|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి సెప్టెంబర్ 20 ఎపిసోడ్: శ్రుతిని బెల్టుతో చితకొట్టిన శాలిని- అత్త ఎదుట రొమాన్స్- ఒక్క దెబ్బకు రెండు వికెట్స్

Published: 22-09-2025, 12:35 AM
నిన్ను కోరి సెప్టెంబర్ 20 ఎపిసోడ్: శ్రుతిని బెల్టుతో చితకొట్టిన శాలిని- అత్త ఎదుట రొమాన్స్- ఒక్క దెబ్బకు రెండు వికెట్స్

నిన్ను కోరి సీరియల్‌లోని తాజా ఎపిసోడ్‌లో చంద్రకళ బర్త్‌డే, విరాట్‌తో ఆమె సంతోషం, శాలిని, శ్రుతి మధ్య జరిగిన గొడవలు, అత్త సమక్షంలో జరిగిన రొమాన్స్ వంటి ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Key Points

1

విరాట్ మరియు చంద్రకళ బర్త్ డే సెలబ్రేషన్

2

శాలిని శ్రుతిని బెల్టుతో కొడుతుంది

4

ఒక్క దెబ్బతో రెండు లక్ష్యాలు సాధించడం

చంద్రకళ బర్త్‌డే సెలబ్రేషన్

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను సర్‌ప్రైజ్ చేద్దామని అద్దం మీద రాస్తే చూడలేదు, అందరిని ఒప్పించి కేక్ కటింగ్ చేపిద్దామని చూస్తే ఆఫీస్‌లో చేసుకున్నావ్ అని విరాట్ అలుగుతాడు. అక్కడ సెలబ్రేషనే ఉంది, హ్యాపీనెస్ లేదు. మీతో విష్ చేయించుకోలేదని మనసులో ఉంది అని దబాయిస్తుంది చంద్రకళ.

ఏంటే నేను ఫీల్ అయ్యానని కూడా లేకుండా నన్నే అంటున్నావ్ అని విరాట్ అంటాడు. ఇప్పుడు నా బర్త్ డే సెలబ్రేట్ చేస్తారా లేదా అని చంద్ర అంటే చేయను అని విరాట్ అంటాడు. దాంతో కోపంతో చక్కిలిగింతలు పెడుతుంది చంద్రకళ. దానికి నవ్వుతాడు విరాట్. వెంటనే విరాట్‌ను హగ్ చేసుకుంటుంది చంద్రకళ. సోషల్ మీడియాలో ఫొటోల గురించి మాట్లాడుకుంటారు.

తర్వాత ఎవరికి తెలియకుండా కేక్ తీసుకొచ్చి చంద్రకళతో కట్ చేయిస్తాడు విరాట్. సంతోషంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది చంద్రకళ. దీనికోసమే పొద్దున్నుంచి ఎదురుచూసింది. ఇదే నాకు సంతోషాన్నిచ్చేది. సరే నా గిఫ్ట్ ఎక్కడ. నాకు తెలుసు నువ్వు కొన్నావని అని చంద్రకళ అడుగుతుంది. దాచి లాభం లేదు అని నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తాడు.

చాలా బ్యూటిపుల్‌గా ఉంది. మీ చేతుల్తోనే మెడలో వేయమని చంద్రకళ అడిగితే.. విరాట్ వేస్తాడు. చాలా అందంగా చంద్రకళ కనిపిస్తుంది. మరోవైపు శాలిని రాడ్‌తో కొట్టేందుకు గదిలోకి వెళ్తుంది శ్రుతి. శాలిని రాగానే తలమీద ఒక్కటిస్తాను దెబ్బకు దారికొస్తుంది అని కర్టెన్ వెనుక దాక్కుంటుంది శ్రుతి. శాలిని క్రాంతితో మాట్లాడి తాను పడుకుంటున్నట్లు చెబుతుంది.

శాలిని మరియు శ్రుతి మధ్య ఘర్షణ

శాలినిని శ్రుతి కొట్టబోతుంటే అప్పుడే శాలిని లైట్ ఆఫ్ చేస్తుంది. దాంతో మిస్ అవుతుంది. కానీ, శాలినికి డౌట్ వచ్చి లైట్ ఆన్ చేస్తుంది. అప్పుడు బయటపడిన రాడ్, శ్రుతి కాళ్లు కనిపిస్తాయి. నా మీద రివేంజ్ తీసుకోవాలని చూస్తున్నావా శ్రుతి. నీ సంగతి చెబుతా అని బెల్ట్ తీసుకొచ్చి పక్కన పెట్టుకుని లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది శాలిని. శ్రతి కొట్టడానికి వస్తే వెంటనే లేచిన శాలిని ఏయ్ ఎవరది అని అంటుంది.

