|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి అక్టోబర్ 1 ఎపిసోడ్: విరాట్ లైఫ్‌లోకి ఎక్స్ ల‌వ‌ర్‌.. ఫైర్ అయిన హీరో.. ఇంట్లోకి ఆహ్వానించిన చంద్రకళ

Published: 30-09-2025, 10:16 PM
నిన్ను కోరి అక్టోబర్ 1 ఎపిసోడ్: విరాట్ లైఫ్‌లోకి ఎక్స్ ల‌వ‌ర్‌.. ఫైర్ అయిన హీరో.. ఇంట్లోకి ఆహ్వానించిన చంద్రకళ

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగింది. విరాట్ మాజీ ప్రియురాలు శ్వేత ఇంటికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విరాట్ ఆగ్రహం వ్యక్తం చేయగా, చంద్రకళ ఆమెను ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ పరిణామం విరాట్-చంద్రకళ బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Key Points

1

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్‌లో విరాట్ మాజీ ప్రియురాలు శ్వేత ఇంటికి వస్తుంది.

2

శ్వేతను చూసి విరాట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమెను అక్కడి నుండి వెళ్లమని కోరతాడు.

4

శాలిని, శ్రుతి శ్వేతను ఉపయోగించుకుని విరాట్, చంద్రకళ మధ్య విభేదాలు సృష్టించాలని ప్లాన్ చేస్తారు.

శ్వేత రాక: విరాట్ ఆగ్రహం

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో పొద్దున చంద్రకళ తులసి కోటకు పూజ చేస్తుంది. మా బంధం శాశ్వతం కావాలి, మా మధ్య ఏ కొత్త సమస్య రాకూడదని చంద్ర మొక్కుతుండగా, లాగేజీ బ్యాగ్ తో శ్వేత వస్తుంది. ఎవరని అడుగుతుంది చంద్ర. విరాట్ కోసం వచ్చానని శ్వేత చెప్తుంది.

అన్నయ్య శ్వేత, అదే అమ్మ అన్నయ్య ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని క్రాంతి కంగారుగా చెప్తాడు. విరాట్ కోపంగా వచ్చి గుమ్మం బయటే ఆగమని అంటాడు. నీ బిజినెస్ డల్ అయిందని శ్వేత బ్రేకప్ చెప్పిన విషయాన్ని విరాట్ గుర్తు చేసుకుంటాడు. చంద్రను లోపలికి రమ్మంటాడు. ఎవరు బావ తను అని అడుగుతుంది చంద్రకళ . నా జీవితంలోని చేదు అనుభవమని విరాట్ అంటాడు. అన్నయ్య ఎక్స్ లవర్ అని చంద్రకు క్రాంతి చెప్తాడు.

చంద్రకళ నిర్ణయం: ఇంట్లోకి ఆహ్వానం

నీ విషయంలో తప్పు చేశానని బాధ పడని రోజు లేదని శ్వేత అంటుంది. నీ వల్ల వాడు బాధ పడని రోజు లేదు. వాడికి పెళ్లి కూడా జరిగిందని జగదీశ్వరి అంటుంది. చంద్ర తెలియక రానిచ్చావు పంపించేయ్ లేదంటే నీ జీవితానికి సమస్యగా మారుతుందని శాలిని అంటుంది. మీ కష్టం ఏంటీ? అని చంద్ర అడిగితే, రెండు మూడు రోజులు ఇక్కడే ఉందామని వచ్చానని శ్వేత చెప్తుంది. ఈ పిచ్చోడు ఇంకా నీ మీద ప్రేమతో ఉంటాడనుకున్నావా? నీ కంటే బెటర్ పర్సన్ నా లైఫ్ లో ఉంది. నీ మొసలి కన్నీళ్లు నన్ను కరిగించలేవని విరాట్ ఫైర్ అవుతాడు.

ఒక్కసారి క్షమించు విరాట్ అని శ్వేత అంటే వెళ్లమని విరాట్ చెప్తాడు. వెళ్తున్న శ్వేతను చంద్ర ఆపుతుంది. నీ సమస్య ఏంటో చెప్పడం లేదంటే నువ్వు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. ఇంకో ఆప్షన్ కూడా లేదని తెలుస్తుంది. బావ తనను ఉండనివ్వమని చంద్ర చెప్తుంది. చంద్ర అదంతా డ్రామా, కేవలం డిస్టర్బ్ చేయడానికే వచ్చింది. మనల్ని విడగొడుతుందని విరాట్ అంటాడు. మనం విడిపోతామా? మన బంధం అంత వీక్ హా అని చంద్ర అంటుంది.

కుటుంబంలో అలజడి: కొత్త కుట్రలు

నేను ఒప్పుకోను చంద్ర అని విరాట్ గట్టిగా అరుస్తాడు. రెండు మూడు రోజులే ఆ తర్వాత వెళ్లిపోవాలని చంద్ర అంటే, కుదరదని విరాట్ అంటాడు. చివరకు జగదీశ్వరి ఉండమని చెప్తుంది. శ్వేతను ఇంట్లోకి తీసుకెళ్తుంది చంద్ర. చంద్ర తన వేలితో తన కన్నే పొడుచుకుందని అంటుంది శ్యామల. మగవాళ్లతో కళ్లతో మాట్లాడటం నేర్చుకోమని శ్రుతికి చెప్తుంది కామాక్షి. శ్వేత, విరాట్, చంద్రలను ఎలా ఆడుకుంటానో చూడమని శ్రుతి అంటుంది.

శ్వేతను యూజ్ చేసుకుని విరాట్, చంద్రకు మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని శాలిని చెప్తుంది. గెస్ట్ వచ్చారని టిఫిన్స్ అన్నీ చేశానని చంద్ర అంటుంది. సవతికి సన్మానం చేయడానికా? అని కామాక్షి అడుగుతుంది. అందరూ టిఫిన్ చేస్తుండగా శ్వేత వస్తుంది. శ్వేతను విరాట్ పక్కన కూర్చోబెడుతుంది చంద్ర. విరాట్ లేవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

శ్వేత రాకతో నిన్ను కోరి సీరియల్ లో కొత్త సమస్యలు మొదలయ్యాయి. విరాట్, చంద్రకళ బంధంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? శత్రువుల కుట్రలు ఎంతవరకు ఫలిస్తాయి? రాబోయే ఎపిసోడ్స్ మరింత ఉత్కంఠ భరితంగా మారనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.