|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ: జోర్డాన్‌లో యాక్షన్ ట్రీట్! ఫ్యాన్స్‌కి పూనకాలే!!

Published: 07-02-2026, 3:05 AM
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ: జోర్డాన్‌లో యాక్షన్ ట్రీట్! ఫ్యాన్స్‌కి పూనకాలే!!
  • ఎన్టీఆర్-నీల్ మూవీ: జోర్డాన్‌లో భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణ!
  • ఈ షెడ్యూల్‌లో టొవినో థామస్ ఎన్టీఆర్‌తో తలపడనున్నాడు!
  • 1969 బ్యాక్‌డ్రాప్‌లో చైనా, భూటాన్, ఇండియా సరిహద్దుల కథ!
  • తల్లి సెంటిమెంట్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుందట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ మూవీ గురించి ఒక అదిరిపోయే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన షెడ్యూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జోర్డాన్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌(Prashanth Neel)తో ‘డ్రాగన్’(వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ నిర్మాణాల సంస్థ మైత్రీ మూవీమేకర్స్‌ నిర్మిస్తున్నది. అయితే ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా సన్నగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక షూటింగ్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కర్ణాటకలోనూ, విదేశాల్లోనూ, భాగ్యనగరంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 1969 కాలంలో చైనా, బూటాన్‌, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, తల్లి సెంటిమెంట్‌ ఈ సినిమాకు ప్రధాన బలమని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపు జోర్డాన్‌లో ప్రారంభమవుతుందట. ఈ షెడ్యూల్‌లో 3 భారీ పోరాట సన్నివేశాలను కలిగి ఉంటుందట. టొవినో థామస్ ఒక శక్తివంతమైన పాత్రలో చేరి, ఎన్టీఆర్‌తో పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

ఎన్టీఆర్‌తో టొవినో థామస్ ఫైట్!

1969 బ్యాక్‌డ్రాప్‌లో డ్రాగన్!

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.