|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రోడ్డుపై స్టార్‌ హీరోయిన్‌ కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్‌, మొత్తం ట్రాఫిక్‌ జామ్‌, అసలేం జరిగిందంటే?

Published: 03-07-2025, 11:18 PM
రోడ్డుపై స్టార్‌ హీరోయిన్‌ కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్‌, మొత్తం ట్రాఫిక్‌ జామ్‌, అసలేం జరిగిందంటే?

నందమూరి తారక రామారావు తెలుగు సినిమా రంగంలో ఒక లెజెండ్. ఆయన దర్శకత్వం వహించిన ఒక సినిమా షూటింగ్‌లో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రోజారమణితో జరిగిన ఆ ఘటన ఏమిటో తెలుసుకుందాం.

Key Points

1

ఎన్టీఆర్ దర్శకత్వంలో రోజారమణి నటించిన సినిమా షూటింగ్‌లో ఆసక్తికర ఘటన.

2

కృష్ణా బ్యారేజీ వద్ద షూటింగ్ సమయంలో ట్రాఫిక్ జామ్.

4

ఎన్టీఆర్ రోజారమణి కాళ్ళు పట్టుకుని సహాయం చేయడం.

కృష్ణా బ్యారేజీ వద్ద షూటింగ్

నందమూరి తారక రామారావు తెలుగు సినిమా దశ దిశని మార్చిన నటుడు. తెలుగు సినిమాకి గుర్తింపు తెచ్చిన లెజెండ్‌. ఆయన నటుడిగా అనేక పాత్రలు పోషించి మెప్పించారు. విశ్వరూపం చూపించారు.

నటుడిగానూ కాదు, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన తన ప్రతిభని చాటుకున్నారు, సంచలనాలు సృష్టించారు. అయితే ఓ మూవీ విషయంలో ఆయన హీరోయిన్‌ కాళ్లు పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆ కథేంటో తెలుసుకుందాం.

నటి రోజా రమణి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన విషయం తెలిసిందే. ఆమె హీరో తరుణ్‌ తల్లి. ఎన్టీఆర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసింది రోజా రమణి. ఇందులో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

ఈ సినిమా సమయంలో ఎన్టీఆర్‌.. ఆమె కాళ్లు పట్టుకోవడం, కృష్ణా బ్యారేజీ వద్ద వందలాది మంది గుమి గూడటం జరిగిందట. ఆ సంఘటన గురించి లేటెస్ట్ గా రోజా రమణి వెల్లడించింది. అసలేం జరిగిందో బయటపెట్టింది.

రామారావు దర్శకత్వంలో ఓ మూవీ చిత్రీకరణ కృష్ణా బ్యారేజీ వద్ద జరుగుతుందట. అందులో తనకు సోదరుడిగా హరికృష్ణ నటించారు. ఆ బ్యారేజీ మీద తాను సూసైడ్‌ చేసుకునే సీన్‌ తీస్తున్నారట.

అనుకోని సమస్యలు

ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌ అనే సరికి వందలాది మంది జనం వచ్చారట. దీంతో ట్రాఫిక్‌ ఆపేయాల్సి వచ్చిందట. ఆ సీన్‌లో బ్యారేజీ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ సీన్‌ తీసేటప్పుడు బ్యారేజీ కింద కెమెరా పెట్టారు. పైన రెయిలింగ్‌ కట్టారు. రోజా రమణి కాస్త పొట్టిగా ఉండటంతో ఆమె కెమెరాల్లో పడటం లేదు. రెయిలింగ్‌ అడ్డుగా ఉంది. ఆమెని హైట్‌ చేయాలంటే ఆమె కింద ఏదైనా పెట్టాలి.

మండే ఎండ, సమీపంలో ఏమీ లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సమయంలోనే అటుగా ఓ క్యాన్లతో ఓ కుర్రాడు వెళ్తుంటే, ఎన్టీఆర్‌ పిలిచి ఆ క్యాన్లు తీసుకున్నాడట.

ఎన్టీఆర్‌ పిలవడంతో అతను కూడా ఆ క్యాన్లు ఇచ్చేశాడు. రెండు క్యాన్లపై రోజా రమణి నిలబడింది. బ్రిజ్జ్ పై నుంచి దూకే సీన్‌ చేస్తుండగా, ఆ క్యాన్లు ఊగిపోతున్నారు. మేకప్‌ ఆర్టిస్ట్ పట్టుకున్నాడు కానీ, ఆమెని ఆపలేకపోతున్నాడు.

ఎన్టీఆర్ సహాయం

దీంతో తేడా వస్తే ఆమె నదిలో పడిపోతుంది. అది పెద్ద రిస్క్. ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్‌ స్వయంగా తనే వచ్చి రోజా రమణి కాళ్లు పట్టుకున్నాడు. ఓ చేతితో ఆమె కాలు, మరో చేతితో క్యాన్లు పట్టుకున్నాడట.

రామారావు ఏంటి తన కాళ్లు పట్టుకోవడమేంటి అని తాను భావోద్వేగానికి గురైందట రోజా రమణి. అది ఏడిచే సీన్‌. నిజంగానే తనకు ఏడుపు వచ్చిందట.

బాడీ అంతా షివరింగ్‌ వచ్చేసిందట. అది గమనించి త్వరగా యాక్ట్ చేసి, ఏమ్‌ భయపడకు, బాధపడకు అని ధైర్యం చెప్పాడట ఎన్టీఆర్‌. కానీ ఆ సందర్భంలో మాత్రం తాను చాలా భయానికి గురైనట్టు తెలిపింది.

అదే సమయంలో తన కెరీర్‌లోనే అదొక బెస్ట్ మూమెంట్ గా నిలిచిపోతుందని పేర్కొంది రోజా రమణి. ట్రీ మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది రోజా రమణి.

చివరికి ఎన్టీఆర్ యొక్క సహాయంతో సన్నివేశం విజయవంతంగా పూర్తయింది. ఈ ఘటన ఎన్టీఆర్ యొక్క సహృదయతను, నటీనటులతో ఆయనకున్న అనుబంధాన్ని చాటుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.