
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా వ్యాపిస్తున్నాయి.
Key Points
ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించే అవకాశం.
ప్రశాంత్ నీల్ తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్.
దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా సినిమా నిర్మాణం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్లు అంచనాలను పెంచుతున్నాయి.
ఎన్టీఆర్ యొక్క బిజీ షెడ్యూల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబోలో రాబోతున్న సినిమా షూట్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రాబోతుంది. అలాగే తారక్ వార్-2, దేవర-2 చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఎన్టీఆర్ , దర్శకధీరుడు కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్‌ను తెరపైకి తీసుకురాబోతున్న టాక్.
దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రకటన
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవిత కథ ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అయితే దాదాసాహెబ్(Dadasaheb) జీవితం గురించి ప్రపంచానికి తెలియజేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక భారతీయ సినిమా పితామహుడు బయోపిక్ రాజమౌళి(Rajamouli) సమర్పణలో రాబోతుండగా.. దీనికి ‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అయితే దీన్ని ఆయన తనయుడు కార్తికేయ, వరుణ్ గుప్తా(Varun Gupta) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్వీట్లు
నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. గత రెండేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. కానీ ఇతర సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ మొదలుపెట్టలేదు. ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అంత గొప్ప వ్యక్తి బయోపిక్‌లో తారక్ నటిస్తుండటంతో అభిమానులతో పాటు నెటిజన్లు ఈ విషయం తెలుసుకుని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇందులో నటించేందుకు ఆయన కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు అందరిలో అంచనాలను పెంచుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ పోస్టులు మాత్రం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి అనడంలో అతిశయోక్తి లేదు.
ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి.


