|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధైర్యమే కాదు… అంతులేని త్యాగం కూడా…

Published: 13-05-2025, 10:14 PM
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...

తాజాగా, బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇండియన్ ఆర్మీ సైనికులకు, వారి తల్లులకు తమ అంతులేని త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తన భావాలను వ్యక్తం చేశారు.

Key Points

1

ఆలియా భట్ ఇండియన్ ఆర్మీ సైనికులు మరియు వారి తల్లులకు నివాళులు అర్పించారు.

2

సైనికుల త్యాగాన్ని, వారి తల్లుల అంతులేని త్యాగాలను ఆమె కొనియాడారు.

4

జై హింద్ అంటూ ఆమె తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు.

ఆలియా భట్ యొక్క భావోద్వేగ పోస్ట్

కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ఇండియన్‌ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్‌ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్‌ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.

తాజాగా హీరోయిన్‌ ఆలియా భట్‌ కూడా ఇండియన్‌ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైనపోస్ట్‌ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్‌లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.

సైనికుల త్యాగం

ఆదివారం మనమంతా మదర్స్‌ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు… అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్‌ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.

తల్లుల అంతులేని త్యాగం

అనిశ్చితి… ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ… ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం… ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్‌’’ అంటూపోస్ట్‌ చేశారు ఆలియా భట్‌.

ఆలియా భట్ సైనికులకు, వారి తల్లులకు తమ త్యాగానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ రక్షణకు వారి కృషిని ప్రశంసిస్తూ జై హింద్ అని పేర్కొన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.