|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూన్ 28 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన శ్యామల- ఎస్సై ద్వారా తెలిసిపోయిన నిజం- రఘురాం కేస్ వాపస్!

Published: 27-06-2025, 11:46 PM
నిన్ను కోరి జూన్ 28 ఎపిసోడ్: చంద్రకళను మెడపట్టి గెంటేసిన శ్యామల- ఎస్సై ద్వారా తెలిసిపోయిన నిజం- రఘురాం కేస్ వాపస్!

నిన్ను కోరి సీరియల్ జూన్ 28 ఎపిసోడ్‌లో చంద్రకళ ఇంటి సభ్యులతో గొడవ పడుతుంది. శ్యామలకు చంద్రకళ గురించి నిజం తెలిసి, ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది. రఘురాం కేసు కూడా కథలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Key Points

1

విరాట్, చంద్రకళను తప్పుడు నేరం చేసిందని భావిస్తాడు.

2

శ్యామల, చంద్రకళను ఇంటి నుండి బయటకు గెంటేస్తుంది.

4

కామాక్షి కలలో చంద్రకళను గెంటేసిన ఘటన జరుగుతుంది.

విరాట్ మరియు చంద్రకళ మధ్య గొడవ

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళ బెడ్ రూమ్‌కి వస్తుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు. ఇప్పుడు ఇప్పుడే కోలుకునే నాన్నని ఇలా కింద పడేసావు ఎందుకు అంత కక్ష సాధింపులాగా చేస్తున్నావ్ అని చంద్రకళను విరాట్ తిడతాడు. దానికి చంద్రకళ నేను కావాలని చేయలేదు అని చాలా చెప్పి చూస్తుంది.

అయినా కానీ, చంద్రకళ ఎంత చెప్పినా విరాట్ వినడు. దాంతో చంద్రకళ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టే అందరి ముందు దోషిగా కనిపిస్తుంది. శ్యామలతో సహా అందరూ చంద్రకళను తిట్టేసరికి విరాట్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక శృతి శాలిని కామాక్షి ముగ్గురు కలిసి ఆ చంద్రకళని ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలి అని ప్లాన్ చేస్తుంటారు.

అక్కడ శాలిని వాళ్లిద్దరితో ఆ ప్లాన్ మొత్తం చెబుతుంది. వాళ్లు కూడా ఎగ్జైట్ అయిపోయి ఇక రేపు చంద్రకళని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నామని సంతోషంగా అనుకుంటారు శాలిని, కామాక్షి, శ్రుతి. మరుసటి రోజు ఉదయాన్నే పోలీసులు జగదీశ్వరి ఇంటికి వస్తారు. రఘురాం ఆక్సిడెంట్ కేసు మీరు పెట్టారు కదా. అది ఇంకా వాపస్ తీసుకోలేదు. ఆ కేస్ అలాగే రన్నింగ్‌లో ఉంది మీరు దాన్ని రిటర్న్ తీసుకోమని జగదీశ్వరితో ఎస్సై అంటాడు.

శ్యామల ఆగ్రహం మరియు చంద్రకళను బయటకు గెంటడం

మేము మర్చిపోయాం సార్. కానీ, ఆ కేసు రన్నింగ్‌లో ఉందని మాకు తెలియదు అని జగదీశ్వరి చెబుతుంది. అక్కడే ఉన్న శ్యామల అసలు యాక్సిడెంట్ చేసింది ఎవరు. వాళ్లెవరో తెలిస్తే ఊరికే వదిలిపెట్టను అని తెగ ఫైర్ అయిపోయి ఎస్ఐని అడుగుతుంది శ్యామల. దాంతో ఇంకెవరు ఆ వరదరాజుల కుటుంబమే అని ఎస్సై చెబుతాడు.

దాంతో మరింతగా శ్యామల కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ వరదరాజుల కుటుంబం అస్సలు మంచిది కాదు. ఆ కుటుంబ వ్యక్తులు పరమ నీచులని శ్యామల ఆగ్రహంతో ఊగిపోతుంది. మరి ఆ ఇంటి మనిషి చంద్రకళ ఇక్కడే ఉందిగా అని కామాక్షి అంటుంది. ఏంటీ అని శ్యామల గట్టిగా నిలదీస్తుంది. దాంతో సుభద్ర కూతురు చంద్రకళ అని కామాక్షి తప్పక చెబుతుంది.

రఘురాం కేసు మరియు ఎస్సై పాత్ర

ఇన్నాళ్లు మంచిదానిలా నటించావా అని చంద్రకళపై ఫైర్ అవుతుంది శ్యామల. చంద్రకళని గట్టిగా తిట్టి మెడ పట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది శ్యామల. చంద్రకళ ఎంత చెప్పిన శ్యామల వినకుండా బయటకు గెంటేస్తుంది. అయితే, ఇదంతా కామాక్షి డ్రీమ్‌లో జరుగుతుంది. దాంతో కామాక్షి సంతోషిస్తూ చప్పట్లు కొడుతుంది. అంతా ఏమైందని అడగడంతో కామాక్షి తేరుకుంటుంది.

అయ్యయ్యో.. ఎస్సై ద్వారా చంద్రకళ గురించి నిజం తెలిసి శ్యామల బయటకు గెంటేసినట్లు ఊహించుకున్నానే. అయినా జరిగేది అదే కదా అని మనసులో అనుకుంటుంది కామాక్షి. కానీ, జగదీశ్వరి వచ్చి ఆ కేసును నేను రిటర్న్ తీసుకుంటాను అని చెప్పడంతో సరే అని చెప్పి ఎస్సై వెళ్లిపోతాడు. దాంతో మళ్లీ దుష్ట త్రయం ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు, కామాక్షి కలలో చంద్రకళను బయటకు గెంటేసిన దృశ్యం చూస్తాం. రఘురాం కేసు మరియు చంద్రకళ నిజ స్వరూపం తెలియడం కథలో తిరుగుముఖం పుట్టించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.