
📌 Key Points
- రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా యానిమేషన్ రూపంలోకి రానుంది.
- జపాన్‌లోని స్టూడియోలతో చర్చలు జరుపుతున్నట్లు రాజమౌళి తెలిపారు.
- డెమన్ స్లేయర్, ఎటాక్ ఆన్ టైటాన్ యానిమేటెడ్ చిత్రాలను రాజమౌళి మెచ్చుకున్నారు.
- మహేష్ బాబుతో రాజమౌళి సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.
దర్శకుడు రాజమౌళి తన బ్లాక్ బస్టర్ చిత్రం RRRను యానిమేషన్ రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జపాన్‌లోని స్టూడియోలతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాకుండా మహేష్ బాబుతో ఆయన సినిమా 2027లో విడుదల కానుంది.
యానిమేషన్ రూపంలో RRR సినిమా
Rajamouli: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం వారణాసి(Varanasi) సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మొదటిసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్నాయి .ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు రాజమౌళి తెలియచేశారు. ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీ 2027న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన సినిమాలలో RRR సినిమాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమా సరికొత్త రూపంలో వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 2022వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాని ఇప్పుడు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల వారణాసి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్‌ను అనిమేలో రూపొందించడానికి మేము జపాన్‌లోని కొన్ని స్టూడియోలతో చర్చలు జరుపుతున్నామనీ తెలియజేశారు.త్వరలోనే ఈ చర్చలు పూర్తి అయితే ఈ సినిమా అనిమేలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన తెలియజేశారు.
జపాన్ స్టూడియోలతో రాజమౌళి చర్చలు
రాజమౌళి డెమన్ స్లేయర్, ఎటాక్ ఆన్ టైటాన్ వంటి యానిమేటెడ్ సినిమాలపై ప్రశంసలు కురిపించడమే కాకుండా ఈ సినిమాలకు తాను అభిమానిగా మారిపోయానని తెలిపారు.. ఈ సినిమాలను యానిమేషన్ రూపంలో చూసిన తర్వాతనే తన డైరెక్షన్లో వచ్చిన RRR సినిమాని కూడా అనిమే రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇలా సినిమాల విషయంలో రాజమౌళి ఎప్పటికప్పుడు తన ప్యాషన్ బయట పెడుతూ వినూత్న రీతిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. మరి RRR సినిమా అనిమేకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మాత్రం పూర్తిస్థాయిలో వారణాసి సినిమా పైన ఫోకస్ పెట్టారు. ఇక ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పాలి ఇందులో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నారు.
మహేష్ బాబుతో రాజమౌళి సినిమా విడుదల ఎప్పుడు?
రాజమౌళి తన సినిమాలతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. RRR సినిమా యానిమేషన్ రూపంలో ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


