|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వరుసగా 7 ఫ్లాపులు, ఈసారి హిట్ కొట్టాల్సిందే.. హార్స్ రైడర్ అవతారం ఎత్తబోతున్న నితిన్

Published: 04-08-2025, 5:05 AM

టాలీవుడ్ నటుడు నితిన్ వరుస ఫ్లాపులతో పోరాడుతున్నాడు. భీష్మ తర్వాత వచ్చిన ఏడు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు, హార్స్ రైడర్ పాత్రతో ఆయన తిరిగి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

Key Points

1

నితిన్ వరుసగా ఏడు చిత్రాలతో పరాజయం పాలయ్యాడు.

2

కొత్త చిత్రంలో హార్స్ రైడర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

4

బలగం వేణు దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభించేందుకు సన్నాహాలు.

నితిన్ కెరీర్ లోని పరాజయాలు

గతంలో హీరో నితిన్ వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు కూడా నితిన్ కి వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి. గతంలో నితిన్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులని ఈ ఫ్లాపులు గుర్తు చేస్తున్నాయి. భీష్మ తర్వాత నితిన్ నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కెరీర్ బిగినింగ్ లో జయం, దిల్, సై లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నితిన్ టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడవుతాడని అంతా ఆశించారు.

ఆ తర్వాత పదేళ్ల పాటు నితిన్ కి సరైన హిట్ లేదు. ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా నితిన్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుండా నితిన్ మార్కెట్ పూర్తి స్థాయిలో దెబ్బ తినే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీష్మ తర్వాత నితిన్ చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలలో నటించారు. ఈ చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

కొత్త చిత్రం మరియు హార్స్ రైడర్ పాత్ర

ప్రస్తుతం నితిన్ రెండు చిత్రాలని ఓకె చేసినట్లు తెలుస్తోంది. ఎల్లమ్మ చిత్రం బలగం వేణు దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్ లో ఆల్రెడీ ఖరారు అయింది. ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇది నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో నితిన్ పాత్రకి సంబంధించిన ఆసక్తికర వివరాలు బయటకి వచ్చాయి. నితిన్ ఈ మూవీలో హార్స్ రైడర్ గా ఒక వీరుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో కీలకం కాబోతున్నాయట. ఈ చిత్రం కోసం నితిన్ బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ కి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

విక్రమ్ కుమార్ మరియు బలగం వేణు చిత్రాలు

ఈ ఏడాది చివర్లో నితిన్, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో మూవీ మొదలవుతుంది. ఈలోపు బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ చిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నితిన్ చివరగా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించిన తమ్ముడు చిత్రం బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో హీరోయిన్ లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నితిన్ కెరీర్ లో ఈ కీలకమైన సమయంలో, ఆయన కొత్త చిత్రాలపై అన్ని కళ్ళు ఉన్నాయి. హార్స్ రైడర్ పాత్రతో హిట్ కొట్టగలరా అనేది ఆసక్తికరంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.