|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి అక్టోబర్ 24 ఎపిసోడ్: శాలినికి చంద్ర వార్నింగ్‌-పాల‌ల్లో విషం క‌లిపావ‌న్న శ్యామ‌ల‌-తాగేసిన విరాట్‌

Published: 23-10-2025, 11:16 PM
నిన్ను కోరి అక్టోబర్ 24 ఎపిసోడ్: శాలినికి చంద్ర వార్నింగ్‌-పాల‌ల్లో విషం క‌లిపావ‌న్న శ్యామ‌ల‌-తాగేసిన విరాట్‌

నిన్ను కోరి సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్‌లో ఉత్కంఠభరితమైన మలుపులు చోటుచేసుకున్నాయి. శాలినికి చంద్ర వార్నింగ్ ఇవ్వగా, పాలలో విషం కలిపావంటూ శ్యామల అనుమానం వ్యక్తం చేస్తుంది. విరాట్ ఆ పాలను తాగేయడంతో కథనం ఆసక్తికరంగా మారింది. శాలిని నాటకాలు, జగదీశ్వరి ఆగ్రహం ఈ ఎపిసోడ్‌లో ప్రధానాంశాలు.

Key Points

1

చంద్రకళ శాలినికి తప్పులు బయటపడతాయని హెచ్చరించింది.

2

పాలలో విషం కలిపారని శ్యామల అనుమానం వ్యక్తం చేయగా, విరాట్ ఆ పాలను తాగేస్తాడు.

4

నాన్న కోలుకునేంతవరకూ ఎవరూ మాట్లాడొద్దని జగదీశ్వరి కోపంగా చెబుతుంది.

శాలినికి చంద్రకళ వార్నింగ్

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 24 ఎపిసోడ్ లో శాలినిక చంద్రకళ వార్నింగ్ ఇస్తుంది. తప్పు బయటపడే రోజు వస్తుందంటుంది. చంద్రపై శ్యామల అనుమానపడుతూనే ఉంటుంది. పాలల్లో విషం కలిపావంటుంది. ఆ పాలను విరాట్ తాగేస్తాడు. శాలినిని మళ్లీ మాటలంటాడు విరాట్.

పాలలో విషం, విరాట్ తాగుతాడు

నిన్ను కోరి సీరియల్ టుడే అక్టోబర్ 24 ఎపిసోడ్ లో తేజుకు కథ చెప్తూ నిద్రపుచ్చుతాడు అర్జున్. నీ ఆఖరి కోరిక ఎలా తీర్చాలో తెలియక లోలోపలే నాన్న కుమిలిపోతున్నాడని అర్జున్ ఫీల్ అవుతాడు. నేను నా భర్తను ఎలా కంట్రోల్ లో పెట్టుకున్నానో చూశావు కదా. నా గురించి నిజం చెప్పినా నమ్మనంతగా నమ్మించానని చంద్రకళతో శాలిని అంటుంది.

శాలిని డ్రామా, జగదీశ్వరి ఆగ్రహం

ఎందుకు అనకూడదు, తప్పు చేసింది తనే కాబట్టి కచ్చితంగా అంటాను. శాలినిని ఎందుకు అనుమానించకూడదు? నాన్నను కొట్టింది తను కాదని కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టు వేసి ప్రూవ్ చేసుకోమనండి అని విరాట్ అంటాడు. దీంతో మొసలి కన్నీళ్లతో శాలిని నాటకం స్టార్ట్ చేస్తుంది. ఆయన కోలుకునేంతవరకూ ఎవరూ మాట్లాడొద్దని చెప్పా కదా అని జగదీశ్వరి కోప్పడుతుంది. నాన్న పనుల్లో జోక్యం చేసుకుంటే అనుమానిస్తూనే ఉంటారు చంద్ర అని విరాట్ చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

నేటి నిన్ను కోరి ఎపిసోడ్ శాలిని, విరాట్, చంద్రల మధ్య సంఘర్షణను మరింత తీవ్రతరం చేసింది. శ్యామల అనుమానాలు, జగదీశ్వరి జోక్యం కథకు కొత్త మలుపునిచ్చాయి. రాబోయే ఎపిసోడ్‌లలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.