|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR: ఎన్టీఆర్ కు అనారోగ్యం…నిల‌బ‌డలేక స్పీచ్ మ‌ధ్య‌లోనే !

Published: 29-09-2025, 10:43 AM
NTR: ఎన్టీఆర్ కు అనారోగ్యం...నిల‌బ‌డలేక స్పీచ్ మ‌ధ్య‌లోనే !

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు చేదువార్త. కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ తీవ్ర నొప్పితో బాధపడ్డారు. స్పీచ్ మధ్యలోనే ఆపివేసి, నిలబడలేక ఇబ్బంది పడటం వీడియోల్లో వైరల్ అయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Key Points

1

జూనియర్ ఎన్టీఆర్ కాంతార చాప్టర్ 1 ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

2

తీవ్రమైన నొప్పితో బాధపడుతూ, స్పీచ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు.

4

షూటింగ్ సమయంలో గాయం అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాంతార ఈవెంట్ లో ఎన్టీఆర్ కు అనారోగ్యం: ఏం జరిగింది?

దిశ‌, వెబ్ డెస్క్‌: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర నొప్పితో పడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు అవుతున్నాయి. తాజాగా కాంతార చాప్టర్ 1 సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా తీవ్ర నొప్పితో జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బంది పడ్డారు. నొప్పి ఉన్నప్పటికీ ఈ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడారు. స్టేజి పైన నిలబడి మాట్లాడేటప్పుడు పదేపదే తన చేతిని పక్కటెములకలపై పెట్టుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.

ఆ త‌ర్వాత మ‌రింత ఇబ్బంది ప‌డి..స్పీచ్ మ‌ధ్య‌లోనే ఆపేశారు. మాట్లాడాల‌ని ఉన్న‌ప్ప‌టికీ.. మాట్లాడ‌లేక‌పోతున్నానంటూ పేర్కొంటూ.. అంద‌రూ ఇంటికి జాగ్ర‌త్తగా వెళ్లండి అని కోరారు జూనియర్ ఎన్టీఆర్. అనంత‌రం…ఎన్టీఆర్ తో ఫోటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు ఫ్యాన్స్. కానీ అక్క‌డి నుంచి వెంటేనే ఎన్టీఆర్ వెళ్లిపోయారు. నొప్పితో బాధ‌పడుతూ వెళ్లిపోయారు. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో… షూటింగ్ స‌మ‌యంలో గాయం అయి ఉండొచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. క్లిక్

స్పీచ్ మధ్యలోనే ఆపడానికి కారణం ఇదేనా?

అభిమానుల ఆందోళన: తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు

మొత్తానికి, కాంతార ఈవెంట్‌లో ఎన్టీఆర్ అనారోగ్యం అభిమానులను కలవరపరిచింది. తారక్ త్వరగా కోలుకుని తిరిగి ఆరోగ్యంగా వేదికలపై కనిపించాలని కోరుకుంటూ, ఈ ఘటనపై మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.