
ఎన్టీఆర్ త్వరలో తన పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన దుబాయ్‌లో ఆటో హారన్ కొన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
Key Points
ఎన్టీఆర్ దుబాయ్‌లో ఆటో హారన్ కొన్నారు!
తారక్ కి వాచీలు, కూలింగ్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం.
ఎన్టీఆర్ ప్రయాణాలు, విదేశాల పర్యటనలు ఇష్టపడతారు.
వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రానున్నాయి.
ఎన్టీఆర్ విచిత్రమైన అలవాట్లు
ఎన్టీఆర్ త్వరలో పుట్టిన రోజు(may 20)ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు రాబోతున్నాయి. ఈ సారి ఎన్టీఆర్ బర్త్ డే హడావుడి గట్టిగానే ఉండే అవకాశం ఉంది. `వార్ 2` నుంచి టీజర్, ప్రశాంత్ నీల్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తారక్ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టారు. ఆయనకు వాచీలంటే చాలా ఇష్టమట. తన ఇంట్లో చిన్నపాటి వాచీల షాపే ఉంటుందని తెలిపారు తారక్. అలాగే కూలింగ్ గ్లాసెస్ అన్నా ఇష్టమట. రేట్ ఎంత అనేది చూడరు, తనకు నచ్చిందంటే వందల్లో ఉన్న కూడా తీసుకోవడానికి వెనకాడట.
దుబాయ్ షాపింగ్ అనుభవం
ఈ క్రమంలో తారక్ తాను చేసిన విచిత్రమైన పని బయటపెట్టాడు. ఓ సారి దుబాయ్ వెళ్లి ఆటో హారన్ కొన్నాడట. అక్కడ షాపింగ్ చేసేసమయంలో ఆటోలకు ఉండే హారన్ గమ్మత్తుగా కనిపించిందట. తెగ నచ్చిందట. అంతే కొనేశాడు జూ ఎన్టీఆర్. అయితే అది చూసి దుబాయ్ లో కొనడానికి ఇదే దొరికిందా అంటూ ఆయన ఫ్రెండ్ తెగ ఆటపట్టించారట. తనకు ప్రయాణం అంటే ఇష్టమని ప్రపంచమంతా తిరిగి రావాలని ఉందని తెలిపారు ఎన్టీఆర్.
తారక్ తన ఫ్యామిలీతో కలిసి ఏడాదికి నాలుగైదు సార్లు విదేశాలకు వెకేషన్ వెళ్తారనే విషయం తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మన వద్ద ఎంజాయ్ చేయలేదు, బయట తిరగలేరు. దీంతో విదేశాలకు వెళ్లి రిలీఫ్ అవుతారు. ఫ్యామిలీతో కలిసి బయటి ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తారు. బర్త్ డే సమయంలోనూ తారక్ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు. మరి ఈ బర్త్ డే ఎక్కడ ప్లాన్ చేశారో చూడాలి.
వచ్చే పుట్టినరోజు వేడుకలు మరియు సినిమా అప్డేట్స్
ప్రస్తుతం ఎన్టీఆర్ `వార్ 2`లో నటించారు. ఇది ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఆయన బర్త్ డే రోజు టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లుక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో ఓ మూవీ చేస్తున్నారు తారక్. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్నుంచి ఫస్ట్ లుక్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు `దేవర 2`కి సంబంధించిన అప్ డేట్ కూడా ఆశిస్తున్నారు అభిమానులు. మరి ఈ పుట్టిన రోజు ఫ్యాన్స్ కి తారక్ ఎలాంటి ట్రీట్ ఇస్తారో చూడాలి.
ఎన్టీఆర్ యొక్క ఈ విచిత్రమైన కొనుగోలు అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ఏ విధమైన ట్రీట్ ఇస్తారో చూడాలి.


