
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. రఘురాం ఆరోగ్యం క్షీణించడం, చంద్రకళకు ఒక్కరోజే గడువు విధించడం వంటి సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌తో కామాక్షి రొమాంటిక్‌గా మాట్లాడటం, చంద్ర, రఘురాం మాయం కావడం హైలైట్.
Key Points
రఘురాంకు ఒత్తిడి తీసుకొస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని డాక్టర్ హెచ్చరించారు.
ఆస్తి గొడవపై విరాట్, చంద్రకళ మధ్య చర్చలు జరిగాయి.
శ్రుతి వాయిస్‌తో రాజ్‌తో రొమాంటిక్‌గా మాట్లాడిన కామాక్షి, శ్రుతిని షాక్ చేసింది.
దెయ్యంలా నిల్చున్న చంద్రకళను చూసి శ్యామల భయపడింది.
రఘురాం ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరిక
నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్‌లో రఘురాంకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ ఇంకోసారి ఒత్తిడి తీసుకొస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తాడు. శ్యామలకు దెబ్బ తగిలితే చంద్ర ఐస్ పెడుతుంది. శ్రుతికి రాజ్ కాల్ చేస్తే కూతురు గొంతుతో కామాక్షి రొమాంటిక్‌గా మాట్లాడుతుంది.
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాంను డాక్టర్‌కు చూపిస్తారు. సొమ్మసిల్లి పోయింది చెబుతాడు విరాట్. ఇంట్లో నెగెటివిటీ ఉండటం వల్లే నాన్న కోలుకోవట్లేదు అని క్రాంతి అంటాడు. జగదీశ్వరి కోపంగా చూడటంతో ఊరుకుంటాడు. ఏమైందని డాక్టర్‌ను అడుగుతుంది జగదీశ్వరి .
ఇప్పటివరకు జరిగింది చాలు. ఇక వదిలేయండి. ఆయన కోలుకునేవరకు ఎవరు గొడవపడకండి అని శ్యామల అంటుంది. విరాట్ వెళ్లిపోతాడు. చంద్రకళ వెళ్తుంది. శాలినిని హిప్నటైజ్ ఎందుకు చేయించావ్ అని అడుగుతుంది. మనకు టైమ్ లేదు. ఇంతకంటే చేసేది కనిపించలేదు అని విరాట్ అంటాడు. నాకోసం మీ వాళ్లకు దూరమవుతావా. నేను వెళ్లేటప్పుడు ఇంటిని విడగొట్టిన పాపం మూటగట్టుకోవాలా అని చంద్రకళ అంటుంది.
చంద్రకళకు ఒకే రోజు గడువు
అలా అనకు. నవ్వు ఎక్కడికి వెళ్లవ్ అని విరాట్ అంటాడు. నాకు నమ్మకం పోతుంది. బొట్టు పెట్టగానే మావయ్యలో కదలిక రాగానే సంతోషించా. కానీ, అది ఎంతోసేపు లేదు. నిజంగా దేవుడు కరుణిస్తే అలా జరిగేది కాదుగా. నేను చేసిన ప్రయత్నాలు అన్ని ఫలించట్లేదు అని చంద్రకళ అంటుంది. శాలినిని హిప్నటైజ్ చేసిన ఎందుకు నిజం చెప్పలేదో అర్థం కావట్లేదు అని విరాట్ అంటాడు.
ముచ్చట్లు తప్పా ఆస్తి రాబట్టట్లేదు అని రాజ్ తల్లి అంటుంది. శ్రుతికి రాజ్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కామాక్షి లిఫ్ట్ చేస్తుంది. హాయ్ బేబీ అని రాజ్ అనేసరికి కామాక్షి షాక్ అవుతుంది. శ్రుతి చెప్పిన బేబీ ఈ బాయ్ ఒక్కరేనా అని కామాక్షి మాట్లాడుతుంది. రాజ్ రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. శ్రుతి వాయిస్‌తో కామాక్షి మాట్లాడుతుంది. కామాక్షి మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంది.
అది చూసిన శ్రుతి షాక్ అవుతుంది. బేబీ అంటూ నా వాయిస్‌తో మాట్లాడుతుందేంటీ అని శ్రుతి వెళ్లి అరుస్తుంది. తనకు తెలియకుండానే మాట్లాడిన కామాక్షి తెరుకుని రేయ్ నువ్వు ఎవడ్రా అని అరుస్తుంది. మీరెవరండి మాట్లాడేది. నేను శ్వేత కోసం కాల్ చేశాను అని రాజ్ అంటే.. ఇది శ్రుతి నెంబర్ అని కామాక్షి అంటుంది. రాంగ్ నెంబర్ అని రాజ్ కట్ చేస్తాడు.
రాజ్, కామాక్షి రొమాంటిక్ సంభాషణ
శ్యామల వెనుక చంద్రకళ నిల్చుంటుంది. వెనక్కి తిరిగి చూసిన శ్యామల చంద్రకళను చూసి భయపడుతుంది. దెయ్యంలా నిల్చున్నావేంటే అని శ్యామల అంటుంది. మీతో ఓ విషయం చెప్పాలి. శాలినిని హిప్నటైజ్ చేయించింది మావయ్య గారిని అటాక్ చేసిందో ఎవరో కనిపెట్టి మళ్లీ అలా జరగకుండా ఉండేందుకు అని చంద్రకళ అంటుంది. విరాట్ గురించి నాకు తెలుసు అని కోపంగా శ్యామల వెళ్లిపోతు కుర్చుకి తగిలి దెబ్బ తగిలించుకుంటుంది.
నొప్పితో విలవిల్లాడుతుంది శ్యామల. ఐస్ తీసుకొచ్చి చంద్రకళ పెడితే శ్యామల పెట్టనివ్వదు. మీరు నాకు తల్లితో సమానమని ఎన్నోసార్లు చెప్పాను. తల్లి బాధపడుతుంటే బిడ్డ చూస్తు ఊరుకోలేదు అని శ్యామల కాలు తీసుకుని ఐస్ పెడుతుంది చంద్రకళ. దాంతో కాస్తా కరుగుతుంది శ్యామల. గతంలో చంద్రకు చెప్పింది గుర్తు చేసుకుంటుంది శ్యామల.
తర్వాత రాత్రి తనకు ఇంకా ఒక్కరోజే గడువు ఉందని చంద్రకళ బాధపడుతుంది. మరుసటి రోజు ఉదయం రఘురాం కనిపించడు. చంద్రకళ కూడా కనిపించదు. దాంతో అన్నయ్యను చంద్రకళ ఏం చేయలేదుగా అని శ్యామల భయపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
మొత్తం మీద, నిన్ను కోరి సీరియల్ నవంబర్ 1 ఎపిసోడ్ పలు ట్విస్టులు, ఉద్వేగభరిత సన్నివేశాలతో సాగింది. పాత్రల మధ్య పెరుగుతున్న విభేదాలు, కొత్త పరిణామాలు కథనంలో మరింత ఆసక్తిని పెంచాయి.


