
ఎన్టీఆర్ నటించే ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంటుందని, దానిలో కేతిక శర్మ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.
Key Points
ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ చిత్రంలో నటిస్తున్నారు.
కేతిక శర్మ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయనున్నట్లు వార్తలు.
‘రొమాంటిక్’ సినిమాతో పరిచయమైన కేతిక శర్మ.
‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ప్రారంభం
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘డ్రాగన్’(Dragon). ఇక ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ సినిమా షూటింగ్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇందులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth), శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారక్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని సమాచారం. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఓ క్రేజీ బ్యూటీ తారక్‌తో కలిసి స్టెప్పులేయనుందని తెలుస్తుంది.
కేతిక శర్మ స్పెషల్ అప్పీయరెన్స్?
మరి ఆమె ఎవరో కాదండోయ్.. ‘రొమాంటిక్’(Romantic) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన క్రేజీ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma). నితిన్(Nithin) హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’(Robin Hood) సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అదిరిపోయే స్టెప్పులు వేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై నెటిజన్లు ఇది కదా అసలైన సర్‌ప్రైజు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నదాని పై త్వరలోనే క్లారిటీ రానుంది.
నెటిజన్ల స్పందన
A post shared by Cine Media (@cineeemedia)
ప్రస్తుతం ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది. కేతిక శర్మ ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించడం నిజమేనా అనేది త్వరలోనే తెలుస్తుంది.


