|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు

Published: 17-10-2025, 1:11 AM
Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు

టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం కెరీర్ లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నితిన్, ఈసారి మాత్రం గట్టిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఒక కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టబోతున్నాడు.

Key Points

1

నితిన్ గత 11 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి, "అఆ" తర్వాత హిట్ లేదు.

2

"లిటిల్ హార్ట్స్" బ్లాక్ బస్టర్ దర్శకుడు సాయి మార్తాండ్ తో కొత్త సినిమా.

4

ఈ సినిమాతో నితిన్ ఎలాగైనా సూపర్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు.

నితిన్ కెరీర్.. వరుస డిజాస్టర్లు

Nithin: నితిన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయినా పేరు. కారణం అందరికీ తెలిసిందే. హిట్ సినిమా. అవును, ఈ హీరో నుంచి వచ్చిన గత సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక నితిన్ లాస్ట్ కమర్షియల్ హిట్ అంటే “అఆ”(Nithin) అనే చెప్పాలి. ఈ తరువాత నితిన్ నుంచి దాదాపు 11 సినిమాలు వచ్చాయి. గడ్డలకొండ గణేష్ గెస్ట్ రోల్ తో కలిపి 12. అందులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. మధ్యలో భీష్మ కాస్త బెటర్ అనిపించింది. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా మారాయి.

Kiran Abbavaram: ఇంకా.. ఇంకా ఎదుగుతూనే ఉంటాను.. కె ర్యాంప్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం కామెంట్స్..

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో నితిన్ నెక్స్ట్

ఈ ఎఫెక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాలపై పడింది. అప్పటికే ఒకే చేసిన రెండు సినిమాల నుంచి కూడా ఆయన్ని తీసేశారు. అందులో బలగం వేణు చేస్తున్న ఎల్లమ్మ, ఇష్క్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు నితిన్ కెరీర్ ఎలా అని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, వారికి ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన బ్యూటిఫుల్ కథకు ఒకే చెప్పేశాడట నితిన్. ఆ దర్శకుడు మరెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి మార్తాండ్. ఈ యువ దర్శకుడు ఇటీవల నితిన్ కి ఒక కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట నితిన్.

ఈసారి టార్గెట్ హిట్.. ఏషియన్ సినిమాస్

త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. ఈ క్రేజీ ప్రాజెక్టును ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మించనున్నారు. దీనికి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాతో అయినా సూపర్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడట నితిన్. మరి తన నెక్స్ట్ సినిమా కోసం కుర్ర డైరెక్టర్ ను సెట్ చేసుకున్న నితిన్ కి హిట్ వస్తుందా లేదా అనేది చూడాలి.

ఈసారి నితిన్ ఎంచుకున్న ఈ “బ్లాక్ బస్టర్” మార్గం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. తన కెరీర్ కు కీలకమైన ఈ చిత్రంతో నితిన్ మళ్ళీ విజయాల బాట పడతాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.