
నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ అర్జున్ ఇంట్లో రాత్రి గడుపుతుంది. విరాట్ ఈ విషయం తెలుసుకొని ఎలా స్పందిస్తాడో, శ్యామల ఎలాంటి ప్రతిచర్య చూపుతుందో ఈ ఎపిసోడ్ చూడాలి.
Key Points
రాత్రి అర్జున్ ఇంట్లో చంద్రకళ ఉండటంతో శ్యామల ఆగ్రహం.
విరాట్ చంద్రకళ నిజాన్ని తెలుసుకుని ఆమెను సమర్థించడం.
కామాక్షి మరియు శ్రుతి శ్యామలను రెచ్చగొట్టడం.
చంద్రకళ తన సమస్యలను అందరికీ వివరించడం.
చంద్రకళ రాత్రి అర్జున్ ఇంట్లో
నిన్ను కోరి టుడే సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో నా కూతురికి నొప్పులు వస్తున్నాయంటా అని బాబాయ్ అంటాడు. అర్జున్ ను నేను చూసుకుంటా మీరు వెళ్లండని చంద్రకళ చెప్తుంది. చంద్ర మీరు కూడా వెళ్లండని అర్జున్ అంటాడు. మీ ఫీవర్ కంట్రోల్ లో వచ్చేంతవరకూ ఉంటానని చంద్రకళ అంటుంది. తడిగుడ్డ తీసి నుదుటిపై పెడుతుంది.
అనుకున్నట్లుగానే గొడవ జరిగిందని శ్రీధర్ తో ఫోన్లో మాట్లాడుతుంది శాలిని. అర్జున్ ఇంటికి చంద్రకళ వెళ్లిందని శాలిని తెలుసుకుంటుంది. చంద్ర ఇంకా ఇంటికి రాలేదని శ్యామలను రెచ్చగొట్టి ఆఫీస్ కు వెళ్లకుండా చేయొచ్చని కామాక్షి, శ్రుతిని హెల్ప్ అడుగుతుంది శాలిని. శ్రుతిని సైలెంట్ చేసి చాడీలు చెప్తామని కామాక్షి వెళ్తుంది. చంద్ర పొద్దున వెళ్లి ఇంకా రాకపోవడం ఏంటీ? నీకన్నా మర్యాద ఉండాలి కదా. మాట్లాడగలిగేది నువ్వు ఒక్కదానివే. చెల్లదని వదిలేస్తే చంద్రకు అడ్డూ అదుపు లేకుండా పోతుందని శ్యామల తో కామాక్షి అంటుంది.
విరాట్ ప్రతిస్పందన
అప్పుడే విరాట్ ఆఫీస్ నుంచి వస్తాడు. తలనొప్పిగా ఉంది అత్తయ్య అని విరాట్ చంద్ర అని పిలుస్తాడు. ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. ఆవిడ ఇష్టారాజ్యమైపోయిందని శ్యామల అంటుంది. కామాక్షి, శ్రుతి కూడా రెచ్చగొట్టేలా మాట్లాడుతారు. శత్రువు అయినా సరే ఇంట్లో ఉంటే బాధ్యత మనదే కదా. ఇలా రాత్రి దాకా బరితెగించి తిరగడం కరెక్ట్ కాదు. ఈ రోజు ఊరుకోనని శ్యామల అంటుంది. చిన్న విషయం ఎందుకు పెద్దగా చేస్తున్నావని విరాట్ అంటే శ్యామల ఇంకా ఫైర్ అవుతుంది. బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దారి తప్పుతున్నాట్టుగా అనిపిస్తుందని శ్యామల అంటుంది.
అత్తయ్య నీ క్యారెక్టరే కాదు. చెప్పుడు మాటలు విని ఇలా ప్రవర్తించకు అని విరాట్ సీరియస్ అవుతాడు. అప్పుడే విరాట్ కు చంద్రకళ ఫోన్ చేస్తుంది. నీకు లేట్ అయిన ప్రతిసారి ఇంట్లో గొడవ చేస్తున్నారని విరాట్ అంటాడు. జరిగిందంతా చెప్పి పిక్ చేసుకోవడానికి విరాట్ ను రమ్మంటుంది చంద్ర. అర్జున్ కు చంద్ర జ్యూస్ తాగిస్తుండగా విరాట్ వస్తాడు. రాళ్లతో అటాక్ చేస్తారని అనుకోలేదని అర్జున్ అంటాడు. మీ ఇంట్లో ఎన్ని సమస్యలున్నా మీరు చంద్రకు ధైర్యాన్నిస్తున్నారని విరాట్ తో అర్జున్ అంటాడు.
శ్యామల ఆగ్రహం
విరాట్, చంద్ర రాగానే శ్యామల ఫైర్ అవుతుంది. అర్జున్ ఇంట్లో తెలిసే ఉందని వెళ్లానని విరాట్ అంటాడు. కామాక్షి, శ్రుతి తప్పుగా మాట్లాడతారు. అసలు కారణాన్ని అందరికీ చెప్తుంది చంద్రకళ. విరాట్ తలనొప్పితో బాధపడ్డాడు. పక్కన ఉండి చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదా? బయటివాళ్లే ఎక్కువయ్యారని శ్యామల మండిపడుతుంది. రాత్రంతా అక్కడే ఉండేదానివేమో అని శ్యామల అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరికి చంద్రకళ తన సమస్యలను అందరికీ వివరిస్తుంది. విరాట్ కూడా చంద్రకళను సమర్థిస్తాడు. శ్యామల ఆగ్రహం తగ్గిపోతుందా లేదా అనేది తదుపరి ఎపిసోడ్స్ లో చూడాలి.


