|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూలై 17 ఎపిసోడ్: కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్.. వ్రతం కంప్లీట్.. శాలిని నిజస్వరూపం తెలుసుకున్న క్రాంతి

Published: 16-07-2025, 11:47 PM
నిన్ను కోరి జూలై 17 ఎపిసోడ్: కామాక్షి, శ్రుతి ప్లాన్ రివర్స్.. వ్రతం కంప్లీట్.. శాలిని నిజస్వరూపం తెలుసుకున్న క్రాంతి

నిన్ను కోరి సీరియల్ జూలై 17 ఎపిసోడ్ లో, కామాక్షి, శ్రుతి విరాట్, చంద్రకళ వ్రతానికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తారు. అయితే, వారి ప్రయత్నం విఫలం అవుతుంది. మరోవైపు, క్రాంతి శాలిని నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు.

Key Points

1

కామాక్షి, శ్రుతి వ్రతం చెడగొట్టే ప్రయత్నం విఫలం.

2

విరాట్, చంద్రకళ వ్రతం పూర్తి చేస్తారు.

4

శాలిని నిజస్వరూపం క్రాంతికి వెల్లడి అవుతుంది.

కామాక్షి, శ్రుతి యొక్క వ్రతం ఆటంకం

నిన్ను కోరి సీరియల్ టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ, విరాట్ చేయబోయే వ్రతానికి ఆటంకం కలిగించేందుకు కామాక్షి, శ్రుతి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. విరాట్, చంద్రకళకు బ్రహ్మముడి వేయాలని పంతులు అంటే.. ఇదేమైనా వివాహమా? అని అడుగుతాడు విరాట్. కానీ శ్యామల చెప్పేసరికి పంతులు బ్రహ్మముడి వేస్తాడు. యజ్ణం ప్రారంభిస్తారు. హోమం నుంచి వచ్చే పొగ పీల్చుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అని శ్రుతి దగ్గరగా కూర్చుంటుంది.

శ్రుతి ఒక్కసారిగా హోమంలో కెమికల్ పౌడర్ చల్లుతుంది. అందరూ షాక్ అవుతారు. ఏం చేశావే నువ్వు అంటూ శ్రుతిని కొడుతుంది శ్యామల . తను మంచి పనే చేసింది. అలా కర్పూరం పొడి చల్లితే మంట ఆరిపోకుండా ఉంటుంది. పూర్ణాహుతి జరిగే వరకూ కర్పూరం అలాగే వేస్తూ ఉండమ్మ అని పంతులు అనడంతో ఈ సారి కామాక్షి, శ్రుతి షాక్ అవుతారు. నీకు మంచి మొగుడే వస్తాడులే వేయ్ అని శ్యామల అంటుంది.

పవర్ ఫుల్ కెమికల్ అని పెద్ద బిల్డప్ ఇచ్చి, కర్పూర పొడి చేతిలో పెట్టి వెళ్లిపోతాడా? వ్రతం చెడగొడదామనుకుంటే మనమే దగ్గరుండి చేయించినట్లయింది అని కామాక్షి, శ్రుతి ఫీల్ అవుతారు. హోమంలో పూర్ణాహుతి సమర్పించి విరాట్ , చంద్ర యజ్ణాన్ని ముగిస్తారు.

విరాట్, చంద్రకళ యొక్క పూర్ణాహుతి

మరోవైపు డబ్బుల కోసం శాలిని దగ్గరకు సుందర్ వస్తాడు. ఇతను నా డిజైన్స్ వాడుకున్న ఆపోజిట్ కంపెనీ ఎంప్లాయ్ కదా, శాలినికి డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు అని క్రాంతి ఆలోచనలో పడతాడు. రూ.20 లక్షలు తెచ్చారా అని అడుగుతాడు సుందర్. అంత క్యాష్ లేదు అందుకే డబ్బుతో పాటు నగలు కూడా తీసుకొచ్చా అని శాలిని బ్యాగ్ ఇస్తూ మెసేజ్ లు, డిజైన్స్ డిలీట్ చేయమంటుంది. అది విని క్రాంతి షాక్ అవుతాడు.

బంగారు గుడ్లు పెట్టే బాతును ఎవరైనా చంపుకుంటారా? వాటితో నాకు ఇంకా చాలా పని ఉందని సుందర్ అనగానే శాలిని చెంప మీద కొట్టి బెదిరిస్తుంది. బ్యాగు తీసుకుని సుందర్ వెళ్లిపోతాడు. అక్కడ క్రాంతిని చూసి శాలిని కంగారు పడుతుంది. నా డిజైన్స్ లీక్ చేసి పరువు తీసింది నువ్వేనా? అంటూ ఫైర్ అవుతాడు క్రాంతి. డిజైన్స్ ను చంద్ర వల్లే వేయగలిగాను అని క్రెడిట్ ఇవ్వడం నాకు నచ్చలేదు అందుకే ఇలా చేశానని శాలిని చెప్తుంది.

క్రాంతికి శాలిని నిజస్వరూపం వెల్లడి

వెన్నుపోటు పొడుస్తావని కలలో కూడా ఊహించలేదని క్రాంతి ఫీల్ అవుతాడు. మన లైఫ్ లో చంద్ర జోక్యం ఉంటే నచ్చదు క్రాంతి అని శాలిని అనడంతో కోపంతో వెళ్లిపోతాడు.

గుడిలో ఏడుస్తూ శ్యామలకు థ్యాంక్స్ చెప్తుంది చంద్రకళ . మా అమ్మ తర్వాత నా గురించి ఇంతలా ఆలోచించేది మీరే పిన్ని. మీరు దేవతలా అండగా నిలబడ్డారు అని చంద్ర చెప్తుంది. నేను ఉండగా నీకు ఎలాంటి లోటు రానివ్వను, విరాట్ నీతో సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత నాది అని శ్యామల అంటుంది. గుడిలో ముసలి దంపతుల ప్రేమ చూసి, మాటలు విని అందరూ హ్యాపీ అవుతారు. వాళ్లలాగే మీరు కూడా జీవితాంతం సంతోషంగా కలిసి బతకాలి అని శ్యామల అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరికి, శాలిని యొక్క క్రూరమైన చర్యలు క్రాంతికి తెలిసి, వారి మధ్య విభేదం తీవ్రమవుతుంది. చంద్రకళ వ్రతం పూర్తి చేసుకొని శాంతిని పొందుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.