
నిన్ను కోరి సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. అర్జున్ కు ఇద్దరు తల్లులుండటం, శాలిని తన ప్రతీకారంతో తల్లీకూతుళ్లను బెదిరించడం, విరాట్ మరియు చంద్ర మధ్య సరసాలు వంటి సంఘటనలు కథానీ ఆసక్తికరంగా మారుస్తాయి.
Key Points
అర్జున్ కు ఇద్దరు తల్లులున్నారని వెల్లడించబడింది.
శాలిని తల్లీకూతుళ్లను చంపేస్తానని బెదిరిస్తోంది.
విరాట్ మరియు చంద్ర మధ్య రోడ్డు మీద సరసాలు జరుగుతున్నాయి.
క్రాంతి విడాకుల పేపర్స్ చింపేయడం కథానీ ప్రధాన మలుపు.
అర్జున్‌కు ఇద్దరు తల్లులు
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అన్నదమ్ములు తమ భార్యలతో కలిసి భోజనం చేస్తుంటే శ్యామల వచ్చి వడ్డిస్తుంది. నేను వడ్డిస్తానని చంద్ర అంటే నువ్వు ఇక్కడ ఉండేది 28 రోజులే అని శ్యామల అంటుంది. దానికి ఎదురు చెబుతుంది చంద్రకళ . విరాట్ ఎందుకు ఎదురుచెబుతావని అంటాడు.
లేకుంటే ఏంటీ బావ ప్రతిసారి గడువు గుర్తు చేస్తుంది. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా భర్తతో కలిసి తినాలని ఉండదా. నేను నా భర్తకు సేవలు చేస్తూ కలిసి భోజనం చేస్తాను. అది మీరు చూడలేకపోతుంటే ఇక్కడ ఉండకండి. మేము తిన్నాక వచ్చి తినండి అని చంద్రకళ అంటుంది. అది అన్ని మాటలు అంటుంటే ఏం అనవేంట్రా అని శ్యామల కోప్పడుతుంది.
మీ గొడవల్లోకి నన్ను లాగకండి అని విరాట్ అంటాడు. దాంతో ఏం చేయలేక కోపంగా వెళ్లిపోతుంది శ్యామల. క్రాంతి చింపేసిన విడాకుల పేపర్స్ ఉన్న డస్ట్ బిన్‌ను పని మనిషి మంగమ్మ హాల్లో పెడుతుంది. అది చూసుకోకుండా శ్రుతి తన్నుతుంది. అప్పుడు ఆ చిరిగిపోయిన పేపర్ ముక్కలు చూసిన శ్రుతి అతికిస్తుంది. అది తల్లికి చూపిస్తుంది.
శాలిని మార్పుకు కారణం ఇదే అనుకుంటారు తల్లీకూతుళ్లు. మరోవైపు చంద్రకళ దగ్గరికి వచ్చిన శాలిని నా భర్తను ఎలా మార్చుకున్నానో చూశావా. నేను అనుకుంది జరుగుతుంది. ఈ ఇంట్లో చక్రం తిప్పుతాను. ఈ ఇంటిని మెల్లిగా నాశనం చేస్తాను అని శాలిని అంటుంది. మీరు కలవడం సంతోషం. ఆల్ ది బెస్ట్ అని చంద్రకళ వెళ్లిపోతుంది.
శాలిని ప్రమాదకర బెదిరింపులు
కొత్త బిజినెస్ పార్టనర్ చంద్రకళకు గ్రాండ్ వెల్కమ్ చెబుతారు. గుడ్ లక్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఒకరికొకరు చెప్పుకుంటారు అర్జున్, చంద్రకళ. పార్టనర్ అని చెప్పి అన్ని పనులు మీరే చేశారని చంద్రకళ అంటే చెబితే థ్రిల్ ఏముంటుంది. మీకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుని ఇచ్చాను అని అర్జున్ అంటాడు. తెలిగింటి పచ్చళ్లు పేరు చాలా బాగుందని చంద్రకళ అంటుంది.