పిల్లిలా శ్రుతి సౌండ్ చేస్తుంది. దొంగ పిల్లి మళ్లీ వచ్చావా. చెప్తా దీని సంగతి అని బెల్ట్ తీసుకుని శ్రుతిని పిచ్చి కొట్టుడుకొడుతుంది. ఎంత కొట్టిన బుద్ధి రావట్లేదు అని తెగ కొడుతుంది శాలిని. ఇంతలో శ్రుతి ఇక్కడికి వచ్చిందా అని కామాక్షి వస్తుంది. అప్పుడే శాలిని లైట్ ఆన్ చేస్తుంది. శాలిని నన్ను చితక్కొట్టిందని శ్రుతి అంటుంది. నేను కొట్టింది పిల్లిని కదా అని శాలిని అంటుంది.

ఇంకోసారి చెప్పకుండా గదిలోకి రాకు అని శాలిని వార్నింగ్ ఇస్తుంది. శ్రుతిని బయటకు తీసుకెళ్లిన కామాక్షి శాలిని నిన్ను కావాలని కొట్టిందే. ఎందుకే నీకు రివేంజ్ అని తిడుతుంది. మరుసటి రోజు ఉదయం విరాట్ ఎక్సర్‌సైజ్ చేసుకుంటూ ఉంటే తులసి చుట్టూ తిరుగుతుంది చంద్రకళ. అయితే, విరాట్ ఇచ్చిన నెక్లెస్ చంద్రకళ మెడలో వేసుకుని ఉంటుంది.

అది చూసిన విరాట్ వచ్చి నీకు గిఫ్ట్ కొన్న విషయం అందరికి తెలుసు. ఇప్పుడు ఇది నీ మెడలో చూస్తే అంతే సంగతి అని విరాట్ భయపడిపోతాడు. అది నాకు తెలియదు కదా బావ. నువ్ సంతోషిస్తావని వేసుకున్నా అని చంద్రకళ అంటుంది. ఎవరి కంట పడకుండా గదిలో పెట్టేయ్ అత్తయ్య చూస్తే అంతే అని విరాట్ అంటుండంగానే శ్యామల వచ్చి పిలుస్తుంది.

అత్త సమక్షంలో రొమాన్స్

లెక్కలేని మనిషితో ఏంటీ మాటలు అని శ్యామల అంటే.. కాఫీ అడుగుతున్నారని చంద్రకళ చెబుతుంది. నేను ఇస్తాను అని వెళ్లిన శ్యామల నెక్లెస్ గుర్తుకు వచ్చి తిరిగి వస్తుంది. కానీ, ఇంతలో చంద్రకళ మెడలోని నెక్లెస్‌ను విరాట్ విప్పుతాడు. దాంతో చంద్రకళ చేతిలో నెక్లెస్ పడుతుంది. దాన్ని చీరతో కవర్ చేస్తుంది. శ్యామల వచ్చ నీ మెడలో ఏదో మెరిసింది. రేయ్ విరాట్ నువ్వు తెచ్చిన నెక్లెస్ ఏం చేశావురా అని శ్యామల అడుగుతుంది.

రిటర్న్ ఇచ్చాను అని విరాట్ చెబుతాడు. దాంతో శ్యామల వెళ్లిపోతుంది. మరోవైపు అర్జున్ ఆఫీస్‌కు పంపిన పచ్చళ్ల స్టాక్ అంత తిరిగి వస్తుంది. అది చూసి అర్జున్ కంగారుపడతాడు. మరోవైపు కిచెన్‌లో జగదీశ్వరి పాలు కలుపుకుంటుంటే చంద్రకళ ఇస్తానంటుంది. కానీ, జగదీశ్వరి వద్దంటుంది. అది చూసిన శాలిని హో వీళ్లిద్దరు ఇక్కడే ఉన్నారా. ఒక దెబ్బకు రెండు వికెట్స్ అన్నట్లు ఇద్దరి దగ్గర మార్కులు కొట్టేస్తాను అనుకుంటుంది శాలిని.

క్రాంతి వెళ్తుంటే పిలుస్తుంది. శాలిని అందాన్ని చూసి క్రాంతి మురిసిపోతాడు. ఏంటీ ఇంత అందంగా రెడీ అయ్యావని అడుగుతాడు క్రాంతి. ఈ అందం నువ్వు ఇచ్చిందే. ఈ సారీ నువ్వు ప్రేమగా ఇచ్చిందే అని క్రాంతికి రెడ్ రోజ్ ఇస్తుంది శాలిని. నా తలలో పెట్టమని చెబుతుంది శాలిని. క్రాంతి రోజ్ ఫ్లవర్ పెడితే.. కావాలనే గిలిగింతలు పెడతావేంటీ అని రొమాంటిక్‌గా ప్రవరిస్తుంది శాలిని.

అది చూసిన చంద్రకళ సంతోషిస్తే జగదీశ్వరి మాత్రం చిరాకు పడుతుంది. తర్వాత పచ్చళ్లన్ని పాడై పోయాయని, స్టాక్ మొత్తం వెనక్కి వచ్చిందని చంద్రకళకు కాల్ చేసి చెబుతాడు అర్జున్. దాంతో చంద్రకళ కంగారుపడుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

ఈ ఎపిసోడ్‌లో చంద్రకళ సంతోషంగా బర్త్‌డే జరుపుకుంటుంది, అయితే శాలిని మరియు శ్రుతి మధ్య జరిగిన ఘర్షణ, అత్త ఎదుట జరిగిన రొమాన్స్ కథనంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.