|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్‌ – వార్ 2

Published: 22-05-2025, 5:04 PM
ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్‌ - వార్ 2

‘వార్ 2’ టీజర్‌కు అందుకున్న అపారమైన ప్రేమను ఎన్టీఆర్ అభినందించారు. ఈ ప్రేమ తనకు చాలా విలువైనదని, ‘వార్ 2’లో తన పాత్ర కొత్త అనుభవమని తెలిపారు. హిందీ పరిశ్రమకు తన పరిచయం ఈ చిత్రం ద్వారానే అని ఆయన పేర్కొన్నారు.

Key Points

1

ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ కు వచ్చిన అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

2

'వార్ 2' లో ఎన్టీఆర్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు.

4

ప్రేక్షకుల స్పందన కోసం ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘వార్ 2’ టీజర్‌కు అద్భుత స్పందన

‘‘వార్‌ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. హృతిక్‌ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్‌ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఈ నెల 20న ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘వార్‌ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ స్పందిస్తూ– ‘‘వార్‌ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్‌ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్‌ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్‌. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్‌ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ ప్రత్యేక పాత్ర

ఆగస్టు 14న విడుదల

చివరగా, ‘వార్ 2’ సినిమాపై ఎన్టీఆర్ చూపిన ఆనందం, ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు 14న విడుదల అయ్యే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.