|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూన్ 21 ఎపిసోడ్: బెడిసికొట్టిన శ్రుతి ప్లాన్- ఉక్కిరిబిక్కిరైన విరాట్- క్రాంతిపై నిందలు- డీల్ క్యాన్సిల్!

Published: 20-06-2025, 11:55 PM
నిన్ను కోరి జూన్ 21 ఎపిసోడ్: బెడిసికొట్టిన శ్రుతి ప్లాన్- ఉక్కిరిబిక్కిరైన విరాట్- క్రాంతిపై నిందలు- డీల్ క్యాన్సిల్!

నిన్ను కోరి సీరియల్ జూన్ 21 ఎపిసోడ్‌లో శ్రుతి చేసిన ప్రయత్నం విఫలమైంది. విరాట్‌కు ఉప్పు హల్వా తినడం వల్ల అనారోగ్యం. క్రాంతికి డీల్ రద్దయ్యింది. ఈ ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయి.

Key Points

1

శ్రుతి ప్లాన్ బెడిసికొట్టి విరాట్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది.

2

ఉప్పు హల్వాతో విరాట్‌కు తీవ్ర అస్వస్థత.

4

చంద్రకళ, విరాట్ మధ్య పెరిగిన గొడవలు.

శ్రుతి యొక్క ప్రణాళిక విఫలం

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్ మీద శ్రుతి పడటంపై నీకు సిగ్గులేదా. డిస్టన్స్ చేయాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది చంద్రకళ. తర్వాత శ్రుతి దగ్గరికి వెళ్లి మనం క్లోజ్‌గా ఉంటే చంద్రను టార్చర్ పెట్టొచ్చు. ఈరోజు నుంచి మనం చాలా క్లోజ్‌గా ఉందాం. చంద్రకు నిద్రపట్టకుండా చేద్దాం అని విరాట్ అంటాడు.

నువ్ హల్వా బాగా చేస్తావట కదా. బ్రేక్ ఫాస్ట్ కింద అది చేయు. చంద్రను ఏడిపిద్దాం అని విరాట్ వెళ్లిపోతాడు. బావ నీ రూట్‌లోకి వచ్చాడే. తిప్పేసుకో అని కామాక్షి అంటుంది. దాంతో శ్రుతి హల్వా వండుతుంది. వంట గదిలోకి వచ్చిన చంద్ర షుగర్‌కు బదులు సాల్ట్ పెడుతుంది. అది చూడకుండా హల్వాలో ఉప్పు వేస్తుంది శ్రుతి. తర్వాత హల్వ తినమని విరాట్‌ను పిలుస్తుంది.

చంద్ర ఉందని విరాట్ ఓవర్ చేస్తాడు. హల్వాను నోట్లో పెట్టుకున్న విరాట్ షాక్ అవుతాడు. నేను ఓడిపోతే ఇది ఆడుకుంటుంది. కష్టమైన సరే ఇది కంప్లీట్ చేయాలని హల్వా మొత్తం అతి కష్టంగా తింటూ విరాట్ ఉక్కిరిబిక్కిరి అవుతాడు. దాంతో శ్రుతి తన వంట గురించి గొప్పగా చెప్పుకుంటుంది. అది భరించలేని విరాట్ శ్రుతిని తిడతాడు. ఇది హల్వా ఏంటే. ఏదో భరిస్తూ తింటే నీ గొప్పలు తట్టుకోలేకపోయానే. హల్వాతో హతమార్చేలా చేశావే అని విరాట్ అంటాడు.

విరాట్ యొక్క అస్వస్థత

తర్వాత కడుపు పట్టుకుని అవస్థలు పడతాడు విరాట్ . ఇంకోసారి శ్రుతి వండింది తినకూడదని అనుకుంటాడు విరాట్. వాష్‌రూమ్‌కు విరాట్ పరిగెత్తుతూనే ఉంటాడు. మజ్జిక తాగి అరటిపండు తింటే మోషన్స్ తగ్గుతాయని చంద్రకళ ఇస్తుంది. విరాట్ తీసుకోనంటే బలవంతంగా నోట్లో పోస్తానని బెదిరిస్తుంది చంద్ర. దాంతో విరాట్ మజ్జిగ తాగి అరటి పండు తింటాడు.

కాస్తా బెటర్‌గా ఉందని విరాట్ అంటాడు. శ్రుతితో ఫ్లర్టింగ్ చేస్తే ఊరుకోను అని బెదిరిస్తుంది చంద్రకళ. నీతో గొడవ పడలేనని పడిపోతాడు విరాట్. మరోవైపు క్రాంతి దగ్గరికి స్పాన్సర్స్ వచ్చి కాంట్రాక్ వాపస్ తీసుకుంటామని చెబుతారు. నిజానికి మీ మీద పోలీస్ కంప్లైట్ ఇవ్వాలి. కానీ, కాంట్రాక్ట్ మాత్రమే వాపస్ తీసుకుంటున్నాం అని వాళ్లు అంటారు.

క్రాంతిపై నిందలు మరియు డీల్ రద్దు

కారణం చెప్పకుండా ఏంటండి ఇది అని చంద్రకళ అంటే.. ఆగమ్మా నువ్ సీతదేవి, ఈయన లక్ష్మణుడు అన్నట్లు మాట్లాడారు ఆరోజు. కానీ, ఎంత పెద్ద ఫ్రాడ్సో తెలిసింది. పక్కోడి డిజైన్స్ కాపీ కొట్టి నీవని చెబుతావా అని స్పాన్సర్ అంటాడు. కాపీ కొట్టాడని ఎలా చెబుతున్నారని విరాట్ అడుగుతాడు. మీరు సబ్‌మిట్ చేయడానికి వారం ముందే ఇవే డిజైన్స్ మీద పెటంట్ రైట్స్ ఉన్నాయని ఫ్రూప్స్ చూపిస్తారు.

ఆయన కాపీ కొట్టకుంటే ఆవిడ చూసి చెప్పి ఉండొచ్చుగా అని చంద్రను అంటారు. క్యాన్సిల్ చేసుకుని క్రాంతి, చంద్రపై నిందలు వేసి స్పాన్సర్స్ వెళ్లిపోతారు. అంతా చంద్రను తప్పుబట్టి తిడతారు. కావాలనే పరువు తీయడానికి ఇలా చేశావని శాలిని , కామాక్షి అంటారు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

శ్రుతి ప్రణాళిక వల్ల విరాట్ ఇబ్బందుల్లో పడ్డాడు. క్రాంతికి డీల్ రద్దుతో పాటు నిందలు ఎదురయ్యాయి. చివరికి చంద్రకళ, విరాట్ మధ్య గొడవలు మరింత తీవ్రమయ్యాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.