
📌 Key Points
- నివేదా పేతురాజ్ దుబాయ్ వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో పెళ్లి చేసుకోనున్నట్లు గతంలో ప్రకటించింది.
- 2026 జనవరిలో వారి వివాహం జరగనుందని స్వయంగా నివేదా తెలిపింది.
- తాజాగా, నివేదా, రజిత్ బ్రేకప్ చెప్పుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
- వారందించిన ఫోటోలు తొలగించి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
నివేదా పేతురాజ్ తన పెళ్లి గురించి స్వయంగా ప్రకటించి అభిమానులను ఆనందపరిచింది. దుబాయ్ వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో 2026లో వివాహం అని చెప్పింది. అయితే, ఇప్పుడు వీరి బంధంపై షాకింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు నిజం ఏంటో తెలుసుకుందాం.
నివేదా పేతురాజ్ సినీ కెరీర్
Nivetha Pethuraj: మెంటల్ మదిలో అనే సినిమాతో తెలుగునాట అడుగుపెట్టింది నివేత పేతురాజ్(Nivetha Pethuraj). ఆ తరువాత చిత్రలహరి, పాగల్, ధమ్కీ, అలా వైకుంఠపురంలో, రెడ్ సినిమాల్లో నటించింది. కానీ, అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఫేట్ మాత్రం మారలేదు. అక్కడ కూడా అంతగా విజయాలు వరించలేదు. దాంతో. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది ఈ బ్యూటీ. నేపధ్యంలోనే నివేత పెళ్లి చేసుకోబోతుందో అంటూ కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి.
Ram Charan: దేవుడా.. ఇదేం అభిమానం.. రామ్ చరణ్ ను చూడటానికి జపాన్ నుంచి వచ్చేశారు..
పెళ్లి ప్రకటనతో ఆనందం
స్వయంగా నివేత పేతురాజ్ కూడా తన పెళ్లి గురించి చెప్పింది. ఆగస్టు నెలలో తన ప్రియుడిని పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ‘రజిత్ ఇబ్రాన్’తో రిలేషన్‌లో ఉన్నానని చెప్పింది. అలాగే, 2026 జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నామని గుడ్‌న్యూస్ చెప్పింది. దీంతో, నివేత ఫ్యాన్స్ అందరు ఆమె పెళ్లికోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, తాజాగా వీరి పెళ్లి గురించి షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రేకప్ వార్తలు: నిజమెంత?
అదేంటంటే, పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారట. ఈ ఇద్దరు కలిసున్న తమ ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించేశారు. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. దీంతో వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై నివేదా పేతురాజ్ నుంచ్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. మరి స్పందింస్తారా లేక నెటిజన్స్ అనుకుంటుంది నిజం చేస్తారా అనేది చూడాలి.
నివేదా పేతురాజ్, రజిత్ ఇబ్రాన్ బ్రేకప్ వార్తలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఫోటోలు తొలగించడం, అన్‌ఫాలో చేసుకోవడం ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. అయితే, దీనిపై నివేదా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఆమె స్పందన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


