
📌 Key Points
- NTR కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ‘NTRNeel’ మూవీ, భారీ అంచనాలు!
- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న భారీ చిత్రం!
- ఎన్టీఆర్ లుక్‌పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి, కొత్త లుక్ కోసం భారీ మార్పులు!
- చైనా, భూటాన్, ఇండియా సరిహద్దుల నేపథ్యంలో 1969 కాలం నాటి కథ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న NTRNeel చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ లుక్‌పై దర్శకుడి అసంతృప్తి!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రాబోతున్న ‘NTRNeel’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తున్నారు. రుక్మిని వసంత్ హీరోయిన్. 1969 కాలంలో చైనా, బూటాన్, ఇండియా సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తుండగా.. ఇప్పటి వరకు కర్ణాటక, విదేశాల్లో, భాగ్యనగరం ఇలా తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. అయితే.. తాజాగా ఈ ప్రాజెక్టు షూటింగ్‌కు తాత్కలిక బ్రేక్ పడినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్లలో ఎన్టీఆర్ లుక్‌పై దర్శకుడు పూర్తిగా సంతృప్తి చెందలేదని టాక్. దీంతో పాత్రకు మరింత పవర్‌ఫుల్‌గా సరిపోయేలా కొత్త లుక్‌ను డిజైన్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మార్పుల కోసం తారక్ తన బాడీ లాంగ్వేజ్, ఫిజిక్, స్టైల్ అన్నిటినీ పూర్తిగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాడట. పాత్రకు న్యాయం చేయడంలో ఎక్కడా రాజీ పడకుండా టీమ్ చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ లుక్ హైలైట్ కావాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుండగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.
కొత్త లుక్ కోసం తారక్ కసరత్తులు!
1969 బ్యాక్‌డ్రాప్‌లో భారీ యాక్షన్!
NTRNeel సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ సరికొత్త లుక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడండి.


