
📌 Key Points
- నివేదా పేతురాజు ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు, కానీ వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్నారు.
- వ్యాపారవేత్త రజిత ఇబ్రాన్ తో ప్రేమలో పడి, అతన్ని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.
- అయితే, వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది, రజిత్ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు.
- నివేదా మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది, దర్శకులను, నిర్మాతలను సంప్రదిస్తోంది.
నివేదా పేతురాజు తన కెరీర్ ని వదిలి ఒక వ్యక్తిగత బంధంలోకి అడుగుపెట్టింది. అయితే, ఆ బంధం విఫలం కావడంతో తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఆమె అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.
నివేదా పేతురాజు ప్రేమ వ్యవహారం, బ్రేకప్
Nivetha Pethuraj: నివేదా పేతురాజు.. మెంటల్ మదిలో, చిత్రలహరి వంటి సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నివేదా.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలవడం సంచలనంగా మారింది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈమె ఆ కెరియర్ ను కొనసాగించకుండా వ్యక్తిగత జీవితంలోకి అడుగులు వేసి సినిమాలకు విరామం ఇచ్చింది.. అయితే అటువైపు వేసిన అడుగు ఈమెకు కలిసి రాకపోవడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి రావాలని తెగ పరితపిస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.. మరి బ్రేకప్ తర్వాత రీ ఎంట్రీ కోసం తిప్పలు పడుతున్న నివేదాకి మంచి అవకాశం వస్తుందా? అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నివేదా కెరియర్ జోరుగా సాగుతున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త రజిత ఇబ్రాన్ తో ప్రేమలో పడింది. అతనితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే 2023లో సినిమాలకి గుడ్ బై చెప్పేసింది. పైగా తన బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ కాబోయే భర్తను పరిచయం చేసి… సడన్గా అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు కూడా అభిమానులతో పంచుకుంది. ఇక దీంతో పెళ్లి చేసుకొని నివేదా సెటిలైపోతుందని అటు అభిమానులు ఇటు సినీ ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కట్ చేస్తే ఇద్దరి మధ్య బ్రేకప్.. ఇంస్టాగ్రామ్ నుండి ప్రియుడుతో ఉన్న ఫోటోలను తొలగించి విడిపోతున్నాం అంటూ అందరికీ హింట్ ఇచ్చింది. తాజాగా రజిత్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో.. నివేదా చేసేదేమీ లేక తన గతాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి మళ్ళీ అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే టాలీవుడ్ లోని పాత నిర్మాతలను, దర్శకులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.
సినిమాలకు గుడ్ బై చెప్పిన నివేదా
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈమె.. ఇప్పుడు హీరోయిన్ గా కాకపోయినా కథలో ప్రాధాన్యత ఉంటే ఎలాంటి పాత్ర చేయడానికి అయినా సిద్ధమే అంటూ చెబుతోందని తెలుస్తోంది అంటూ దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తోంది. ఏది ఏమైనా ప్రేమ కోసం ఎదుగుతున్న కెరియర్ ను పక్కన పెట్టిన ఈమె.. ఆ ప్రేమ కాస్త విఫలం కావడంతో ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం పాకులాడడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈమె ఒక గొప్ప నటి కచ్చితంగా మంచి కం బ్యాక్ ఇస్తుందన్న విషయం తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి అంతా అనుకున్నట్టు నివేదా మునుపటి వైభవాన్ని అందుకుంటున్నారో లేదో చూడాలి..
రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు
ఇక నివేదా విషయానికి వస్తే.. అందం, అభినయంతో నటనతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. కానీ విధి విధిరాత వల్ల తన కెరియర్ ను కూడా పక్కనపెట్టి ప్రేమ కోసం అడుగులు వేసింది . కానీ ఆ విధే మళ్లీ సినిమాలలోకి వచ్చేలా చేసిందని.. అందుకే ఇకపై ఇలాంటి వాటి జోలికి వెళ్లకుండా సినిమాలు చేస్తూ కెరియర్ పై దృష్టి పెట్టాలని సినీ ప్రేక్షకులు సలహాలు ఇస్తున్నారు. మరి నివేదా ఇప్పటికైనా మళ్లీ మంచి అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలోనే సెటిల్ అవుతుందేమో చూద్దాం..
నివేదా పేతురాజు తన ప్రేమ జీవితంలో ఎదురుదెబ్బ తగలడంతో మళ్ళీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ఆమెకు మంచి అవకాశాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఆమె కంబ్యాక్ కోసం ఎదురుచూద్దాం.


