
📌 Key Points
- NTR మేకోవర్ చూసి షాక్ అయిన ఫ్యాన్స్, భారీ ఫైట్ సీన్స్ కోసం ఎదురుచూపు!
- ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ‘NTRNeel’ కీలక షెడ్యూల్, హాలీవుడ్ యాక్షన్ సీన్స్!
- విలన్ గ్యాంగ్ కోసం హాలీవుడ్ నటుడిని దింపుతున్న మేకర్స్, అంచనాలు భారీగా!
- ఎన్టీఆర్ బర్త్‌డేకు టీజర్ రిలీజ్ ప్లాన్, ఫ్యాన్స్‌కు పండగే పండగ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘NTRNeel’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిల్మ్ సిటీలో యాక్షన్ షెడ్యూల్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘NTRNeel’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఫుల్ మేకోవర్ అయ్యాడు ఎన్టీఆర్. అంతేకాకుండా తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలను సైతం నెట్టింట షేర్ చేస్తూ.. ‘నిశ్శబ్బం పెరిగేకొద్ది.. అంచనాలను ధ్వని రాబోతోంది’ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక ఆ ఫొటోల్లో ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతుండగా.. ఓ భారీ ఫైట్ సీన్స్ కోసమే ఇంతటి మేకోవర్ అని అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఆ షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్ సైతం నెట్టింట దర్శనమిచ్చింది. తాజాగా ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ఫిల్మ్ సిటీలో మొదలైందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తుండగా.. విలన్ గ్యాంగ్ కోసం ఓ హాలీవుడ్ యాక్టర్‌ని తీసుకొచ్చారని టాక్. అలాగే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్‌గా టీజర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని ఫిలిమ్ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తుండగా.. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని ప్రజెంట్ ఓ పోస్ట్ వైరల్ అవుతున్నది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.
హాలీవుడ్ నటుడు విలన్ గా!
బర్త్‌డేకు బిగ్ ట్రీట్!
ఎన్టీఆర్ బర్త్‌డేకు టీజర్ రాబోతుంది. ‘NTRNeel’ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


