|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దురంధర్ 2: గల్ఫ్ అడ్డంకులు తొలగిస్తారా? 100 కోట్ల నష్టాన్ని మేకర్స్ ఎలా పూడ్చుకుంటారు?

Published: 14-02-2026, 3:35 AM
దురంధర్ 2: గల్ఫ్ అడ్డంకులు తొలగిస్తారా? 100 కోట్ల నష్టాన్ని మేకర్స్ ఎలా పూడ్చుకుంటారు?
  • దురంధర్ మొదటి భాగం ఊహించని విజయం సాధించింది, రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
  • దురంధర్ 2 మార్చి 19న విడుదల కానుంది, ఇది హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కానుంది.
  • మొదటి భాగంలో గల్ఫ్ దేశాల్లో సెన్సార్ కారణంగా రూ.100 కోట్ల నష్టం వాటిల్లింది.
  • ఈసారి గల్ఫ్ దేశాల్లో విడుదల చేసి నష్టాన్ని పూడ్చాలని నిర్మాతలు భావిస్తున్నారు.

రణ్ వీర్ సింగ్, సారా అర్జున్ నటించిన దురంధర్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దురంధర్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మొదటి భాగంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి మేకర్స్ సరికొత్త ప్లాన్ చేస్తున్నారు.

దురంధర్ 2 పై భారీ అంచనాలు

Dhurandhar 2 : ధురంధర్ (Dhurandhar).. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ (Aditya dhar) దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్ గా తొలి పరిచయంలో వచ్చిన చిత్రం ఇది. ఎటువంటి అంచనాలు లేకుండా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి సుమారుగా రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకి కొనసాగింపుగా ‘ధురంధర్ 2: ది రివేంజ్ ‘ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను మార్చి 19వ తేదీన హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా మొదటి భాగం సాధించిన సక్సెస్ కారణంగా ఈ సీక్వెల్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇకపోతే ఇదే రోజున గీతూ మోహన్ దర్శకత్వంలో కేజీఎఫ్ సినిమాలతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో యష్(Yash ) నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా కూడా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది. ఇక రెండు బడా చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

గల్ఫ్ దేశాల్లో నిషేధం.. 100 కోట్ల నష్టం

ఈ నేపథ్యంలోనే సీక్వెల్ విషయంలో ఎక్కడా తగ్గకుండా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో సినిమాను రూపొందించారు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మేకర్స్ సీక్వెల్ విషయంలో మాస్టర్ స్కెచ్ వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. మొదటి భాగం విడుదలైన సమయంలో గల్ఫ్ దేశాలలో సెన్సార్ కారణంగా ఈ చిత్రం నిషేధానికి గురైంది. దీనివల్ల నిర్మాతలకు సుమారుగా రూ.100 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైన తర్వాత అటు గల్ఫ్ దేశాలలో కూడా ఈ సినిమాకు అత్యధిక వ్యూస్ రావడం విశేషం.

పైగా పాకిస్తాన్లో కూడా ఈ చిత్రానికి విపరీతమైన ఆదరణ లభించింది. ఓవరాల్గా 11 దేశాలలో ట్రేడింగ్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది ఈ సినిమా. అందుకే ఈసారి గల్ఫ్ దేశాలలో కూడా సెన్సార్ అడ్డంకులు లేకుండా సినిమాను విడుదల చేసి .. ఆ 100 కోట్ల నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా ఈ సినిమా విడుదలైతే సినిమా వసూళ్లు సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పవచ్చు.

నష్టాన్ని పూడ్చడానికి మేకర్స్ ప్లాన్

అందుకే గతంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ వివాదాలకు చోటు ఇవ్వకుండా.. ఈ సినిమాను మలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మేకర్స్ గల్ఫ్ దేశాల ఆదాయాన్ని కూడా పెంపొందించుకోవడానికి ఇప్పుడు ఈ రకమైన మాస్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే ఒక్క సినిమాతోనే సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ ఈసారి ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తారో చూడాలి. ఏది ఏమైనా అటు టాక్సిక్ మూవీ పోటీని తట్టుకొని ఈ సినిమా ఊహించని రికార్డులు సొంతం చేసుకోవాలని రణవీర్ సింగ్ అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు.

దురంధర్ 2 చిత్రం గల్ఫ్ దేశాలలో విడుదలైతే, భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. మేకర్స్ పాత పొరపాట్లను సరిదిద్దుకుంటూ, వివాదాలకు తావు లేకుండా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.