
తెలుగు సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్ర హీరోలుగా వెలిగారు. కానీ, కృష్ణ ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంతో రూ.7 లక్షల భారీ బడ్జెట్‌తో సంచలనం సృష్టించాడు. అప్పట్లో ఇది ఇండస్ట్రీకే షాక్.
Key Points
కృష్ణ హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం రూ.7 లక్షల బడ్జెట్‌తో నిర్మించబడింది.
అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాల బడ్జెట్ రూ.4 లక్షలకు మించలేదు.
కృష్ణ చిత్రం ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది.
ఈ చిత్రం తెలుగులో కౌబాయ్ చిత్రాల కల్చర్‌ను పెంచింది.
కృష్ణ: టాలీవుడ్ మైండ్ బ్లాక్
అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ అగ్ర హీరోగా ఉండేవారు. ఏఎన్నార్ ఆయనకి పోటీగా కొనసాగేవారు. ఎన్టీఆర్ కి మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ వచ్చాక కొన్ని దశాబ్దాలు ఎన్టీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ వచ్చిన తర్వాత తెలుగు సినిమా మేకింగ్ పరుగులు పెట్టింది.
సూపర్ స్టార్ కృష్ణ కొత్తదనం ప్రదర్శిస్తూ.. ఎన్టీఆర్ కి పోటీగా మాస్ చిత్రాలు చేశారు. తిరుగులేని స్టార్ గా ఎదిగారు. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం తేనె మనసులు 1965లో విడుదలైంది. తన మూడవ చిత్రం గూఢచారి 116 తో కృష్ణ క్రేజీ హీరోగా మారారు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఐదారు ఏళ్లలోనే కృష్ణ టాలీవుడ్ మైండ్ బ్లాక్ అయ్యే సాహసం చేశారు.
మోసగాళ్లకు మోసగాడు: భారీ బడ్జెట్ సినిమా
ఆ సాహసం మరేదో కాదు మోసగాళ్లకు మోసగాడు. తెలుగులో ఇదే తొలి కౌబాయ్ చిత్రం. అప్పటి అగ్ర హీరోలు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారి చిత్రాల బడ్జెట్ రూ 4 లక్షలు మించేది కాదు. కానీ మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ తన సొంత బ్యానర్ లో ఏకంగా 7 లక్షల బడ్జెట్ లో నిర్మించారు. దీనితో ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది. కృష్ణ ఇంత పెద్ద సాహసం చేస్తున్నారు ఏంటి..అని అంతా ఆశ్చర్యపోయారట. ఇప్పుడంటే వందల కోట్లల్లో సినిమాలు నిర్మిస్తున్నారు కానీ అప్పట్లో లక్షల రూపాయల బడ్జెట్ అంటే చాలా భారీగా ఉండేది.
తాను అనుకున్నట్లుగా భారీ బడ్జెట్ లో మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని రూపొందించిన కృష్ణ మంచి విజయం అందుకున్నారు. తెలుగులో గొప్ప చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ చిత్ర క్వాలిటీ విషయంలో కృష్ణ కాంప్రమైజ్ కాలేదు.
కౌబాయ్ చిత్రాల ప్రారంభం
ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం అప్పట్లో హాలీవుడ్ చిత్రాల స్టైల్ లో ఉంటుంది. కెఎస్ఆర్ దాస్ ఈ చిత్రానికి దర్శకుడు. మోసగాళ్లకు మోసగాడు మూవీ రిలీజ్ అయ్యాక తెలుగులో కౌబాయ్ చిత్రాల కల్చర్ పెరిగింది. మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో నాగభూషణం, విజయనిర్మల, గుమ్మడి కీలక పాత్రల్లో నటించారు.
కృష్ణ సాహసం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయి. ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం ఆయన క్రేజ్‌ను పెంచి, తెలుగు సినిమాకు కొత్త శైలిని పరిచయం చేసింది.


