
📌 Key Points
- ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 19 అర్థరాత్రి ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల.
- 4 నిమిషాల 35 సెకన్ల నిడివితో టాలీవుడ్‌లో అత్యంత సుదీర్ఘమైన గ్లింప్స్.
- సెన్సార్ బోర్డు నుండి U/A 16+ రేటింగ్ పొందిన హై-వోల్టేజ్ యాక్షన్ గ్లింప్స్.
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రం నుండి అభిమానులకు పండగ లాంటి అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న ఫస్ట్ లుక్, 4 నిమిషాల 35 సెకన్ల గ్లింప్స్ వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డ్రాగన్ గ్లింప్స్: రికార్డు సృష్టించిన నిడివి
Dragon Glimpse : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. KGF చాప్టర్ 1 & 2, సలార్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ ను ‘NTR Neel’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తుండగా, మేకర్స్ అఫీషియల్‌గా ‘డ్రాగన్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
మే 19 అర్థరాత్రి 12 గంటలకే ఫస్ట్ లుక్
ఇక ఈ క్రేజీ కాంబో నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో గత కొంతకాలంగా కాస్త నిరాశలో ఉన్న అభిమానుల ఆకలిని ఒకేసారి తీర్చేందుకు మేకర్స్ సరికొత్త రికార్డుతో రెడీ అయ్యారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును సందర్భంగా, మే 19 అర్థరాత్రి 12 గంటలకే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు సుదీర్ఘమైన ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ గ్లింప్స్ రన్‌టైమ్ మరియు సెన్సార్ డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
సెన్సార్ బోర్డు నుండి U/A 16+ రేటింగ్
ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల లెంతీ డ్యూరేషన్
సాధారణంగా ఈ రోజుల్లో భారీ సినిమాల ట్రైలర్లే 3 నిమిషాల లోపు రన్‌టైమ్‌తో వస్తుంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ సరికొత్త ట్రెండ్‌కు తెరలేపుతూ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల లెంతీ డ్యూరేషన్ తో ఈ ఫస్ట్ గ్లింప్స్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ గ్లింప్స్ కు సెన్సార్ బోర్డు నుంచి అధికారికంగా ధృవీకరణ సర్టిఫికెట్ లభించింది. ఇందులో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ మరియు వైల్డ్ విజువల్స్ కారణంగా సెన్సార్ బోర్డు దీనికి U/A 16+ రేటింగ్‌ను కేటాయించింది. ఒక ఫస్ట్ గ్లింప్స్ నాలుగు నిమిషాలకు పైగా నిడివితో రావడం టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన గ్లింప్స్ గా సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ప్రశాంత్ నీల్ సృష్టించిన డ్రాగన్ ప్రపంచాన్ని, అందులో ఎన్టీఆర్ చూపించబోయే మాస్ విధ్వంసాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడానికే ఇంత లెంత్ ఫిక్స్ చేశారని ఇన్ సైడ్ టాక్.
2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల
ఇక ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ, సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా తళుక్కు మనబోతుంది.బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో ఒక అత్యంత కీలకమైన పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.చూడాలి మరి ..మే 19న రాబోయే ఈ 4 నిమిషాల 35 సెకన్ల గ్లింప్స్ యూట్యూబ్‌లో ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో .
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంచనాలు
Censor Completed For Dragon Glimpse 🐉💥
Length 4 mints 35 secs 🔥. #NTRNeel pic.twitter.com/wfVERf6VXa
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) May 16, 2026
ఈ సుదీర్ఘమైన గ్లింప్స్ ఎన్టీఆర్ అభిమానుల అంచనాలను అమాంతం పెంచేస్తోంది. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ విధ్వంసం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ‘డ్రాగన్’ ప్రపంచం కోసం వేచి చూద్దాం.


