|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డాన్ 3లో షారుక్ ఖాన్ రీఎంట్రీ! రణవీర్ సింగ్ అవుట్, సంచలన మార్పులు!

Published: 17-01-2026, 1:00 PM
డాన్ 3లో షారుక్ ఖాన్ రీఎంట్రీ! రణవీర్ సింగ్ అవుట్, సంచలన మార్పులు!
  • డాన్ 3 సినిమాలో రణవీర్ సింగ్ స్థానంలో షారుక్ ఖాన్ నటించే అవకాశం ఉంది.
  • షారుక్ ఖాన్ డాన్ పాత్రలో తిరిగి నటించడానికి ఒక షరతు పెట్టారు: అట్లీని టీమ్‌లో చేర్చుకోవాలని కోరారు.
  • రణవీర్ సింగ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలకు స్వస్తి చెప్పి కొత్త తరహా పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు.
  • హీరోయిన్ విషయంలో కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ, ఇప్పుడు కృతి సనన్ పేరు కూడా వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో డాన్ 3 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో షారుక్ ఖాన్ మళ్ళీ డాన్ పాత్రలో నటించే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

డాన్ 3లో షారుక్ ఖాన్ రీఎంట్రీ?

Shahrukh KhanShahrukh Khan: బాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న సినిమా డాన్ 3. ఈ సినిమాపై వస్తున్న తాజా వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మొదట ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటించాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం వచ్చింది. ఆయన తప్పుకున్న తర్వాత ఇప్పుడు షారుక్ ఖాన్ మళ్లీ డాన్ పాత్రలో కనిపించబోతున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

డాన్ ఫ్రాంచైజ్‌లో షారుక్ ఖాన్ పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయింది. ఆయన స్టైల్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ ప్రత్యేకంగా నిలిచాయి. అందుకే రణవీర్ సింగ్ తప్పుకున్న తర్వాత, షారుక్ ఖాన్ పేరు మళ్లీ వినిపించడం సహజమే. కొన్ని మీడియా కథనాల ప్రకారం, షారుక్ ఖాన్ డాన్ 3 చేయడానికి సిద్ధంగా ఉన్నారట. అయితే.. ఆయన ఒక ముఖ్యమైన షరతు పెట్టినట్టు తెలుస్తోంది.

ఆ షరతు ఏమిటంటే, ఈ సినిమాకు అట్లీను కూడా టీమ్‌లో భాగంగా తీసుకోవాలని.. చేపారంట ..జవాన్ సినిమా తర్వాత అట్లీకి దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. సినిమా స్థాయి, యాక్షన్ సన్నివేశాలు, కథనం మరింత పెద్దగా ఉండాలని షారుక్ ఖాన్ కోరుతున్నారట. అయితే, ఈ విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.

రణవీర్ సింగ్ ఎందుకు తప్పుకున్నాడు?

డాన్ 3 సినిమాకు దర్శకత్వం వహించేది ఫర్హాన్ అక్తర్. ఆయన ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలని భావిస్తున్నారని సమాచారం. అందుకే హీరో, టెక్నికల్ టీమ్ ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉండగా, రణవీర్ సింగ్ ఎందుకు డాన్ 3 నుంచి తప్పుకున్నాడు అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన వరుసగా గ్యాంగ్‌స్టర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నారట. అలాగే, కొత్త దర్శకులతో, భిన్నమైన కథలతో సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

హీరోయిన్ విషయంలో కూడా మార్పులు జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదట కియారా అద్వానీ పేరు వినిపించగా..ఇప్పుడు కృతి సనన్ పేరు చర్చలో ఉంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

హీరోయిన్ మార్పులు: కృతి సనన్ ఎంట్రీ?

దీంతో..డాన్ 3 సినిమా చుట్టూ చాలా ఉత్కంఠ ఉంది. షారుక్ ఖాన్ తిరిగి డాన్‌గా కనిపిస్తారా? అట్లీ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు త్వరలోనే రావాల్సి ఉంది. అప్పటివరకు డాన్ 3 బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం.

డాన్ 3 చుట్టూ ఉత్కంఠ కొనసాగుతోంది. షారుక్ ఖాన్ డాన్‌గా తిరిగి వస్తారా? అట్లీ భాగస్వామ్యం ఉంటుందా? వేచి చూడాల్సిందే. బాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.