|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నితిన్ మాస్ ట్రీట్: హిట్ డైరెక్టర్‌తో పూనకాలు లోడింగ్! ఫ్యాన్స్‌కి పండగే!!

Published: 05-02-2026, 8:30 AM
నితిన్ మాస్ ట్రీట్: హిట్ డైరెక్టర్‌తో పూనకాలు లోడింగ్! ఫ్యాన్స్‌కి పండగే!!
  • నితిన్, హిట్ డైరెక్టర్ అంజి కాంబోలో విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ ఫిక్స్!
  • విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ తో నితిన్ కొత్త సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
  • శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు!
  • ఈ ఏడాది చివరిలో ఒక సినిమా, వచ్చే ఏడాది సంక్రాంతికి మరో సినిమా విడుదల కానున్నాయి.

టాలీవుడ్ హీరో నితిన్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హిట్ డైరెక్టర్ తో కలిసి ఒక అదిరిపోయే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడు.

హిట్ డైరెక్టర్ తో నితిన్ మూవీ ఫిక్స్!

Nithin: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ, ఏమయ్యిందో తెలియదు ఈమధ్య నితిన్ నుంచి వస్తున్న సినిమాలు డిజాస్టర్స్ అవుతున్నాయి. 2020లో వచ్చిన భీష్మ తరువాత ఒక్క హిట్ కూడా లేదు నితీన్(Nithin) కి.

ఇటీవల వచ్చిన తమ్ముడు సినిమాకు కూడా ఘోర పరాజయం చవిచూసింది. అందుకే, తన నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నితిన్. ఆమధ్య బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు నితిన్ అంటూ వార్తలు వినిపించాయి. కానీ, ఆ అవకాశాన్ని దేవి శ్రీ ప్రసాద్ కొట్టేశాడు. ఆ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఈమధ్యే కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. విలక్షణ చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ తో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. దీనికి సంబందించిన పోస్టర్ కూడా విడుదల అయ్యింది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్

త్వరలోనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. అయితే, తాజాగా మరో దర్శకుడికి కూడా ఒకే చెప్పాడట నితిన్. ఆ దర్శకుడు మరెవరో కాదు అంజి. ఈ దర్శకుడు చేసిన మొదటి సినిమా ఆయ్. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ దర్శకుడు చెప్పిన కథ నితిన్ కి బాగా నచ్చిందట. ఈ కథ కూడా ఆయా తరహాలోనే విలేజ్ బ్యాక్డ్రాప్ లో కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందట. నితిన్ కూడా కామెడీ ఎంటర్టైనర్ చేసి చాలా కాలం అయ్యింది.

శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సినిమా

అందుకే అంజి చెప్పిన ఆ కథను వెంటనే ఒకే చేశాడట. తన స్వంత బ్యానర్ అయినా శ్రేష్ట్ మూవీపై ఈ సినిమాను చేయనున్నాడట నితిన్. ఓపక్క వీఐ ఆనంద్ మూవీ చేస్తూనే దర్శకుడు అంజితో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడట నితిన్. ఈ రెండు సినిమాలలో ఒకటి ఈ ఇయర్ ఎండింగ్ లో మరొకటి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ రెండు సినిమాలతో అయినా నితిన్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.

నితిన్ వరుసగా రెండు సినిమాలతో బిజీగా ఉండనున్నారు. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం చివరిలో, వచ్చే సంక్రాంతికి విడుదల కానున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.