
📌 Key Points
- ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం.
- రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ సన్నగా మారారు.
- ప్రస్తుత షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్, ప్రధాన పాత్రల మధ్య సన్నివేశాలు చిత్రీకరణ.
- హైదరాబాద్ తర్వాత విదేశీ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌తో ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ లుక్, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండటంపై అంచనాలు పెరిగాయి. తారక్ అభిమానులు ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్టీఆర్ ‘డ్రాగన్’ భారీ షెడ్యూల్ ప్రారంభం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
యాక్షన్ సీక్వెన్స్, విదేశీ ప్లానింగ్
ప్రజెంట్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో వేసిన ఒక భారీ సెట్‌లో మొదలయ్యిందట. ఈ షెడ్యూల్‌లో ప్రధాన పాత్రల మధ్య కొన్ని సీన్స్ తెరకెక్కించనున్నాడట. అలాగే ఎన్టీఆర్‌తో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించనున్నాడట. ఈ షెడ్యూల్ తర్వాత మరోసారి విదేశాలకు వెళ్లనున్నాడు ఎన్టీఆర్. అక్కడ జరిగే షెడ్యూల్‌తో మూవీ టాకీ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తారక్ లుక్, సినిమాపై అంచనాలు
ది రాజాసాబ్ నుంచి మరో అప్డేట్..గూస్ బంప్స్ రావాల్సిందే
‘డ్రాగన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత విదేశాల్లో చివరి షెడ్యూల్ జరగనుండటంతో సినిమా టాకీ పార్ట్ త్వరలోనే పూర్తి కానుంది. ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


