|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎలా ఉండేది.. ఎలా మారిపోయింది.. హీరోయిన్ నివేదా థామస్ పై ట్రోలింగ్ !

Published: 15-06-2025, 7:33 AM
ఎలా ఉండేది.. ఎలా మారిపోయింది.. హీరోయిన్ నివేదా థామస్ పై ట్రోలింగ్ !

కేరళకు చెందిన నటి నివేదా థామస్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. తాజాగా గద్దర్ అవార్డ్స్‌లో ఆమె కనిపించిన రూపం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఆమె లావుగా కనిపించడంతో నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.

Key Points

1

నివేదా థామస్ గద్దర్ అవార్డ్స్‌లో మెరిసింది.

2

చీరలో సాంప్రదాయ దుస్తులతో ఆమె అందం ఆకట్టుకుంది.

4

నివేదా థామస్‌పై నెటిజన్లు విమర్శలు, ప్రశంసలు కురిపిస్తున్నారు.

నివేదా థామస్ గద్దర్ అవార్డ్స్‌లో

టాలీవుడ్ స్టార్ నటి నివేదా థామస్ ( Nivetha Thomas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ నుంచి వచ్చి టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసి.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది నివేదా థామస్. 2002 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా బాలనాటిగా పరిచయమైన నివేదా థామస్… ఆ తర్వాత హీరోయిన్ గా కూడా రాణించింది. దాదాపు మూడు సినిమాల్లో బాలనటిగా మెరిసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన లుక్స్

ఇటు తెలుగులో జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది నివేదా థామస్. ఈ సినిమా 2016 లో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరు, దర్బార్, వి, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో మెరిసింది. అయితే అలాంటి నివేదా థామస్… తాజాగా గద్దర్ అవార్డ్స్ ( Gaddar awards) ఫంక్షన్ లో మెరిసింది.

నెటిజన్ల విమర్శలు, ప్రశంసలు

బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డు దక్కించుకున్న నేపథ్యంలో.. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా… చీరలో గద్దర్ ఈవెంట్ కు వచ్చారు నివేదా థామస్. ఈ సందర్భంగా ఆమె లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో చాలా సన్నగా ఉండే నివేదా థామస్… ఇప్పుడు చాలా లావు అయిపోయారు. గతానికి, ఇప్పటికీ ఏమాత్రం పోలిక లేకుండా మారిపోయారు. ఇక ఆమెను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు. నివేదా థామస్ ఇలా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.

నివేదా థామస్‌కు మద్దతుగా మరియు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె రూపంలోని మార్పుపై విభిన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చర్చ ఇంకా కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.