|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి మే 30 ఎపిసోడ్: చంద్రకళ చెంప చెల్లుమనిపించిన జగదీశ్వరి- శాలిని ప్లాన్ సక్సెస్!

Published: 30-05-2025, 5:27 AM
నిన్ను కోరి మే 30 ఎపిసోడ్: చంద్రకళ చెంప చెల్లుమనిపించిన జగదీశ్వరి- శాలిని ప్లాన్ సక్సెస్!

నిన్ను కోరి సీరియల్ మే 30 ఎపిసోడ్ లో ఇంట్లో డబ్బు మాయమవడంతో చంద్రకళపై అనుమానాలు పెరిగాయి. శాలిని, జగదీశ్వరి చంద్రకళను ఇబ్బందుల్లో పెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ…

Key Points

డబ్బు మాయం, అనుమానాలు చంద్రకళపై

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ఏం దొరకలేదని, రాంగ్ ఇన్ఫర్మేషన్ అని, సారీ చెప్పి ఐటీ రైడ్స్ ఆఫీసర్స్ వెళ్లిపోతారు. రూమ్‌లోకి వెళ్లి బ్యాగ్ చూస్తే కనిపించదు. దాంతో డబ్బు ఏమైందని అంతా అడుగుతారు. డబ్బు ఎలా మిస్ అయిందని అనుకుంటారు. అందరం ఉన్నాం కానీ, కొత్తగా వచ్చిన మనిషి లేదుగా చంద్రకళ తీసిందని శాలిని అంటుంది.

కచ్చితంగా చంద్రకళ తీసి ఉంటుందని కామాక్షి ఉంటుంది. అనసవరంగా చంద్రకళ మీద నిందలు వేస్తారు అని క్రాంతి సపోర్ట్ చేస్తాడు. చంద్ర గురించి నీకు తెలియదని శ్రుతి అంటుంది. ఇదంతా ఎందుకు ముందు కాల్ చేయు అని విరాట్ అంటే.. క్రాంతి కాల్ చేస్తాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. దాంతో చంద్రకళనే డబ్బు తీసిందని గట్టిగా వాదిస్తారు శాలిని, కామాక్షి , శ్రుతి.

డబ్బు తీసింది చంద్ర అని మీరైనా నమ్ముతున్నారా. మీ తమ్ముడిలాగే సపోర్ట్ చేస్తారా అని శాలిని అంటుంది. సాయంత్రం అయితే చంద్ర వస్తుందిగా. ఒకవేళ రాకుంటే అప్పుడు ఆలోచిద్దాం అని విరాట్ వెళ్లిపోతాడు. టెర్రస్ పైకి వెళ్లి చంద్రకు కాల్ చేస్తాడు విరాట్. కానీ, కాల్ కలవదు. విరాట్ కిందకు వెళ్తూ చంద్ర ఫోన్ అక్కడ చూస్తాడు. ఇది ఇక్కడ ఎందుకు పడిందని చుట్టూ చూస్తాడు విరాట్.

చంద్రకళ స్పృహ కోల్పోవడం

స్పృహ తప్పి పడిపోయి ఉన్న చంద్రకళను చూసి షాక్ అవుతాడు. కంగారుగా చంద్రకళను లేపుతాడు. ఇక్కడ ఎలా పడిపోయిందని అంతా అనుకుంటారు. వాటర్ తీసుకొచ్చి మొహంపై జల్లి చంద్రకళను లేపుతారు. దాంతో చంద్రకళ స్పృహలోకి వస్తుంది. ఏమైందని అడుగుతారు. డబ్బుల గురించి అడుగుతామని ఇలా నాటకం ఆడుతుందని శ్రుతి, కామాక్షి అంటారు.

డబ్బులు ఏం చేశావని శాలిని నిలదీస్తుంది. చంద్ర ఆ డబ్బు నువ్వేమైనా తీశావా అని విరాట్ అడుగుతాడు. దీంట్లో ఇప్పుడే అందరికి క్లారిటీ రావాలని విరాట్ అంటాడు. అవును, ఆ డబ్బు నేనే తీశాను అని నీళ్ల ట్యాంక్‌లో దాచిపెట్టిన డబ్బు తీసుకొస్తుంది చంద్రకళ. క్రాంతికి ఇస్తుంది. ఇది దొంగతనంగానే తీశాను. నిన్ను సేవ్ చేయడానికి తీశాను అని జరిగింది చెబుతుంది చంద్రకళ.

చూశారా నాకోసం వదిన ఎంత రిస్క్ చేసిందో. తను రాకుంటే నేను అరెస్ట్ అయ్యేవాన్ని. అలాంటి మనిషిపై నిందలు వేశారు అని దుష్ట త్రయాన్ని తిడతాడు క్రాంతి. చంద్రకళ కూడా క్లాస్ పీకి వెళ్తుంది. తర్వాత ఎవరికి వాళ్లు వెళ్తుంటారు. ఈ సంఘటనతో అటు అన్నయ్యకు, ఇటు అమ్మకు చంద్రకళపై పాజిటివ్ అభిప్రాయం వస్తుంది అని క్రాంతి అంటాడు.

నిజం బయటపడటం

అలా జరగకూడదు. ఏదోటి చేయాలి అని శాలిని కొత్త స్కెచ్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం. రఘురాంకు ఇచ్చే ట్యాబ్లెట్స్ మార్చేస్తుంది శాలిని. అది తెలియక అవే మాత్రలను రఘురాంకి వేస్తుంది చంద్రకళ. కాసేపటికి రఘురాం నురగ కక్కుతాడు. అది చూసి జగదీశ్వరి షాక్ అవుతుంది. మెడిసిన్ పడలేదేమో అని శాలిని అంటుంది.

ఇందాక చంద్ర వదిన మెడిసిన్ ఇచ్చిందని క్రాంతి చెబుతాడు. ఇది నా భర్తను చంపడానికే ప్రయత్నం చేసింది అని జగదీశ్వరి అంటుంది. అంత మాట అనకండి. నేనెందుకు మావయ్య గారిని చంపడానికి చూస్తాను అని చంద్రకళ అంటుంది. దాంతో నోర్మూయ్ అని చంద్రకళ చెంపచెల్లుమనిపిస్తుంది జగదీశ్వరి. దానికి అంతా షాక్ అవుతారు. శాలిని ప్లాన్ సక్సెస్ అవుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు చంద్రకళ నిజాయితీ బయటపడి, క్రాంతిని కాపాడింది. శాలిని, జగదీశ్వరి పన్నాగం విఫలమైంది. చంద్రకళ పాత్రకు ప్రేక్షకుల మద్దతు పెరిగింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.