
📌 Key Points
- నందిని రెడ్డి తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
- నటీనటులు కథ తెలిసి, బలవంతం లేకుండానే సినిమాలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు.
- జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదంపై బుచ్చిబాబుకు పరోక్షంగా మద్దతు పలికారు.
- విమర్శలు, ప్రశంసలు రెండూ స్వీకరించాలని, లేదంటే ఇండస్ట్రీలో నిలబడలేరని అన్నారు.
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదంపై పరోక్షంగా బుచ్చిబాబుకు మద్దతు పలికారు. ఇండస్ట్రీలో రాణించాలంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆమె కుండబద్దలు కొట్టారు.
నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు: ఇండస్ట్రీలో రాణించాలంటే..
Nandini Reddy’s Bold Comments: ప్రముఖ కథానాయిక సుమంత హీరోయిన్ గా నటించి, నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంతతో పాటు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. నందినీరెడ్డి ఈ మూవీని తెరకెక్కించారు.. ఇక సినిమా ఈ నెల 19న విడుదల కాబోతున్నసందర్భంగా ప్రమోషన్లలో వేగం పెంచింది మూవీ టీమ్.
ఈ క్రమంలోనే జరిగిన ఇక ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసుకొచ్చింది డైరెక్టర్ నందిని రెడ్డి. ముఖ్యంగా సినిమా చేయాలని ఎవరూ గన్ పెట్టి బలవంతం చేయరని, కథ ఏంటి ఎలా ఉంటుంది అని నటీనటులకి ముందుగానే చెబుతారని, అయితే అది చేయాలా వద్దా అనేది పూర్తిగా వారి నిర్ణయమేనని చెప్పుకొచ్చారు.
రాణించాలంటే అన్నింటికీ సిద్దపడి ఉండాలి
అయితే డబ్బు ఎక్కువఫా ఆఫర్ చేసినా కూడా వద్దు అని చెప్పే స్థోమత ఉందా లేదా అన్నది ఇక్కడ కీ రోల్ పోషిస్తుందని, అంతే తప్ప నువ్ తప్పని సరిగా ఈ సినిమా చేయాలని ఎవరూ బలవంతం చేయరని తేల్చి చెప్పారు.ఇండస్ట్రీలో రాణించాలంటే అన్నింటికీ సిద్దపడి ఉండాలని, అలా కాకుండా విమర్శలు తీసుకొను,కేవలం ప్రశంసలు మాతమే తీసుకుంటానంటే ఇక్కడ కుదరదని కుండబద్దలు కొట్టారు.
జాన్వీ కపూర్ బోల్డ్ సీన్స్ వివాదంపై పరోక్ష మద్దతు
జబర్ధస్ట్ సినిమా చేసినప్పుడు తనని అంతకన్నా ఎక్కువ బండబూతులు తిట్టారని, వాటిని కూడా స్వాగతించానని ,అలా కాకుండా నేను అలా మొదలైంది అనే సినిమా తీశాను కాబట్టి కాస్త ఎక్స్క్యూజ్ చేయండి అని అడగలేదని మనసులో మాటని బయటపెట్టారు.
ఇన్ డైరెక్ట్ గా బుచ్చి బాబుకి మద్దతుగా కామెంట్స్
‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్లలో డైరెక్టర్ కామెంట్స్
అయితే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత పై సినిమా సర్కిల్స్ లో ఇప్పటికే హాట్ హాట్ డిస్కషన్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇక ఇప్పటికే జాన్వీకి సపోర్ట్ గా జయ బచ్చన్, ఆషిక రంగనాథ్, కరీనా కపూర్ వంటి వారు తమ వాయిస్ వినిపించగా, వారికి భిన్నంగా నందిని రెడ్డి అన్నీ తెలిసే అడుగు ముందుకు వేస్తారు అన్న విధంగా మాట్లాడం ఇపుడు ఇక్కడ గమనార్హం.
ఇక సినిమా విషయానికి వస్తే రాజ్ నిడిమోరు, వసంత్ మరిన్‌గంటి, సీతా మీనన్‌తో కలిసి స్టోరీ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.ఇక ఈ సినిమాలో శ్రీముఖి, శ్రీనివాస్ గవిరెడ్డి, దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, మంజూష తదితరులు కీలక పాత్రలు పోషించారు.చూడాలి మరి ఇన్ డైరెక్ట్ గా బుచ్చి బాబుకి మద్దతుగా కామెంట్స్ చేసుకొచ్చిన నందిని రెడ్డి కామెంట్స్ పై ఎవరెలా రియాక్ట్ అవుతారో !
మొత్తానికి, నందిని రెడ్డి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో నటీనటుల బాధ్యత, ఎదురయ్యే సవాళ్లను స్పష్టం చేశాయి. జాన్వీ కపూర్ వివాదం నేపథ్యంలో ఆమె అభిప్రాయాలు చర్చనీయాంశంగా మారాయి.


