|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ఎన్టీఆర్, కృష్ణ మధ్య టైటిల్ వార్! బాలయ్య, రమేష్ బాబుకి భారీ నష్టాలు!

Published: 08-03-2026, 12:35 AM
షాకింగ్: ఎన్టీఆర్, కృష్ణ మధ్య టైటిల్ వార్! బాలయ్య, రమేష్ బాబుకి భారీ నష్టాలు!
  • బాలకృష్ణ ‘సామ్రాట్’ మూవీ 1987లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది!
  • రమేష్ బాబు ‘సామ్రాట్’ చిత్రం అక్టోబర్‌లో విడుదల, హీరోయిన్ సోనమ్‌!
  • టైటిల్ వివాదంతో బాలయ్య సినిమా పేరును ‘సాహస సామ్రాట్’గా మార్చారు!
  • ఎన్టీఆర్, కృష్ణ మధ్య టైటిల్ వార్.. అప్పట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోలు. వారి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. అయితే, ఒకానొక సమయంలో వారి మధ్య సినిమా టైటిల్ విషయంలో గొడవ జరిగిందనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్, కృష్ణ మధ్య టైటిల్ ఫైట్!

ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ ఒకప్పుడు టాలీవుడ్‌ని శాసించిన హీరోలు. తెలుగు సినిమాని కమర్షియల్‌ బాటలో నడిపించిన హీరోలు. ఎన్టీఆర్‌ తర్వాత ఆ స్థాయిలో మాస్‌ హీరోగా నిలబడ్డ హీరో కృష్ణ కావడం విశేషం. ఇద్దరు స్నేహంతోపాటు కొన్ని దశలో గొడవలు పడ్డారు. నువ్వా నేనా అనేలా ఉన్నారు. బాక్సాఫీసు వద్ద వార్‌ తప్పలేదు. అదే సమయంలో వ్యక్తిగత విషయాల్లోనూ గొడవలు పడ్డారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సినిమాలు చేశారు కృష్ణ. అప్పట్లో ఇది పెద్ద వివాదంగా మారింది.

మరోవైపు `దాన వీర శూర కర్ణ` సినిమా విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా గొడవే జరిగింది. ఇద్దరూ పోటాపోటీగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్‌ సక్సెస్‌ అయితే, కృష్ణ బోల్తా పడ్డారు. కానీ రియలైజ్‌ అయ్యారు.  తమ కోసమే కాదు తమ వారసుల కోసం కూడా ఈ ఇద్దరు గొడవలు పడ్డారు. ఓ సారి సినిమా టైటిల్‌ విషయంలో ఫైట్‌కి దిగడం గమనార్హం. బాలకృష్ణ సినిమా కోసం ఎన్టీఆర్‌, రమేష్‌ బాబు మూవీ కోసం కృష్ణ కారాలు మిర్యాలు నూరుకోవాల్సి వచ్చిందట. ఆ కథేంటో చూస్తే.

బాలయ్య ‘సామ్రాట్’ కాస్తా ‘సాహస సామ్రాట్’!

ఎన్టీఆర్‌ నట వారసుడిగా బాలకృష్ణ సినిమాల్లోకి వచ్చారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన హీరోగా నిలబడుతున్న సమయంలో `సామ్రాట్‌` పేరుతో సినిమాని రూపొందించారు. దీనికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకుడు. కేసీ శేఖర్‌ బాబు నిర్మాత. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రమిది. ఎన్టీఆర్‌ చాలా ప్రస్టీజియస్‌గా తీసుకుని తీశారు. ఇది 1987లో విడుదలైంది.

అదే సమయంలో కృష్ణ తన వారసుడు రమేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తున్నారు. `సామ్రాట్‌` పేరుతోనే సినిమాని రూపొందించారు. వి మధుసూదన రావు దర్శకత్వం వహించారు. ఇందులో రమేష్‌ బాబుకి జోడీగా సోనమ్‌ హీరోయిన్‌గా నటించింది. శారద కీలక పాత్రలో నటించింది. బాలయ్య `సామ్రాట్‌`, రమేష్‌ బాబు `సామ్రాట్‌` మూవీ రెండు ఒకేసారి రూపొందాయి. టైటిల్‌  వివాదం వచ్చింది. టైటిల్‌ విషయంలో అటు ఎన్టీఆర్‌ తగ్గలేదు, ఇటు కృష్ణ తగ్గలేదు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అయినా ఎవరూ రాజీపడటం లేదు. ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది.

రమేష్ బాబు ‘సామ్రాట్’ మూవీ ఫలితం ఏంటి?

చివరికి ఎన్టీఆర్‌ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ ముందుగా రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో టైటిల్‌ని కాస్త `సాహస సామ్రాట్‌`గా మార్చారు. 1987 ఏప్రిల్‌ 17న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అక్టోబర్‌లో `సామ్రాట్‌` పేరుతోనే రమేష్‌ బాబు హీరోగా రూపొందిన సినిమాని విడుదల చేశారు. ఈ చిత్రం కూడా డిజాస్టర్‌ అయ్యింది. రెండు సినిమాలు పరాజయం చెందాయి. కానీ టైటిల్‌ విషయంలో అటు ఎన్టీఆర్‌, ఇటు కృష్ణ గొడవలకు దిగడం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే కొంత వరకు ఈ గొడవలను పరిమితం చేశారు. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడుకునే వారు. ఎన్టీఆర్‌.. కృష్ణని ఇంటికి ఆహ్వానించేవారు. కృష్ణ.. ఎన్టీఆర్‌ని భోజనానికి రమ్మనేవారు. ఇలా వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరూ మంచి అనుబంధం కొనసాగించారని చెప్పొచ్చు.

ఇలా ఎన్టీఆర్, కృష్ణ మధ్య టైటిల్ వివాదం అప్పట్లో సంచలనంగా మారింది. బాలయ్య, రమేష్ బాబులకు ఈ సినిమా ఫలితాలు నిరాశపరిచాయి. మరిన్ని సినిమా అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.