|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ న్యూస్! ‘డ్రాగన్’ మూవీపై మేకర్స్ క్లారిటీతో పుకార్లకు చెక్!

Published: 08-04-2026, 6:35 AM
NTR ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ న్యూస్! 'డ్రాగన్' మూవీపై మేకర్స్ క్లారిటీతో పుకార్లకు చెక్!
  • ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీ షూటింగ్ వాయిదా వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ!
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న డ్రాగన్!
  • ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్, కీలక పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం!
  • దేవర తర్వాత ఎన్టీఆర్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబో ఇదే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రాగన్ మూవీ షూటింగ్ ఆగిందా?

NtrNeel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సినిమా డ్రాగన్(వర్కింగ్ టైటిల్). ఇంటర్నేషనల్ లెవల్లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే, ఇటీవల డ్రాగన్ సినిమాపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయ్. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్ విషయంలో గందరగోళం ఏర్పడిందని, అందుకే షూటింగ్ రద్దు అయ్యిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది.

పుకార్లపై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ!

అవన్నీ అవాస్తవాలని, షూటింగ్ రద్దు కాలేదని, కేవలం తదుపరి షెడ్యూల్ కోసం చిన్న ప్రిపరేషన్ గ్యాప్ మాత్రమే తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ప్లాన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, అనధికారిక సమాచారాన్ని నమ్మి రూమర్లను ప్రచారం చేయవద్దని మేకర్స్ అభిమానులను కోరారు. ఏవైనా అప్‌డేట్స్ ఉంటే స్వయంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు?

‘దేవర’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్(NtrNeel), సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ భారీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.