
📌 Key Points
- తారక్-నీల్ సినిమా 2027కి వాయిదా పడే అవకాశం ఉందని సంగీత దర్శకుడు రవి బస్రూర్ హింట్ ఇచ్చారు.
- సినిమా కోసం అభిమానులు మరో రెండేళ్లు వేచి చూడాల్సి వస్తుంది.
- సలార్ తరహాలోనే నీల్ తన మేకింగ్‌తో హీరోల సమయం వృధా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
- ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 2027 వరకు వాయిదా పడే అవకాశం ఉంది. దీనిపై అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సలార్ తరహాలోనే ఇది కూడా ఆలస్యం అవుతోందని విమర్శిస్తున్నారు.
2027 వరకు తారక్ సినిమా వాయిదా?
NTR Neel : తారక్ – నీల్ కలిస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ ని దుల్లకొట్టేయోచ్చు అని ఆశ పడ్డారు తారక్ ఫ్యాన్స్. కానీ సినిమా నుండి వస్తున్న లీకులు వింటుంటే దుల్లకొట్టేయ్యడం అటుంచి అసలు థియేటర్స్ లోకైనా వస్తుందా అంటూ డీలా పడిపోతున్నారట. అవును.. నిజానికి సినిమా మొదట 2026 జనవరి పక్కా అని ఊదరగొట్టారు. ఆ తర్వాత జూన్ 25 అన్నారు. సరే కనీసం సమ్మర్లో లైనా తారక్ నట విధ్వంసం చూసి ఎంజాయ్ చేయొచ్చని ఆశ పడ్డారు. కానీ ఈసారి ఏకంగా సినిమా వచ్చే ఏడు అంటే 2027 కి వెళ్ళబోతుంది అన్న టాక్ వినిపిస్తుంది.అంటే మరో రెండేళ్ల పాటు తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదన్న మాట. ఇప్పటికే ‘దేవర’ కోసం ఏళ్ల తరబడి వేచి చూసిన ఫ్యాన్స్ ఇప్పుడు నీల్ సినిమా కూడా అదే దారిలో నడవడం అస్సల్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
రాజీ పడటం లేదా? లేక సాగదీస్తున్నారా?
అయితే సినిమా క్వాలిటీ బాగా రావడం కోసమే అని వినిపిస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం ఇదో సాగదీసే వ్యవహారం అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజనులు. మరో వైపు విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ పేరుతో ఇలా సినిమా డేట్స్ మార్చుకుంటూ పోతే ఉన్న హైప్ కాస్తా చల్లారే ఛాన్స్ ఉందంటూ హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండిట్స్. ఇక లేటెస్ట్ గా సంగీత దర్శకుడు రవి బస్రూర్ కొన్ని ఇంటర్వ్యూలలో సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని హింట్ ఇవ్వడంతో మరింత డిసప్పాయింట్ లోకి వెళ్ళిపోయారు ఫ్యాన్స్.సలార్ విషయంలోనూ ఇలాగే జరిగిందని, నీల్ తన మేకింగ్ స్టైల్‌తో హీరోల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీల్ మేకింగ్‌పై వస్తున్న విమర్శలు
‘డ్రాగన్’ పేరుతో మళ్లీ పాత ఫార్ములానేనా?
ఇక ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పెట్టబోతున్నారని ఎప్పటి నుండో రూమర్స్ వినిపిస్తున్నాయ్. గతంలో ప్రభాస్‌ను డైనోసార్‌తో పోల్చిన నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌ను డ్రాగన్‌తో పోలుస్తున్నారట. మేకర్స్ ఏమంటారో చూడాలి. నిజానికి టైటిల్ వినడానికి బాగానే ఉన్నా మేకింగ్ పరంగా మళ్లీ అదే చీకటి సెట్లు, అదే ఎడారి పోరాటాలు చూపిస్తారా? అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.జోర్డాన్ ఎడారిలో తీసిన ఫైట్ సీక్వెన్స్ మేజర్ హైలైట్ అని చెబుతున్నా, ‘సలార్’ లోని కొన్ని సీన్లను ఇది పోలి ఉంటుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
కాస్టింగ్ పరంగా కొత్తదనం ఉందా?
రుక్మిణి వసంత్ హీరోయిన్ అని, అనిల్ కపూర్ పొలిటికల్ రోల్ అని ఊరిస్తున్నా.. ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ మీద పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద పెట్టారా? అన్నదే అసలు ప్రశ్న. ఇటీవల వైరల్ అయిన తారక్ కండలు తిరిగిన లుక్ చూసి మురిసిపోతున్న తారక్ ఫ్యాన్స్, సినిమా రిలీజ్ 2027కు వెళ్లడంతో అప్పటికి ఈ క్రేజ్ ఉంటుందా అని భయపడిపోతున్నారు.
‘డ్రాగన్’ టైటిల్‌తో వస్తున్నారా?
ఆ గ్లింప్స్ అయినా వస్తుందా?
ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో సినిమా నుండి ఏదైనా ఒక స్పెషల్ గ్లింప్స్ రాకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారంతా. మరి నీల్ అప్పుడైనా పెద్ద మనసు చేసుకొని టైటిల్ క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. అయితే నీల్ తన కెజిఎఫ్ 1 మరియు సలార్ సినిమాలు డిసెంబర్లో వచ్చి సూపర్ హిట్ అవడంతో ఈసారి కూడా తన ‘డిసెంబర్’ సెంటిమెంట్ కోసం సినిమాను ఇన్ని ఏళ్లు వెనక్కి నెడుతున్నాడన్న టాక్ వినిపిస్తుంది.మరి వినిపిస్తున్నట్టుగా ఈ డేట్ చేంజ్ ఎన్టీఆర్ కెరీర్‌కు ప్లస్ అవుతుందో లేక మైనస్ అవుతుందో కాలమే డిసైడ్ చేయాలి.
మొత్తానికి తారక్-నీల్ సినిమా విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి. సినిమా విడుదల కోసం మరింత కాలం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.


