
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 13 ఎపిసోడ్ లో, జగదీశ్వరి శాలినిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తుంది. శ్రుతి కిడ్నాప్ ప్రమాదం ఉందా? చంద్రకళ అర్జున్ కి ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. వ్యాపారంలో విజయం సాధించినప్పటికీ, కుటుంబంలోని సంఘర్షణలు కొనసాగుతాయి.
Key Points
చంద్రకళకు విరాట్ పెళ్లి చేసుకోవడంపై శ్యామల నిందిస్తుంది.
జగదీశ్వరి వ్యాఖ్యలతో శాలిని భయపడుతుంది, శ్రుతి సంతోషిస్తుంది.
అర్జున్, చంద్రకళ వ్యాపారంలో విజయం సాధిస్తారు.
శాలిని, క్రాంతి మధ్య ప్రేమ, శ్రుతి, కామాక్షిల ప్రణాళికలు.
శ్యామల, జగదీశ్వరి వ్యాఖ్యలు
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చంద్రకళను విరాట్ పెళ్లి చేసుకోవడంపై నిందిస్తుంది శ్యామల . ఈ కాలం పిల్లలకు కుటుంబం, సంసారం తెలియట్లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమే లేదు. పెద్ద వాళ్ల ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు కూడా తీసుకుంటున్నారు అని జగదీశ్వరి అంటుంది.
దాంతో శాలిని తెగ భయపడిపోతుంది. అది చూసి శ్రుతి నవ్వుతుంది. విరాట్, శాలిని వెళ్లిపోతారు. చంద్రకళకు విరాట్ కాల్ చేస్తాడు. అర్జున్ కాల్ చేసి అర్జంట్‌గా రమ్మనేసరికి వచ్చేశాను అని చంద్రకళ అంటుంది. చేతికి అంత గాయం పెట్టుకుని స్కూటీ ఎలా నడిపావని అడుగుతాడు విరాట్. తగ్గిపోయిందిగా. రాత్రీ నువ్ పెట్టిన మందు కంటే చెప్పిన మాటలే తగ్గేలా చేశాయంటుంది చంద్రకళ.
తర్వాత స్టాఫ్ ఎవరు లేకపోవడంతో షాక్ అవుతుంది చంద్రకళ. ఇంతలో అందరూ వచ్చి కంగ్రాట్స్ అని చెబుతారు. అసలు ఏమైందని చంద్రకళ అడుగుతుంది. మనం 3 నెలల్లో పెట్టుకున్న గోల్‌ను నెల రోజుల్లోనే సాధించామని చెబుతాడు అర్జున్. మన పికిల్స్‌కు ఎక్కవ రేట్ వచ్చింది. ఫారెన్‌లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని బ్రాంచెస్‌కు కాంట్రాక్ట్ తీసుకున్నారు. లాభాలు 3 రెట్లు పెరిగాయని అర్జున్ చెబితే చంద్రకళ సంతోషిస్తుంది.
వ్యాపార విజయం మరియు బోనస్‌లు
ప్రాఫిట్ పెరిగింది కాబట్టి అందరికి బోనస్‌లు ఇద్దామని చంద్రకళ అంటుంది. దాంతో ఓకే అని అర్జున్ షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే గాయం చూసి ఇవ్వదు చంద్రకళ. మరోవైపు జగదీశ్వరి అన్న మాటల గురించి ఆలోచిస్తుంది శాలిని. క్రాంతి వస్తే అత్తయ్య ఎందుకలా మాట్లాడింది. నన్నే టార్గెట్ చేసి మాట్లాడినట్లు అనిపించిందని అడుగుతుంది శాలిని. అమ్మ జెనరల్‌గా మాట్లాడింది. కంగారుపడకు అని క్రాంతి చెబుతాడు.
తర్వాత క్రాంతిని శాలిని హగ్ చేసుకుని ఐ లవ్యూ చెబుతుంది. నాకు తెలుసు క్రాంతి నువ్వు నా దారికి వస్తావని. నీ నమ్మకంతోనే నీ కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేస్తానని మనసులో అనుకుంటుంది శాలిని. మరోవైపు శాలినిని జగదీశ్వరి అన్నది గుర్తు చేసుకుని నవ్వుతుంది శ్రుతి. ఆరోజు శాలినిని అత్తయ్య నిలదీయాల్సింది. మధ్యలో చంద్రకళ అనవసరంగా దూరింది అని తల్లీకూతుళ్లు మాట్లాడుకుంటారు.
ఆ మాటలు శాలిని వింటుంది. వదిన నిలదీసి ఉంటే డివోర్స్ సీక్రెట్ నువ్వే బయటపెట్టావని శాలిని కనిపెట్టేది అని కామాక్షి అంటుంది. శాలిని భయపెట్టేందుకు బిల్డప్ ఇస్తుంది కానీ ఏం చేయలేదు అని శ్రుతి అంటుంది. నేనే సీక్రెట్ బయటపెట్టానని తెలిస్తే ఏం చేస్తుంది. కిడ్నాప్ చేస్తుందా. టార్చర్ చేస్తుందా. నిజంగానే సిమెంట్ లారీ గుద్దించి చంపేస్తుందా. తనకు అంత సీన్ లేదు. ఏదైనా ఎక్స్‌ట్రా చేస్తే తనకు ఇంట్లో స్థానమే ఉండదు అని శ్రుతి అంటుంది.
శాలిని, క్రాంతి, శ్రుతిల మధ్య సంఘర్షణ
కామాక్షి ఎంత చెప్పిన శ్రుతి వినదు. అదంతా విన్న శాలిని శ్రుతి అయిపోయావే నువ్వు అనుకుంటుంది. కిడ్నాప్ చేయించడం గురించి ఆలోచిస్తుంది. మరోవైపు చంద్రకళకు అయిన గాయం గురించి అర్జున్ అడుగుతాడు. చంద్రకళ కవర్ చేస్తుంది. మీరు నెల రోజుల్లో ఇంట్లోంచి వెళ్లిపోతారని మీ వాళ్లు అన్నారు. ఎందుకు అలా. అసలు మీ లైఫ్‌లో ఉన్న సమస్య ఏంటీ అని అర్జున్ అడుగుతాడు. దాంతో జరిగినదంతా చెబుతుంది చంద్రకళ.
వాళ్లు అంత మూర్ఖంగా ఎలా ఆలోచిస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదు అని అర్జున్ అంటాడు. దీని వల్ల నా మీద సానుభూతి చూపించడం, మా వాళ్ల మీద నెగెటివ్‌గా ఆలోచించకండి. వాళ్ల అభిప్రాయంలో కరెక్టే. వాళ్ల కోపం మీరు చూశారు. నేను ప్రేమ కూడా చూశాను. గడువులోగా నన్ను నేను నిరూపించుకుంటాను అని చంద్రకళ అంటుంది.
తర్వాత చంద్రకళ పడుకుని ఉంటే విరాట్ వెళ్లి నీ బర్తే డే నాకు గుర్తు లేదనుకున్నావా. నీకు ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలనుకుంటున్నావని తెలుసు అంటాడు. అద్దం మీద హ్యాపీ బర్త్ డే అని రాసి మధు అని పెడతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరిగా, నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ లోని సంఘర్షణలు, కుట్రలు, ప్రేమ, మరియు వ్యాపార విజయం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అన్ని అంశాలతో ఈ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగుస్తుంది.


