|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

9 కథలు తిరస్కరించి, 10వ కథతో డిజాస్టర్! ఎన్టీఆర్ కెరీర్‌లోని షాకింగ్ నిజం!

Published: 06-01-2026, 4:30 AM
9 కథలు తిరస్కరించి, 10వ కథతో డిజాస్టర్! ఎన్టీఆర్ కెరీర్‌లోని షాకింగ్ నిజం!
  • ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రం కోసం బోయపాటి చెప్పిన 9 కథలను తిరస్కరించాడు.
  • ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘దమ్ము’ సినిమా డిజాస్టర్ అయ్యి నిరాశను మిగిల్చింది.
  • అధిక హింస, బలహీనమైన స్క్రీన్‌ప్లే, లాజిక్ లేని మలుపులు సినిమా ప్లాప్‌కు కారణం.
  • ‘దమ్ము’ తర్వాత ఎన్టీఆర్-బోయపాటి మధ్య సినిమాలు, మాటలు లేవు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో కొన్ని చేదు అనుభవాలున్నాయి. బోయపాటి శ్రీను చెప్పిన 9 కథలు తిరస్కరించి, 10వ కథతో తీసిన ‘దమ్ము’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్‌కు గల కారణాలు, ఎన్టీఆర్ కెరీర్‌పై దాని ప్రభావం తెలుసుకుందాం.

9 కథలు తిరస్కరించి, 10వ కథకు ఓకే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హిట్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న తారక్.. గతంలో కొన్ని ప్లాప్ సినిమాలతో స్ట్రగుల్ ఫేస్ చేశాడు. వరుసగా రెండు మూడు ప్లాప్ సినిమాలు చూసిన సందర్భాలు కూడా ఎన్టీఆర్ కెరీర్ లో ఉన్నాయి. అయితే యంగ్ టైగర్ ఎంతో నమ్మకంతో హిట్ కొట్టాలన్న తపనతో చేసిన సినిమా ఒకటి డిజాస్టర్ అయ్యి ఆయనకు నిరాశను మిగిల్చింది. ఆ సినిమా కోసం దాదాపు 9 కథలను తారక్ రిజెక్ట్ చేశాడు. 10వ కథను ఒకే చేసి..అద్భుతం చేయాలని అనుకున్నాడు. కానీ ఈసినిమా రిజెల్ట్ మరీ ధారణంగా రావడంతో ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు దమ్ము.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో.. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన సినిమానే దమ్ము. ఈసినిమాకంటే ముందు సింహా సినిమాతో బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు బోయపాటి. అదే ఊపులో.. ఎన్టీఆర్ కోసం అద్బుతమైన కథను రాసుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కు అది నచ్చలేదు.. దాంతో మరొకటి… ఇంకొకటి.. ఇలా వరుసగా 9 కథలను ఎన్టీఆర్ కు వినిపించగా.. ఆయన అవన్నీ రిజెక్ట్ చేశాడు. ఆడియన్స్ , అభిమానులు ఇంకేదో కోరుకుంటున్నారని.. అలాంటి కథతో రమ్మని తారక్ బోయపాటితో అన్నారట. అలా పుట్టుకొచ్చిందే దమ్ము సినిమా. ఈసినిమా ఈవెంట్ లో తాను బోయపాటి చెప్పిన 9 కథలను రిజెక్ట్ చేశానని ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు.

‘దమ్ము’ డిజాస్టర్‌కు అసలు కారణాలు

దమ్ము సినిమా ప్లాప్ కు చాలా కారణాలు ఉన్నాయి.. ఈసినిమా కథలో మధ్య మధ్యలో మార్పులు చేసినట్టు మాచారం. సరైన స్క్రీన్ ప్లే లేకపోవడంతో పాటు.. దమ్ములో వైలెన్స్ చాలా ఎక్కవైపోయింది. కథ కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. కొన్నేళ్లుగా.. సుమన్ పాత్ర ఒక గదిలోపలే ఉండిపోవడం.. లాజిక్ లేకుండా మనుషులను చంపుకుంటూ వెళ్లిపోవడం.. ఓవర్ సెంటిమెంట్, ఓవర్ యాక్షన్ సీన్స్, డైలాగ్స్ లో అతి.. ఇలా దమ్ము సినిమా ప్రేక్షకులను విసిగించిందని చెప్పాలి. ఎన్టీఆర్ సినిమాపై ఎన్నో ఆశలతో వెళ్లిన ప్రేక్షకులకు తీవ్ర నిరాశను కలిగించింది ఈమూవీ. అంతే కాదు ఈసినిమా డిజాస్టర్ తరువాత ఎన్టీఆర్ బోయపాటితో సినిమాలు చేయలేదు. అంతే కాదు ఈ దర్శకుడితో తారక్ కు మాటలు కూడా లేవని సమాచారం.

బోయపాటితో ఎన్టీఆర్ బంధానికి బీటలు

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తారక్ ను చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నాడు దర్శకడు. ఈమూవీషూటింగ్ అయిపోయిన వెంటనే తారక్.. దేవర2 సెట్స్ లో జాయిన్ అవుతాడని సమాచారం. వీటితో పాటు… ఆయన ఖాతలో మరో రెండు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందుల అఫీషియల్ గా ఇంతక వరకూ ఏ సినిమాను తారక్ కన్ఫార్మ్ చేయలేదు.

‘దమ్ము’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో నిరాశ మిగిల్చినా, అది ఒక పాఠంగా మారింది. బోయపాటితో ఆయన బంధాన్ని కూడా ప్రభావితం చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన రాబోయే సినిమాలపై దృష్టి పెట్టి, విజయాల కోసం కృషి చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.