
📌 Key Points
- ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’.
- యంగ్ యాక్టర్ శివ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
- ఈ చిత్రం రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని శివ కుమార్ జోస్యం చెప్పారు.
- శివ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘ఎన్టీఆర్ నీల్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటుడు శివ కుమార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం రూ.2000 కోట్లు వసూలు చేస్తుందని ఆయన అన్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ క్రేజ్
NTRNeel: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man of Masses NTR), మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబోలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (NTRNeel Movie). ఈ చిత్రానికి టైటిల్‌గా ‘డ్రాగన్’ అని అనుకుంటున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమాకు ‘బ్రూస్‌లీ’ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందని.. దర్శకుడికి, హీరోకి మధ్య విభేదాలు వచ్చాయనేలా కూడా వార్తలు నడిచాయి. అన్నీ సర్దుకుని ఇటీవలే మళ్లీ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు కానీ, ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వడం లేదు. కానీ, సినిమా ఎప్పుడు వచ్చినా, రికార్డులు బద్దలవడం ఖాయం అనే ఫీల్‌ని మాత్రం అభిమానులకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ నటుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
యంగ్ యాక్టర్ శివ కుమార్ (Siva Kumar) ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆయన ఈ సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఆయన ఈ సినిమా ఎలా వస్తుందనే విషయాన్ని తాజాగా టాలీవుడ్‌లో జరిగిన ఓ మూవీ వేడుకలో చెప్పాడు. అంతే, ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి. అసలింతకీ ఆ శివ కుమార్ ఏం చెప్పాడని అనుకుంటున్నారా? ‘‘నా పేరు శివ కుమార్.. ఎన్టీఆర్‌నీల్ మూవీ అవుట్ డోర్ షూటింగ్ నుంచి వచ్చి ఫైవ్ డేస్ అవుతుంది. మిగతావన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం తారక్ అన్న 2 వేల కోట్లు తీసుకొస్తాడు. పక్కాగా 2 వేల కోట్లు అంతే.. రాసి పెట్టుకోండి.. అన్న నడుము ఇంతే అయినా.. ఆయన వాక్, రేబాన్ డిజర్ట్‌లో మెరిసిపోవడం.. అంతే.. ఇంతకు మించి నేనేమీ చెప్పను. రెండు వేల కోట్లు మాత్రం పక్కా. నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి’’ అంటూ ఆయన మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
2000 కోట్లు వసూల్: శివ కుమార్ జోస్యం
శివ కుమార్ చెబుతున్న ఈ వీడియోను నందమూరి అభిమానులు షేర్ చేస్తూ.. ‘ఇక రండిరా ఎవరు వస్తారో?’ అనేలా కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు ఎక్కడో డీలా పడిన ఫ్యాన్స్‌కి శివ కుమార్ మాంచి బూస్ట్ ఇచ్చాడు. ఆయన ఇంతలా చెబుతున్నాడంటే, సినిమాలో మాములు విషయం లేదనేలా, ఫ్యాన్స్ డిస్కషన్స్ కూడా మొదలు పెట్టారు. మా అన్నకి ఒక మాంచి మాస్ యాక్షన్ సబ్జెక్ట్ పడితే.. ఎలా ఉంటుందో చూస్తారంటూ ఫ్యాన్స్ కాలర్స్ ఎగరేస్తున్నారంటే నమ్మాలి మరి. ఎందుకంటే, ఎప్పుడు అప్డేట్ వస్తుందో కూడా తెలియని సినిమా గురించి, ఈ ఒక్క మాట చాలు అనేంత ట్రీట్‌ని శివ కుమార్ మాటలు వాళ్లకి ఇచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావడంతో, ఆకలి మీద ఉన్న అభిమానులు.. దీనినే మహా ప్రసాదం అని ఆరగిస్తున్నారు.
#PrashanthNeel & #JrNTR has taken this project @NTRNeelFilm damn seriously ani ardam avthundhi ✅ @tarak9999 Silent ga matrame unnadu anthe⚠️ #NTRNeel #Dragon pic.twitter.com/x5UnIGuCaZ
వైరల్ అవుతున్న శివ కుమార్ వ్యాఖ్యలు
— Teja for Jr NTR ❤️ (@TejaforTarak) March 2, 2026
శివ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


