూరియాసిటీని మాత్రం చివరి వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
ఇక అతిథిగా శ్రేయాసి సేన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమా అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటనతో మెప్పించింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. వైవా హర్ష కొన్ని చోట్ల నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు.
మొత్తానికి నిలవే మూవీ యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంది. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


