|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

NTR : అమెరికాలో ఎన్టీఆర్ – నీల్ సినిమా..? అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ పోస్ట్ వైరల్..

Published: 16-09-2025, 12:47 PM
NTR : అమెరికాలో ఎన్టీఆర్ – నీల్ సినిమా..? అమెరికా కాన్సులేట్ హైదరాబాద్ పోస్ట్ వైరల్..

ఎన్టీఆర్ తాజా చిత్రం అమెరికాలో షూట్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. అమెరికా కాన్సులేట్ దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

ఎన్టీఆర్ తాజా చిత్రం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది.

2

అమెరికా కాన్సుల్ జనరల్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను షేర్ చేశారు.

4

అమెరికా-ఇండియా సహకారం ద్వారా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అమెరికా కాన్సులేట్ పేర్కొంది.

అమెరికాలో షూటింగ్

NTR : ఎన్టీఆర్ ఇటీవల వార్ 2 సినిమాతో రాగా ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆల్రెడీ కొంత షూటింగ్ కర్ణాటకలో జరుపుకుంది. అయితే ఈ సినిమా త్వరలో అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది సమాచారం.(NTR)

తాజాగా హైదరాబాద్ లో ఉన్న అమెరికా కాన్సుల్ జనరల్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలను అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసారు. ఈ ఫోటోలను షేర్ చేసి.. ఎన్టీఆర్ కు కాన్సులేట్ లోకి స్వాగతం. ఎన్టీఆర్ ప్రస్తుతం, రాబోయే ప్రాజెక్ట్స్ అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రమంలో అమెరికా – ఇండియా పార్టనర్ షిప్, జాబ్స్ క్రియేట్ చేయడం, ఇరు దేశాల మధ్య బంధం బలపడనుంది అని రాసుకొచ్చారు.

అమెరికా కాన్సులేట్ పోస్ట్

ఎన్టీఆర్ – నీల్ సినిమా వివరాలు

దీంతో ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ అమెరికాలో జరగబోతుందని, అందుకే ఎన్టీఆర్ US కాన్సులేట్ కి వెళ్లారని సమాచారం. మరి ఎన్టీఆర్ – నీల్ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఎన్టీఆర్-నీల్ చిత్రం అమెరికాలో షూటింగ్ తో భారీ అంచనాలను పెంచింది. ఈ చిత్రం విడుదల తేదీ మరియు ఇతర వివరాల కోసం మనం వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.