
వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న నో ఎంట్రీ 2 సినిమాకు అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్‌గా మారింది. ఈ మూవీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన నటుల్లో ఒకరైన షాహిద్ కపూర్‌ను కూడా తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రంలో షాహిద్ కపూర్ కూడా భాగం అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే షాహిద్ కపూర్ ఈ సినిమాలో చేరితే మూవీ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అను మాలిక్ సంగీతం అందిస్తున్నారు.


