
బాలీవుడ్‌లో సందడి చేస్తున్న నోరా ఫతేహి తాజాగా తమిళ సినిమాలో అడుగుపెట్టింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న ‘కాంచన 4’ చిత్రంతో ఆమె తమిళ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా ఆమె తమిళ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Key Points
నోరా ఫతేహి ‘కాంచన 4’తో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది.
హారర్ థ్రిల్లర్‌లో నటించడం ఆమెకు సరైన అవకాశమని భావిస్తోంది.
భాషా సవాళ్లను ఎదుర్కొంటూ తన పాత్రకు అదనపు సమయం కేటాయిస్తోంది.
తమిళ సినీ పరిశ్రమ బాలీవుడ్ కంటే వేరే ప్రపంచమని అభిప్రాయపడింది.
నోరా ఫతేహి తమిళ సినిమాలోకి ఎంట్రీ
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి ఇప్పుడు కోలీవుడ్ లో డెబ్యూ చేయనుంది. రాఘవ లారెన్స్ కామెడీ హారర్ థ్రిల్లర్ ‘కాంచన 4’తో తమిళ సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ కోలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నోరా ఫతేహి.
తమిళ సినిమాలోకి అడుగుపెట్టేందుకు హారర్ థ్రిల్లర్ కాంచన 4 తనకు సరైన ప్రాజెక్ట్ అని నోరా ఫతేహి పేర్కొంది. “నాకు కాంచన 4 ఆఫర్ వచ్చినప్పుడు తమిళ సినిమాలోకి అడుగుపెట్టడానికి ఇది సరైన ప్రాజెక్ట్ అని భావించా. ఫ్రాంచైజీకి ఇప్పటికే చాలా బలమైన వారసత్వం ఉంది. స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమైంది. నేను దానిలో భాగం కావాలని కోరుకున్నాను. మడ్గావ్ ఎక్స్‌ప్రెస్ విజయం తర్వాత నేను మరొక కామెడీ మూవీ చేయాలని చూస్తున్న టైమ్ లో ఈ ఛాన్స్ వచ్చింది’’ అని నోరా తెలిపింది.
కాంచన 4: ఒక కొత్త సవాల్
నోరా ఫతేహి తాజా పాట ‘ఓ మామా! టెటెమా’ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు కాంచన 4తో తమిళంలో అడుగుపెడుతోంది. “వాస్తవానికి భాష ఎల్లప్పుడూ ఒక ఛాలెంజ్. కానీ నేను సవాళ్లను ఇష్టపడతా. హిందీ, తెలుగు, మలయాళంలో చేశా. ఇప్పుడు తమిళానికి అలవాటు పడాల్సి వచ్చింది. ఇది ఇప్పటివరకు ఖచ్చితంగా కష్టతరమైందే. కానీ నేను నా లైన్లను రిహార్సల్ చేయడానికి, ఉచ్చారణపై పని చేయడానికి అదనపు గంటలు వెచ్చిస్తున్నా” అని నోరా చెప్పింది.
‘‘కామిక్ బిట్స్‌లో నేను ఇంత సహజంగా ఉంటానని ఊహించలేదని సెట్ లో వాళ్లు నాకు చెప్పడం బాగుంది. ఆ రకమైన అభిప్రాయం నన్ను ముందుకు నడిపిస్తుంది. ప్రతి సినీ పరిశ్రమకు దాని స్వంత రుచి ఉంటుంది. తమిళ సినిమా కథ చెప్పడంలో చాలా డెప్త్ గా వెళ్తుంది. బలమైన స్క్రిప్ట్‌లకు చాలా ప్రాధాన్యతనిస్తారు. ఇది వేరే ప్రపంచం. బాలీవుడ్ వేరు. ఈ రెండు పరిశ్రమలు సినిమా పట్ల మక్కువ కలిగి ఉంటాయి. కానీ పని చేసే శైలి, ప్రేక్షకుల అంచనాలు, చిత్రనిర్మాణ ప్రక్రియలు కొద్దిగా భిన్నంగా అనిపిస్తాయి’’ అని నోరా తెలిపింది.
బాలీవుడ్ మరియు కోలీవుడ్: వ్యత్యాసాలు
హిందీలో సినిమాలు చేస్తున్న నోరా తెలుగులో స్పెషల్ సాంగ్స్ తో దుమ్మురేపింది. టెంపర్ (ఇట్టాగే రెచ్చిపోదాం), బాహుబలి (మనోహరి), కిక్ 2 (కిక్కు), షేర్ (నాపేరే పింకీ), లోఫర్ (నొక్కేయ్ దోచేయ్), ఊపిరి (డోర్ నంబర్) సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. మలయాళంలోనూ ఆడిపాడింది. ఈ ఏడాదే కేడీ ది డెవిల్ తో కన్నడలో అడుగుపెట్టింది.
నోరా ఫతేహి తన తమిళ సినిమా ప్రయాణం గురించి, భాషా సవాళ్ళను ఎదుర్కొనే విధానం గురించి, మరియు తమిళ సినిమా పరిశ్రమ యొక్క ప్రత్యేకతల గురించి తెలిపింది. ఆమె భవిష్యత్తు కోలీవుడ్ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.


