|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను పొగిడిన శ్యామల.. నిజం దాచాలన్న జగదీశ్వరి.. విరాట్‍ను కౌగిలించుకున్న చంద్ర

Published: 03-06-2025, 12:58 AM
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 3: చంద్రకళను పొగిడిన శ్యామల.. నిజం దాచాలన్న జగదీశ్వరి.. విరాట్‍ను కౌగిలించుకున్న చంద్ర

నిన్ను కోరి సీరియల్‌లో జూన్ 3వ తేదీ ఎపిసోడ్‌లో చాలా ఉత్కంఠభరితమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్యామల చంద్రకళను అభినందించగా, జగదీశ్వరి ఒక ముఖ్యమైన రహస్యాన్ని దాచింది. శాలినీ, శృతి, కామాక్షిల ప్రవర్తన కూడా ఆసక్తికరంగా ఉంది.

Key Points

1

శ్యామల చంద్రకళను హృదయపూర్వకంగా పొగిడింది.

2

జగదీశ్వరి విరాట్ మరియు చంద్రకళ పెళ్లి నిజాలను దాచడానికి ప్రయత్నించింది.

4

చంద్రకళ తన అత్తమామలతో సమర్ధవంతంగా వ్యవహరించింది.

శ్యామల ప్రశంసలు మరియు జగదీశ్వరి రహస్యం

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 3) ఎపిసోడ్‍లో పెద్దోడి పెళ్లికి కూడా నన్ను పిలవలేదు కదా అని బాధగా జగదీశ్వరిని అడుగుతుంది భీమవరం శ్యామల. మమ్మల్నే పిలవలేదని వెటకారంగా అంటుంది కామాక్షి. నేను వచ్చా కదా.. మా అన్నయ్య రఘురాం లేచి ఎగిరి గంతేలా చేస్తానని శ్యామల చెబుతుంది. అంతా గందరగోళంగా అయిందని, అందుకే నీదాక ఈ విషయం రాలేదని జగదీశ్వరి సర్దిచెబుతుంది. ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది. లోపలికి వచ్చి మీ ఆయన పక్కన నిలబడు అని శ్యామల చెబుతుంది.

విరాట్ చంద్రను పెళ్లి చేసుకోవడం అత్తయ్యకు ఇష్టం లేదని శృతి చెప్పాలనుకుంటే.. జగదీశ్వరి అడ్డుకుంటుంది. అమ్మా చంద్ర.. లోపలికి రా అని పిలుస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. శ్యామల కాళ్లకు చంద్ర నమస్కరిస్తుంది. చంద్రుడిలో ఉన్న కళే నీలో ఉందని చంద్రను పొగిడేస్తుంది శ్యామల. విరాట్‍కు పెళ్లయిందని తన వాళ్లకు ఫోన్‍ సంబరంగా చెప్పేస్తుంటుంది శ్యామల. అమ్మాయిలో లక్ష్మీకళ ఉట్టిపడుతోందని చంద్రను చూసి అంటుంది.

ఇలాంటి వాళ్ల మధ్య బతకడం కష్టమే, వీళ్లకు పట్టిన వైరస్‍కు యాంటీవైరస్ కూడా పని చేయదని శాలినీ, శృతి, కామాక్షి గురించి చంద్రకళ తో శ్యామల చెబుతుంది. వాళ్ల మాటలు పట్టించుకోవద్దని అంటుంది. విరాట్, చంద్రకళకు ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి అయిందో శ్యామలకు నిజాలు చెప్పొద్దని అందరికీ జగదీశ్వరి చెబుతుంది. శ్యామలకు నిజాలు తెలిసేందుకు వీలులేదని గట్టిగా హెచ్చరిస్తుంది.

చంద్రకళ ఎదుర్కొన్న సవాళ్లు

తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర ఏర్పాట్లు చేస్తుంటుంది చంద్ర. కామాక్షి, శృతి, శాలినీ వచ్చి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటారు. చంద్ర కౌంటర్లు ఇస్తుంది. కొత్తగా వచ్చిన కుండను చూసుకొనేనా నీ ధైర్యం అని శ్యామల గురించి శాలినీ అంటుంది. ఈ మాటను వెనుక నుంచి శ్యామల వింటుంది. ఇది చూసి చంద్ర రెచ్చిపోతుంది. ఆవిడ వయసుకైనా గౌరవం ఇవ్వు అని శాలినీతో చంద్ర అంటుంది. కామాక్షి, శృతి కూడా శ్యామలను మాటలు అంటారు. ఇదంతా శ్యామల వింటూ ఉంటుంది. వెనకే శ్యామలను చూసి శాలినీ, శృతి, కామాక్షి భయపడిపోతారు. కుండ అని ఏదో అంటున్నావ్.. నేను కుండను కాదు కొండను అని శ్యామల అంటుంది. ఆ ముగ్గురినీ మాటలతో ఓ ఆట ఆడుకుంటుంది.

ముందు మీరు కూర్చొండి పిన్ని అని చంద్ర అంటే.. ఇదీ మర్యాద అంటే అని శ్యామల సంతోషిస్తుంది. తిందాం రా అని శ్యామల పిలిస్తే.. ఆకలి లేదని జగదీశ్వరి అంటుంది. మీకు ఇష్టమైన మిర్యాల చారు చేశానని చంద్ర చెబుతుంది. అప్పుడే అత్త ఇష్టాలు తెలుసుకున్నావా అని శ్యామల అంటుంది.

కుటుంబంలోని విభేదాలు

విరాట్‍, చంద్రను కూడా తినేందుకు శ్యామల పిలుస్తుంది. ఒకరి పక్కన ఒకరు కూర్చోవాలని అంటుంది. కామాక్షి, శృతిని వడ్డించాలని చెబుతుంది. నీ భార్య గురించి ఎందుకు ఏమీ మాట్లాడడం లేదని విరాట్‍ను శ్యామల అడుగుతుంది. నీకు చంద్రకు ఏమైనా గొడవ ఉందా అని ప్రశ్నిస్తుంది.

కమింగ్ అప్‍లో.. విరాట్, చంద్రను ఒకరికొకరు తినిపించుకోవాలని శ్యామల చెబుతుంది. ఇద్దరూ తినిపించుకుంటారు. చంద్ర సంతోషిస్తుంది. గదిలోకి వెళ్లిన తర్వాత.. ఓవర్ చేస్తున్నావని చంద్రకళపై కోప్పడతాడు విరాట్. బావా.. శ్యామల అత్తయ్య చూస్తున్నారని చంద్ర అంటుంది. దీంతో నువ్వంటే నాకు ఎంత ఇష్టమని మాట మార్చేస్తాడు విరాట్. చిలిపి అంటూ విరాట్‍ను హగ్ చేసుకుంటుంది చంద్ర. విరాట్ కూడా దగ్గరికి తీసుకుంటాడు. చంద్రను చూస్తే 25ఏళ్ల క్రితం నిన్ను చూసినట్టు ఉందని జగదీశ్వరితో శ్యామల అంటుంది. చంద్రను ప్రశంసిస్తుంది.

చివరిగా, చంద్రకళ తన అత్తమామలతో సమర్థవంతంగా వ్యవహరించింది. ఆమె సహనం మరియు తెలివితేటలు ఈ ఎపిసోడ్‌లో స్పష్టంగా కనిపించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.