
నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో శాలిని కుట్రలు, చంద్ర ప్రయత్నాలు, విరాట్ ఇరుకులతో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. తల్లీకూతురును ఇరికించిన చంద్ర, వ్రతం సందర్భంగా ఎదుర్కొనే సవాళ్లు, విరాట్ యొక్క ఇరుకులు ఈ ఎపిసోడ్ ముఖ్యాంశాలు.
Key Points
శాలిని కపట నాటకంతో తల్లీకూతురును ఇరికించింది.
విరాట్ భార్య, అత్తయ్య మధ్య ఇరుక్కుపోయాడు.
కామాక్షి, శ్రుతి వ్రతం చెడగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
శాలిని యొక్క కపట నాటకం
నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 20వ తేదీ ఎపిసోడ్ లో కామాక్షి, శ్రుతి చాటుగా వింటున్నారని చంద్రకళతో సీరియస్ గా మాట్లాడతాడు విరాట్. అది అర్థం చేసుకోని చంద్ర ప్రశ్నలు అడుగుతుంది. నువ్వు గెలిస్తే అప్పుడు ప్రేమ పుడుతుందని అంటాడు విరాట్. గెలుస్తాను బావ, వ్రతం నేను సంతోషంగా చేయాలని నువ్వు అనుకుంటే ఈ డ్రెస్ వేసుకో అని వెళ్లిపోతుంది చంద్ర. చంద్ర, అత్తయ్య మధ్య ఇరుక్కుపోయానని విరాట్ అనుకుంటాడు.
క్రాంతి వ్రతంలో వేసుకోబోయే కలర్ కాంబినేషన్ ఇదే డ్రెస్ లు చూపిస్తుంది శాలిని. నువ్వు వదినను ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఇంకా ద్వేషం ఉందా? అని ప్రశ్నిస్తాడు క్రాంతి . నా సపోర్ట్ ఫుల్ గా చంద్రకే కానీ సీక్రెట్ గా. ఎందుకంటే శ్యామల పిన్ని ఊరుకోదు. వ్రతం రెండు జంటలు బాగా చేసుకోవాలి. చంద్ర ప్రూవ్ చేసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలని క్రాంతిని హగ్ చేసుకుంటుంది శాలిని . నటించడం కష్టమేనని మనసులో అనుకుంటుంది శాలిని.
చంద్ర మరియు తల్లీకూతురు
వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. విరాట్ కూడా పూజలో కూర్చుంటాడేమో అని కామాక్షి, శ్రుతి డౌట్ పడతారు. తన ప్లాన్ ఫెయిల్ కాదని శ్యామల అంటుంది. శాలిని, చంద్ర కలిసి అతిథులను ఆహ్వానిస్తారు. మరోవైపు వ్రతం చెడగొట్టాలని కామాక్షి, శ్రుతి అనుకుంటారు. అమ్మవారి పూజ, ప్రసాదం గురించి పంతులు చెప్తాడు. పూర్ణం బూరెలు లేకపోతే ఎలా అని అందరూ అనుకుంటారు. అప్పుడు బూరెలు చేయడంలో సిద్ధహస్తురాలైన కామాక్షి పిన్ని ఉంది కదా అని చంద్రకళ ఇరికిస్తుంది. పిండి రోట్లో రుబ్బాలని పంతులు చెప్తాడు. శ్రుతి హెల్ప్ కూడా తీసుకోమ్మని చంద్ర తల్లీకూతురును బుక్ చేస్తుంది.
ఏంటీ బావ నువ్వు ఇంకా రెడీ కాలేదా? అని విరాట్ గదిలోకి వెళ్లి చంద్ర అడుగుతుంది. అక్కడే పువ్వుల దండలు రెడీ చేస్తుంది. టేబుల్ ఫ్యాన్ ఆన్ చేస్తే చంద్ర కంట్లో దుమ్ము పడుతుంది. అది ఊపడానికి విరాట్ వెళ్తుంటే శ్యామలను చూసి ఆగిపోతాడు. అత్త అని శ్యామలను పిలుచుకుపోతాడు. చంద్ర కంట్లో నలుసు పడిందంటా నేను ఎందుకు తీయాలి? అని అడుగుతాడు విరాట్. త్వరగా హెల్ప్ చేయండి ప్లీజ్ అని చంద్ర అంటుంది. చంద్ర కంట్లో శ్యామల ఊదుతుంది.
విరాట్ యొక్క ఇబ్బందులు
వ్రతానికి అడ్డు పడతామనే మనల్ని పక్కకు పంపించిందని శ్రుతితో కామాక్షి చెప్తుంది. ఇక్కడ పప్పు ఉడికేలోపు చంద్రకు మంట పెట్టి వస్తానని కామాక్షి వెళ్తుంది. విరాట్ ను డ్రెస్ వేసుకోమని రిక్వెస్ట్ చేస్తుంది చంద్ర. అక్కడి నుంచి వెళ్తూ పడిపోతుంటే శాలిని పట్టుకుంటుంది. జాగ్రత్త చంద్ర.. బ్యాలెన్స్ తప్పుతుంది నువ్వా? మనసా? అని అడుగుతుంది శాలిని. ఇద్దరు కలిసి దారాలు కడతారు. అది చూసి క్రాంతి, విరాట్ హ్యాపీగా ఫీలవుతారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి వ్రతం ఎలా ముగుస్తుంది? శాలిని కుట్ర విజయవంతం అవుతుందా? విరాట్ తన ఇబ్బందుల నుండి బయటపడగలడా? ఇవన్నీ తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడాలి.


