|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి సెప్టెంబర్ 4 ఎపిసోడ్: విరాట్ ఇంట్లో అర్జున్.. చంద్రకళను అవమానించేలా దుష్ట త్రయం ప్లాన్.. శ్యామల మాటలు

Published: 04-09-2025, 1:30 AM
నిన్ను కోరి సెప్టెంబర్ 4 ఎపిసోడ్: విరాట్ ఇంట్లో అర్జున్.. చంద్రకళను అవమానించేలా దుష్ట త్రయం ప్లాన్.. శ్యామల మాటలు

నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్ లో, శ్యామల చంద్రకళను అడ్డుకుంటుంది. అర్జున్ విరాట్ ఇంటికి వస్తాడు. శ్యామల, కామాక్షి, శ్రుతిల దుష్టతలతో చంద్రకళ ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటి?

Key Points

1

శ్యామల, చంద్రకళను పూజలో పాల్గొనకుండా అడ్డుకుంటుంది.

2

అర్జున్ విరాట్ ఇంటికి వస్తాడు, చంద్రకళతో పరిచయం అవుతాడు.

4

శ్యామల, చంద్రకళను ఇంటి నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంది.

శ్యామల ప్రతిఘటన

నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 4వ తేదీ ఎపిసోడ్ లో పూజకు కావాల్సిన సామగ్రిని తెమ్మని శాలిని వాళ్లను పంపించింది నేనేనని శ్యామల అంటుంది. పూజ చేయాల్సింది వాళ్లే కాబట్టి. పూజ చేయడానికి నువ్వు అర్హురాలు కాదు అని శ్యామల చెప్తుంది. ఈ ఇంట్లో ఉన్నంత వరకూ ఈ ఇంటి కోడలిగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పాను. పదే పదే అడ్డుకోవడం బాలేదని చంద్రకళ అంటుంది.

పండగ పూట గొడవలెందుకు అత్తయ్య? వరలక్ష్మి వ్రతానికి పర్మిషన్ ఇచ్చావు కదా. ఇప్పుడు ప్రాబ్లెం ఏముంది? అని విరాట్ అడుగుతాడు. మా అన్నయ్య కోలుకోవడానికి ఈ పూజ. చంద్రకళ పూజలో కూర్చోవడానికి ఒప్పుకోనని శ్యామల అంటుంది. మామయ్యకు చెడు జరగాలని కోరుకుంటానన్నదే మీ భయం అయితే నేను పూజలో కూర్చోను పిన్ని అని చంద్రకళ చెప్పేస్తుంది.

అర్జున్ యొక్క ఆగమనం

చంద్రకళ కొబ్బరికాయ పీచు తీస్తూ చేతికి గాయం చేసుకుంటుంది. అది చూసి జగదీశ్వరి జాగ్రత్తగా ఉండమని అంటుంది. చంద్రకళపై అభిమానం ఉన్నట్లు శాలిని నటిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసని చంద్ర అంటుంది. నువ్వు గ్రేట్ వదిన అని క్రాంతి వచ్చి పొగుడుతుంటే శాలినికి మండిపోతుంది.

వంట పని మొత్తం చంద్రకళే చూసుకోవాలని శ్యామల అంటే, ఈ రోజు ఆటాడుకోవాలని కామాక్షి అంటుంది. గరికతో పచ్చడి చేసుకుని తిందామని శ్రుతి అంటుంది. కామాక్షి సీరియస్ అవుతుంది. చంద్రకళ వంట మొదలెడుతుంది. భార్యకు చెమటలు పట్టడం చూడలేక ఫ్యాన్ పెట్టి వెళ్తాడు విరాట్. అప్పుడే పంచెకట్టులో అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. ఈ గెటప్ ఏంటీ? అని చంద్ర అడుగుతుంది. విరాట్ వచ్చి వెల్ కమ్ చెప్తాడు. కుటుంబంలో అందరినీ పరిచయం చేస్తుంది చంద్రకళ.

దుష్ట త్రయం యొక్క పన్నాగం

జగదీశ్వరిని దేవత అంటూ ఆశీర్వాదం తీసుకుంటాడు అర్జున్. శ్రుతి అడగడంతో శ్యామల, కామాక్షిలను కూడా దేవతలతో పోలుస్తాడు. అర్జున్ ముందు చంద్రకళకు అవమానం జరగాలని కామాక్షి, శ్రుతితో శాలిని అంటుంది. వినాయక చవితి రోజు చంద్రుణ్ని చూడకపోయినా చంద్రకళ నీలాపనిందలు మోయాలి. చంద్రకు సపోర్ట్ చేయడమనేది జస్ట్ డ్రామా. నేను చంద్రను ద్వేషిస్తే క్రాంతి నా మీద కోపం పెంచుకుంటున్నాడు. క్రాంతిని నమ్మించడానికి ఇలా చేస్తున్నానని శాలిని అంటుంది.

విరాట్, అర్జున్ మాట్లాడుతుంటారు. ఆ సమయంలో కాఫీ కలుపుతున్న చంద్ర దగ్గరకు వచ్చి అవమానించేలా శ్యామల మాట్లాడుతుంది. కొద్ది రోజుల్లో ఈ ఇంట్లో నీకే స్థానం పోతుంది. అతిథులను ఆహ్వానించడం ఎందుకో? అని శ్యామల అంటుంది. పిన్ని కాస్త మెల్లగా మాట్లాడండని చంద్ర అంటుంది. మన ఇంట్లోని గొడవలు బయట వాళ్లకు తెలియకపోవడం మంచిదని విరాట్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, శ్యామల చంద్రకళను అవమానించి, ఇంటి నుండి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తుంది. అయితే, చంద్రకళ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.