
“నిన్ను కోరి” అక్టోబర్ 2 ఎపిసోడ్‌లో చంద్రకళ విరాట్, శ్వేతల గత ప్రేమ గురించి ఆరా తీసింది. ఆమె చేష్టలతో విరాట్ విసిగిపోయాడు. మరోవైపు, శ్రుతికి కారులో సమస్య రావడంతో ఊహించని విధంగా రాజ్ సహాయం చేశాడు. కోటీశ్వరుడైన రాజ్ చేపలు అమ్ముకుంటూ కనిపించడం ఆసక్తికరంగా మారింది.
Key Points
విరాట్, శ్వేతల ప్రేమ గురించి చంద్రకళ ఆరా తీయడం, శ్యామల నిలదీయడం.
చంద్రకళ సైకో చేష్టలతో విసిగిపోయిన విరాట్ ఆమెనుండి పారిపోతాడు.
"నువ్వు నా సొంతం, ఎవరైనా చూస్తే చంపేస్తాను" అంటూ విరాట్‌ను భయపెట్టిన చంద్రకళ.
కోటీశ్వరుడైన రాజ్ శ్రుతి కోసం చేపలు అమ్ముకుంటూ ఆమెకు సహాయం చేయడం.
విరాట్, శ్వేతల లవ్ గురించి చంద్రకళ ఆరా
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్వేతను భోజనానికి చంద్రకళ కూర్చోబెడుతుంది. విరాట్ లేస్తే అలా వెళ్లడం సంస్కారం కాదని జగదీశ్వరి అంటుంది. దాంతో విరాట్ ఆగిపోతాడు. శ్వేత మీరు మా బావను ఎప్పుడు కలిశారు అని చంద్రకళ అడిగితే.. కాలేజ్‌లో అని శ్వేత చెబుతుంది. సినిమాలో లాగా ఉంటుంది కదా అని చంద్రకళ అందరి ముందే విరాట్ ప్రేమకథ అడుగుతుంది.
సైలెంట్‌గా తినమని జగదీశ్వరి అనడంతో ఊరుకుంటుంది చంద్రకళ. తర్వాత శ్వేతతో ఒంటరిగా చంద్రకళ మాట్లాడుతుంటే శ్యామల కామాక్షి వాళ్లతో వస్తుంది. ఆరోజు విరాట్‌ను వద్దనుకుని మా కొంప ముంచావ్. కొన్ని దుష్ట శక్తులు మా వైపు చూసేవే కావు. ఎందుకు మా విరాట్‌ను వద్దనుకున్నావ్ అని శ్యామల అంటుంది. నా కర్మ అని శ్వేత అంటుంది.
నీకు ఇంకో ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందని శ్యామల అంటుంది. అర్థం కాలేదని శ్వేత వెళ్లిపోతుంది. తర్వాత చంద్రకళ చేసినదానికి క్రాంతి మెచ్చుకుంటాడు. నీ మంచితనాన్ని తను అడ్వాంటేజ్ తీసుకుంటే నీకే సమస్య అవుతుంది. వాళ్లిద్దరి కలిసి ఉంటే మళ్లీ లవ్ రీ జెనరేట్ అయ్యే ఛాన్స్ ఉందని శాలిని అంటుంది. ఆయన మీద నాకు నమ్మకం ఉందని చంద్రకళ అంటుంది.
చంద్రకళ సైకో చేష్టలతో విసిగిన విరాట్
విరాట్‌కు చంద్రకళకు కాఫీ ఇస్తుంది. శ్వేత నాకన్న బాగుంది. తన కళ్లలో నిన్ను మిస్ చేసుకున్న బాధ కనిపిస్తుందని చంద్రకళ అంటుంది. ఇప్పుడేమంటావ్ తనకు కూడా తాళి కట్టి నారి నారి నడుమ మురారిలా ఉండాలా అని విరాట్ అంటే.. చంపేస్తాను అని చంద్రకళ అంటుంది. దాంతో విరాట్ షాక్ అవుతాడు. విరాట్ కాలర్ పట్టుకుని నువ్వు నా సొంతం. ఎవరైనా తన్నకుపోదామని చూస్తే చంపేస్తాను అని చంద్ర అంటుంది.
నువ్వేంటే ఇంత సైకోలా ఉన్నావని విరాట్ అంటాడు. ఫస్ట్ నైట్ చాలా స్పెషల్ అంటూ విరాట్‌ను విసిగిస్తుంది చంద్రకళ. ఏదోటి వాగుతూ విరాట్‌కు చిరాకు తెప్పిస్తుంది. దాంతో విరాట్ పారిపోతాడు. చంద్రకళ నవ్వుకుంటుంది. కామాక్షి, శ్రుతి సరుకులు తీసుకురావడానికి వెళ్తారు. కారు సడెన్‌గా ఆగిపోతుంది. డ్రైవర్ చెక్ చేసి కారు పాడైందని, క్యాబ్ బుక్ చేసుకోమని చెబుతాడు.
నడిరోడ్డు మీద నిలబెట్టేశావ్ కదయ్యా. ఇప్పుడు ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుంది కామాక్షి. ఓ కారు ముందు నుంచి ర్యాష్‌గా వెళ్లి వెనక్కి వస్తుంది. అందులో నుంచి శ్రుతి కి పార్క్‌లో కనిపించిన రాజ్ దిగుతాడు. రాజ్ గుర్తుకొచ్చి మురిసిపోతుంది. ఐస్ క్రీమ్ బాయ్ అని పలకరిస్తుంది శ్రుతి. సమస్య ఏంటని రాజ్ అడిగితే.. కారు పాడైందని చెబుతారు.
శ్రుతి కోసం చేపలు అమ్ముకునే కోటీశ్వరుడు రాజ్
నా కారులో వెళ్దామని రాజ్ అంటే.. కామాక్షిని బలవంతంగా శ్రుతి తీసుకెళ్తుంది. కామాక్షి వాళ్లు వచ్చిన క్యాబ్ డ్రైవర్‌కు రాజ్ డబ్బులిచ్చి థ్యాంక్స్ అని చెబుతాడు. అంటే, కామాక్షి వాళ్ల కారును ప్లాన్ చేసిన రాజ్ ఆపేస్తాడు. కారులో చేపల వాసన వస్తుందని శ్రుతి, కామాక్షి అంటారు. చేపలు పట్టడం నా హాబీ. సండే వచ్చిందంటే చాలు చేపలతో బిజీగా ఉంటాను అని తను చేపలు అమ్ముకునే బిజినెస్ గురించి చెబుతాడు రాజ్.
మీరు పట్టిన చేపలు అక్కడే అమ్మితే కారులో స్మెల్ ఎందుకు వస్తుందని శ్రుతి అడుగుతుంది. కొన్ని ఇంటికి తీసుకెళ్లి నేనే వండుకుంటాను. వీడు వీడి మాటలకు అస్సలు కనెక్షనే లేదు ఏంటో అని కామాక్షి డౌట్ పడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ విరాట్, చంద్రకళ, శ్వేతల మధ్య ప్రేమ, భయపెట్టే సన్నివేశాలతో పాటు, రాజ్, శ్రుతిల ఊహించని కలయికతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజ్ చేపలు అమ్ముకుంటూ కనిపించడం తదుపరి మలుపులకు దారితీయనుంది.


