
గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగుతాయి. నవంబర్ 24 నుంచి 26 వరకు చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ కాలంలో ఐదు రాశుల వారి జీవితంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి.
Key Points
మేషం, కన్య, మిధునం, తుల, ధనుస్సు రాశుల వారికి శుభకాలం!
ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో పురోగతి, ఆస్తి లాభాలు!
నవంబర్ 24, 25, 26 తేదీల్లో ఈ ఫలితాలు ఆశించవచ్చు!
చంద్ర మంగళ యోగం ప్రభావం
గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మూడు రోజుల పాటు అపర కుబేర యోగం ఉంటుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది, కానీ కొన్ని రాశుల వారికి మాత్రం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. గ్రహాలు మారినప్పుడల్లా కొన్ని రాశులకు యోగాలు పడుతూ ఉంటాయి. చంద్రుడు వేగంగా కదులుతూ ఉంటాడు.
ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కొత్త రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. చంద్రుడు అలా రాశులను మార్చినప్పుడు, ఇతర గ్రహాలతో సంయోగం అయినప్పుడు జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
ఈ నెల 24, 25, 26 తేదీలలో తులా రాశిలో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు. పైగా మిత్రగ్రహమైనటువంటి కుజుడుతో సంయోగం చెందుతాడు. దీంతో చంద్ర మంగళ యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను తీసుకురానుంది.
ప్రయోజనం పొందే రాశులు
మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రెండూ సంయోగం చెందడంతో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది. షేర్లు మొదలైన వాటి ద్వారా అపార ధనవర్షం కురుస్తుంది. ఈ రాశి వారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే శుభ ఫలితాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకు వస్తుంది. ఉద్యోగ పరంగా బావుంటుంది. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదలకు ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు రావచ్చు. చేతికి ఆస్తులు కూడా వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఎక్కువ లాభాలు ఉంటాయి.
మిధున రాశి వారికి ఈ గ్రహాల కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. చంద్రుడు, కుజుడు కలయిక కారణంగా ఆదాయం పెరుగుతుంది. నైపుణ్యాలను పెట్టి ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. వాటి ద్వారా ఎక్కువ ఆర్థిక లాభం ఉంటుంది. భూ లాభం కూడా కలగవచ్చు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…
తులా రాశి వారికి ఈ యోగం మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగంలో కూడా బాగుంటుంది. ఆస్తి లాభం కూడా కలగవచ్చు.
ధనుస్సు రాశి వారు ఆకస్మిక ధనలాభాన్ని పొందవచ్చు. ఎప్పటినుంచి రావాల్సిన డబ్బు కూడా మీ చేతికి వస్తుంది. కొంచెం ప్రయత్నం చేసినా అది విజయవంతం అవుతుంది. షేర్లు వంటి వాటి ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఎక్కువ లాభాలు వస్తాయి.
ఈ జ్యోతిష్య అంచనాలు సూచనార్థం మాత్రమే. మీరు ఎదుర్కొనే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించండి. శుభం భవతు!