రిబ్బన్ కటింగ్‌కు స్పెషల్ గెస్టులు వస్తున్నారు అని అర్జున్ చెబితే ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. వాళ్ల కాళ్లకు నమస్కరించి తీసుకొస్తాడు అర్జున్. అనాథ ఆశ్రమంలో నన్ను పెంచిన పెద్ద చేసిన వార్డెన్స్. నా దృష్టిలో అమ్మ అనే పదానికి అర్థం వీళ్లిద్దరు. నాకు ఇద్దరు తల్లులు అని వాళ్ల గురించి పొగుడుతాడు అర్జున్. తర్వాత అర్జున్ మంచితనం గురించి వాళ్లు పొగుడుతారు.
రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్తారు. చంద్రకళ దీపం వెలిగిస్తుంది. చంద్రకళ గురించి అర్జున్ తనను పెంచిన తల్లులకు చెబుతాడు. ముందుగా వాళ్లతోనే చంద్రకళ పచ్చళ్లు అమ్మిస్తాడు. అనాథ ఆశ్రమానికి చెక్ రాసి ఇస్తాడు అర్జున్. పచ్చళ్లను ఫ్రీగా పంపిస్తానని చెబుతాడు అర్జున్. మరోవైపు తల్లీకూతుళ్లు కలిసి చెరిగిన పేపర్ ముక్కలు అతికిస్తారు. అవి డివోర్స్ పేపర్స్ అని చూసి షాక్ అవుతారు.
మన దగ్గర ఇంత పెద్ద విషయం దాస్తుందా. పదా అని శాలిని దగ్గరికి వెళ్లి అడుగుతారు కామాక్షి, శ్రుతి. శాలిని చిరాకు పడుతుంది. క్రాంతి నీకు డివోర్స్ పేపర్స్ పంపించాడుగా. ఎందుకు పంపించాడు అని కామాక్షి, శ్రుతి అడుగుతారు. కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదని శాలిని అంటుంది. ఈ విషయం జగదీశ్వరి వదినకు చెబుతాను అని కామాక్షి బ్లాక్ మెయిల్ చేస్తుంది.
విరాట్ మరియు చంద్ర సరసాలు
చెప్పేయండి. ఇప్పుడు వెళ్లి చెప్పి కడుపునిండా పడుకుంటారు. తెల్లారి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు శవమై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఏంటీ అర్థమైందా. ఈ విషయాన్ని బయటపెట్టకుండా లోపల దాచుకోండి. అదే మీకు మంచిది. వెళ్లండి అని రివర్స్ వార్నింగ్ ఇచ్చి పంపించేస్తుంది శాలిని . ఏంటమ్మా శాలిని కొంచెం కూడా భయపడట్లేదు అని శ్రుతి అంటుంది.
భయపడుతుంది. కానీ, బయటపడట్లేదు. అలా అయితే తన జుట్టు మన చేతుల్లోకి వస్తుంది కదా. దీన్ని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకుందాం అని కామాక్షి అంటుంది. ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి వెళ్లిన చంద్రకళ రఘురాం పరిస్థితి అలాగే ఉందని, ఏం చేస్తే కోలుకుంటారు అని అడుగుతుంది.
తర్వాత రోడ్డు మీద విరాట్ , చంద్రకళ కొబ్బరి బొండాలు తాగుతారు. రోడ్డు మీద విరాట్‌తో రొమాంటిక్‌గా సరసాలు ఆడుతుంది చంద్రకళ. అది చూసిన శ్రుతి వెళ్లి శ్యామలకు చెబుతుంది. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్ లో చూపించిన సంఘటనలు కథానీ మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. శాలిని యొక్క ప్రవర్తన మరియు విరాట్, చంద్రల మధ్య సంబంధం తదుపరి ఎపిసోడ్స్ పై ఆసక్తిని పెంచుతున్నాయి.
